Telangana

News September 26, 2024

నిర్మల్: అరెస్టు అయిన ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్

image

నిర్మల్ జిల్లాకి చెందిన ఉపాధ్యాయులు దాసరి రమేశ్, వెంకటేశ్ గౌడ్‌‌ను బిట్ కాయిన్/క్రిప్టో కరెన్సీ మల్టీ లెవెల్ మార్కెటింగ్‌ కేసులో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై స్పందించి డీఈవో రవీందర్ రెడ్డి వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 26, 2024

NZB: ఈ నెల 30న ఆర్చరీ క్రీడాకారుల ఎంపికలు

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో భాగంగా ఈ నెల 30న ఆర్చరీ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ నిర్వహణ కార్యదర్శి నాగమణి తెలిపారు. ఈ ఎంపికలు నిజామాబాద్‌లోని నాగారంలో గల రాజారాం స్టేడియంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలోని పాఠశాలల్లో చదువుతున్న అండర్ 14, 17 బాల బాలికలు తమ బోనఫైడ్, సర్టిఫికెట్స్ తీసుకొని హాజరుకావాలన్నారు.

News September 26, 2024

NLG: ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

image

NLG జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. రైతుల ద్వారా బయోమెట్రిక్ లేదా ఐరిస్ సేకరించిన తర్వాతే ధాన్యం కొనుగోలు చేయాలనే విధానాన్ని అమలు చేయనున్నారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలలో గతంలో ఇచ్చిన బయోమెట్రిక్ పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

News September 26, 2024

GHMCలో చాకలి ఐలమ్మకు ఆమ్రపాలి నివాళి

image

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పూలమాలేసి నివాళులర్పించారు. మహిళల ధైర్యానికి, పట్టుదలకు ప్రతీకగా నిలిచిన ఆమె పోరాటాలను కమిషనర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News September 26, 2024

దుబ్బాక: మంత్రిని సన్మానించిన మెదక్ ఎంపీ

image

దుబ్బాక నియోజకవర్గానికి మొదటిసారి విచ్చేసిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖకి దుబ్బాక నేతన్నలు తయారు చేసిన నూలు పోగు చేసిన కండువాను బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దుబ్బాక అంటేనే చేనేత అని అన్నారు. నేతన్నల సమస్యలు పరిష్కరించాలని, వారి జీవితాల్లో వెలుగు నింపాలని ఎంపీ మంత్రిని కోరారు.

News September 26, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. నాగర్ కర్నూల్ జిల్లా ఎళ్లికలో 48.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా మాచుపల్లిలో 41.3 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా సోలిపూర్ లో 33.0 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా ఉట్కూరులో 20.5 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా కేంద్రంలో 14.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News September 26, 2024

MDK: బీఆర్ఎస్ పాలనలో సువర్ణ అధ్యాయం: హరీశ్‌రావు

image

తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన వ్యవసాయ రంగానికి ఒక సువర్ణ అధ్యాయమని హరీశ్‌ రావు అన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామి అని చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ అని, పత్తి ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉందన్నారు. పంటల సాగులో తెలంగాణ మేటి అని అన్నారు. దేశానికే మన తెలంగాణ ఆదర్శమని చెప్పారు. ఇదంతా మంత్రమేస్తేనో, మాయ చేస్తేనో జరిగింది కాదని ఎక్స్‌ వేదికగా తెలిపారు.

News September 26, 2024

రాజకీయ నాయకుడిగా రాలేదు.. ఊరి మనవడిగా వచ్చా: కేటీఆర్

image

తను రాజకీయ నాయకుడిగా రాలేదని, ఊరి మనవడిగా వచ్చానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో గురువారం తన అమ్మమ్మ-తాతయ్య జోగినిపల్లి లక్ష్మీబాయి-కేశవరావు స్మారకార్థం సొంత ఖర్చులతో నిర్మించిన ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. తన అనుబంధాన్ని పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు.

News September 26, 2024

తాంసీ: ఆ ఒక్క టీచర్ రాకపోతే బడికే తాళం..?

image

తాంసీ మండలంలోని గోట్కూరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి 5 వ తరగతి వరకు 53 మంది విద్యార్థులకు ఒకరే టీచర్ ఉన్నారు. ప్రస్తుతం ఉపాద్యాయురాలు రోజా రాణి ఒకరే అన్ని తానై విధులు నిర్వహిస్తున్నారు. సరి పడా టీచర్లు లేక పోవడంతో 3 నెలలు గా తమ పిల్లల  చదువును నష్ట పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

News September 26, 2024

వైభవంగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.