Telangana

News September 5, 2024

HYD: ఇబ్రహీంపట్నంలో ముగ్గురు ఆత్మహత్య

image

ఇబ్రహీంపట్నంలో విషాద ఘటన వెలుగుచూసింది. పెద్ద చెరువులో దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతులు హస్తినాపురానికి చెందిన మంగ కుమారి(తల్లి), శరత్(కుమారుడు), లావణ్య(కూతురు)గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. లావణ్య మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది.

News September 5, 2024

ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం

image

భద్రాది కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు కమిటీ డివిజన్ కమిటీ ఆజాద్ పేరుతో ములుగు జిల్లాలో మావోయిస్టు లేక కలకలం రేపుతుంది. రఘునాధపాలెంలోనే జరిగిన ఎన్కౌంటర్ విప్లవ ద్రోహుల పనేనని, మావోయిస్టు పార్టీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది ఒకటే ఎజెండా అన్నారు. ఈ ఎన్కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు. ఎన్ కౌంటర్‌కు నిరసనగా ఈనెల 9న భద్రాద్రి జిల్లా బందుకు పిలుపునిచ్చారు.

News September 5, 2024

నల్గొండను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: ఎస్పీ

image

మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన దాదాపు 130 మంది యువకులకు వారి తల్లితండ్రుల సమక్షంలో మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యువత మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఒక్కసారి వీటికి బానిసైతే జీవితంలో కోలుకోవడం చాలా కష్టం అవుతుందని అన్నారు.

News September 5, 2024

ఆర్గానిక్ పంటల సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు: త్రిపుర గవర్నర్

image

కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో గురువారం అభినవ్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం సాగు చేస్తున్న విధానాన్ని త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి డ్రోన్ పథకం ద్వారా సులభతరమైన పద్ధతిలో వ్యవసాయం చేయవచ్చన్నారు. ప్రస్తుత కాలంలో ప్రకృతి వ్యవసాయం చాలా అవసరమని, ఆర్గానిక్ పంటల సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయని అన్నారు.

News September 5, 2024

WGL: రేపు నిర్వహించే జాబ్ మేళా వాయిదా

image

జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో సెప్టెంబర్ 6 శుక్రవారం (రేపు) నిర్వహించే జాబ్ మేళా రద్దు అయినట్లు వరంగల్ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఉమారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జాబ్ మేళను వాయిదా వేసినట్లు వారు తెలిపారు. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో త్వరలో తెలుపుతాం అన్నారు.

News September 5, 2024

పంతం నెగ్గించుకున్న హరీశ్ రావు

image

సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పంతం నెగ్గించుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించకపోవడంతో హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలు మేరకు గురువారం లబ్ధిదారులకు వాటిని పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడితే చెక్కుల పంపిణీ కోసం హైకోర్టు ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

News September 5, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు ఇలా..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా సిరిసనగండ్లలో 9.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గద్వాల జిల్లా గట్టులో 7.5 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా మాచుపల్లిలో 7.5 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా దగడలో 2.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా కేంద్రంలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News September 5, 2024

విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలి: విజయేంద్రప్రసాద్

image

ఉపాధ్యాయులు విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని కవి, రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఈరోజు నల్లగొండలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు దొరకడం లేదని, అలాంటి పరిస్థితిని ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో కల్పించాలని కోరారు.

News September 5, 2024

WGL: గురువులు జీవితాన్ని ఇస్తారు: ఎంపీ కావ్య

image

తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువులు జీవితాన్నిస్తారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. వరంగల్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవం వేడుకల్లో ఎంపీ పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. చదువు చెప్పే వారు మాత్రమే గురువులు కాదని, సన్మార్గంలో నడిపించే ప్రతి ఒక్కరూ గురువులేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

News September 5, 2024

HYD: పూడికతీతల్లో అధికారుల చేతివాటం

image

క్షేత్రస్థాయిలో పనిచేసే పలువురు సహాయ ఇంజినీర్లు, కార్యనిర్వాహక ఇంజినీర్లు గుత్తేదారులతో చేతులు కలిపి అవకతవకలకు తెరలేపారు. నాలాల్లో పూడిక తొలగించకుండానే కొందరు గుత్తేదారులు పెట్టిన బిల్లులకు, ఇంజనీర్లు నిధులు మంజూరు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూడికతీత, ఎంఈటీ పనులకు ఒకే బృందం పని చేయడంతో ఏ పనీ సరిగ్గా జరగట్లేదనే విమర్శలొస్తున్నాయి. పనుల లోపంతోనే డ్రైనేజీ సమస్యలు ఏర్పడుతున్నాయి.