Telangana

News March 28, 2024

NZB: ఎంపీ బరిలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు

image

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలే గెలుపు కొరకు మళ్లీ నిజామాబాద్ పార్లమెంట్ బరిలో నిలిచారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఓటమి పాలైన బాజిరెడ్డి గోవర్ధన్ BRS నుంచి, కోరుట్ల ఎమ్మెల్యేగా ఓటమి పాలైన సిట్టింగ్ ఎంపీ అర్వింద్ ధర్మపురి BJP నుంచి, జగిత్యాల ఎమ్మెల్యేగా ఓటమి పాలైన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీచేయనున్నారు.

News March 28, 2024

ప్రజలకు సేవ చేయాలన్న స్పష్టమైన విజన్‌తో ఉన్నా: తాండ్ర

image

ఈ గడ్డ బిడ్డగా తాను 30 ఏళ్ల పాటు వ్యాపార, సాంకేతిక, సేవా రంగాల్లో గడించిన అనుభవంతో సేవ చేయాలన్న స్పష్టమైన విజన్‌తో ఉన్నట్లు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు చెప్పారు. గురువారం కొత్తగూడెం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. కొత్తగూడెం ప్రజలకు ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ చేస్తానన్నారు.

News March 28, 2024

BRSకు షాక్.. నీలం మధుతో ఎలక్షన్ రెడ్డి (PHOTO)

image

BRS‌కు షాక్‌ తగిలింది. మెదక్ కాంగ్రెస్ పార్టీ MP అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్ మాజీ ఛైర్మన్ గంగుమల్ల ఎలక్షన్ రెడ్డి ప్రత్యక్షమయ్యారు. ఇటీవల ఎలక్షన్ రెడ్డి BRSను వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో నీలం మధు, నర్సారెడ్డితో ఆయన భేటీ చర్చనీయాంశమైంది.

News March 28, 2024

ADB: బీఎస్పీ నుంచి ఎంపీ బరిలో బన్సీలాల్‌ రాథోడ్..!

image

ఆదిలాబాద్‌ ఎస్టీ రిజర్వుడ్‌ పార్లమెంట్‌ స్థానానికి బీఎస్పీ నుంచి ఖానాపూర్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బన్సీలాల్‌ రాథోడ్‌ బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ నుంచి గొడం నగేశ్, బీఆర్‌ఎస్‌ నుంచి ఆత్రం సక్కు, కాంగ్రెస్‌ నుంచి ఆత్రం సుగుణ బరిలో ఉన్న విషయం తెలిసిందే.

News March 28, 2024

తోలిసారి కోమటిరెడ్డి కుటుంబం కాకుండా..

image

కాంగ్రెస్‌ భువనగిరి ఎంపీ అభ్యర్థిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రకటించింది. 2009లో భువనగిరి నుంచి కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డి పోటీ చేసి CPMఅభ్యర్థి నోముల నర్సింహయ్యపై గెలుపొందారు. 2014లో TRS అభ్యర్థి బూర నర్సయ్యపై ఓడిపోయారు. 2019లో వెంకట్‌రెడ్డి నర్సయ్యపై గెలుపొందారు. ఈ నియోజకవర్గానికి నాలుగోసారి ఎన్నికలు జరుగుతుండగా.. కోమటిరెడ్డి కుటుంబం కాకుండా వేరే వ్యక్తి పోటీ చేస్తుండటం గమనార్హం.

News March 28, 2024

మధిర: ట్రాక్టర్ రోటవేటర్‌లో చెత్త తొలగిస్తుండగా రైతు మృతి

image

మధిర మండలం నిదానపురానికి చెందిన నర్సిరెడ్డి అనే రైతు తన వ్యవసాయ పొలంలో మిర్చి పంటను సాగు చేశాడు. మిర్చి పంట పూర్తి కాగా వ్యర్థాలను తొలగించడానికి రైతు ట్రాక్టర్ రోటవేటర్‌తో దున్నుతున్నాడు. రోటవేటర్‌లో చెత్త ఇరుక్కుపోయి ఆగిపోవడంతో చెత్తను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు రోటవేటర్‌లో పడిపోయాడు. తల నుజ్జు నుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 

News March 28, 2024

మహబూబాబాద్: విద్యుత్తు షాక్‌తో రైతు మృతి

image

విద్యుత్తుషాక్‌తో వ్యక్తి మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో జరిగింది. మదనపురం గ్రామశివారు ధూపతండాకు చెందిన మాలోతు బాలు గురువారం నీళ్లు పెట్టడానికి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్‌కు గురై బావిలో పడి ప్రాణాలొదిలాడు. స్థానికులు మృతదేహాన్ని వెలికితీశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2024

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌజ్ అరెస్ట్

image

BJP గోషామహల్‌ MLAను రాజాసింగ్‌ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. సాయంత్రం ఆయన చెంగిచర్ల‌కు వెళ్తానని ప్రకటించారు. శాంతిభద్రతల దృష్ట్యా‌ రాజాసింగ్‌ను ఆయన నివాసం వద్ద‌ అడ్డుకొన్నారు. పోలీసుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ పాలనకు, రేవంత్ రెడ్డి పాలనకు తేడా లేదు. కేసీఆర్ హయాంలో జరిగినట్లు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా హిందువులపై దాడులు జరుగుతున్నాయి’ అంటూ రాజాసింగ్ మండిపడ్డారు.

News March 28, 2024

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌజ్ అరెస్ట్

image

BJP గోషామహల్‌ MLAను రాజాసింగ్‌ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. సాయంత్రం ఆయన చెంగిచర్ల‌కు వెళ్తానని ప్రకటించారు. శాంతిభద్రతల దృష్ట్యా‌ రాజాసింగ్‌ను ఆయన నివాసం వద్ద‌ అడ్డుకొన్నారు. పోలీసుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ పాలనకు, రేవంత్ రెడ్డి పాలనకు తేడా లేదు. కేసీఆర్ హయాంలో జరిగినట్లు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా హిందువులపై దాడులు జరుగుతున్నాయి’ అంటూ రాజాసింగ్ మండిపడ్డారు.

News March 28, 2024

కర్ణాటకలో నిజామాబాద్ దంపతుల ఆత్మహత్య

image

నిజామాబాద్ నగరానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను గాయత్రీ నగర్ ప్రాంతానికి చెందిన మేడవరపు రాజు(55), మేడవరపు స్వాతి(53)గా పోలీసులు గుర్తించారు. వీరు కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లా సోమవార్ పేట్ పరిధిలోని లాడ్జిలో సూసైడ్ చేసుకున్నారు. ఈ మేరకు నిజామాబాద్‌కు సమాచారం అందించారు. ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.