Telangana

News March 28, 2024

డోర్నకల్: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

image

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన సీరోలు మండలం మోద్గులగడ్డ తండాలో చోటుచేసుకొంది. డోర్నకల్ SI సంతోష్ రావు వివరాల ప్రకారం.. వ్యవసాయ భూమిలో బోర్ వేసే విషయంలో గుగులోతు రాజేశ్వరి(34) భర్త వంశీ, అతని సోదరుడి మధ్య వివాదం జరిగింది. ఈ విషయం పై ఇంట్లో రాజేశ్వరి, వంశీ దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రాజేశ్వరి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

News March 28, 2024

కొండపాక: ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాస తీర్మానం

image

కొండపాక ఎంపీపీ అధ్యక్షురాలు రాగల సుగుణ దుర్గయ్యపై ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. గజ్వేల్ ఆర్డీవో బన్సీలాల్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బలపరీక్షలో తొమ్మిది మంది ఎంపీటీసీలు ఎంపీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. రెండ్రోజుల్లో వైస్ ఎంపీపీ పీఠానికి బలపరీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది.

News March 28, 2024

ఎండలు: ‘హైదరాబాద్‌లో బయటకురాకండి’

image

HYD, ఉమ్మడి RR జిల్లాల పరిధిలో మరో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో బోరబండ 40.6, మొయినాబాద్ 40.6, కందుకూరు 40.5, యాలాలలో 40.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయినట్లుగా TSDPS తెలిపింది. BP, షుగర్, చర్మ వ్యాధులు ఉన్నవారు 11AM నుంచి 4PM మధ్య బయటకురాకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ తాకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

News March 28, 2024

ఎండలు: ‘హైదరాబాద్‌లో బయటకురాకండి’

image

HYD, ఉమ్మడి RR జిల్లాల పరిధిలో మరో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో బోరబండ 40.6, మొయినాబాద్ 40.6, కందుకూరు 40.5, యాలాలలో 40.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయినట్లుగా TSDPS తెలిపింది. BP, షుగర్, చర్మ వ్యాధులు ఉన్నవారు 11AM నుంచి 4PM మధ్య బయటకురాకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ తాకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

News March 28, 2024

NRPT: తాతయ్య వర్ధంతికి వెళుతూ.. మనవడు మృతి

image

తాతయ్య వర్ధంతి కార్యక్రమానికి వెళుతూ.. రోడ్డు ప్రమాదానికి గురై నారాయణపేట జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అంకెన్ పల్లి గ్రామానికి చెందిన పవన్ కుమార్ (21) హైదరాబాదులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం పూలు, పండ్లు ఇతర సామగ్రిని తీసుకుని స్వగ్రామానికి వస్తుండగా.. మరికల్ మండలం ఎలిగండ్ల గ్రామం వద్ద లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

News March 28, 2024

ADB: మీ ఇంటి నుంచే వాతావరణ సమాచారం తెలుసుకోండి!

image

ప్రతి చోటా వాతావరణంం.. ఇంటింటికీ వాతావరణం పేరుతో భారత వాతావరణ విభాగం(IMD) ‘పంచాయత్ సేవా మౌసం యాప్‌’ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా నేరుగా ఇంటి నుంచే వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ సేవలు 12 భాషల్లో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఎండల తీవ్రత, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు, వడగాల్పులు పెరగనుండటంతో దీని ద్వారా ముందస్తుగా సమాచారం తెలుసుకోవచ్చు. కాగా, ఈ యాప్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.

News March 28, 2024

వివిధ లా కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ లా కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ప్రకటనలో తెలిపారు. ఐదేళ్ల బీబీఏ ఎల్ఎల్బీ, ఐదేళ్ల బీకామ్ ఎల్ఎల్బీ, మూడేళ్ల ఎల్ఎల్బీ, మూడేళ్ల ఎల్ఎల్బీ ఆనర్స్ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

News March 28, 2024

30 నుంచి భద్రాచలం-విశాఖకు లహరి నాన్ ఏసీ బస్సులు

image

భద్రాచలం-విశాఖపట్నంకి లహరి నాన్ ఏసీ బస్సులను ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు భద్రాచలం DM రామారావు తెలిపారు. శనివారం భద్రాచలం నుంచి ఉదయం 9 గంటలకు, రాత్రి 9 గంటలకు లహరి బస్సు బయలుదేరుతుందన్నారు. విశాఖపట్నం-భద్రాచలానికి ఉదయం 8 గంటలకు, రాత్రి 8:45 గంటలకు బస్సు ఉంటుందన్నారు.

News March 28, 2024

వరంగల్: మళ్లీ తగ్గిన పత్తి ధర 

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ఈరోజు క్వింటా పత్తి రూ.7200 ధర పలికింది. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు ధర తగ్గడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. మంగళవారం పత్తి ధర రూ.7,170 పలకగా.. బుధవారం రూ.7,310కి చేరింది. ఈరోజు మళ్ళీ తగ్గింది. రేపటినుండి మార్కెట్‌కు వరుస సెలవులు రానుండడంతో ఈరోజు పత్తి తరలివస్తోంది.

News March 28, 2024

HYD: రైల్వే స్టేషన్‌లో టికెట్ కొనుగోలు చాలా ఈజీ..!

image

HYD, RR, MDCL,VKB జిల్లాల రైల్వే ప్రయాణికులకు SCR గుడ్ న్యూస్ తెలిపింది. సికింద్రాబాద్, HYD, బేగంపేట, లింగంపల్లి, హైటెక్ సిటీ, వికారాబాద్ స్టేషన్లలో QR కోడ్ ద్వారా నగదు చెల్లింపుల సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలియజేశారు. బోర్డుపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్‌ కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. త్వరలో మిగతా స్టేషన్లలో అందుబాటులోకి తెస్తామన్నారు.