India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
*ఇబ్రహీంపట్నం ఏఎస్సై రామయ్య సస్పెండ్.
*మల్లాపూర్ మండలంలో తేనెటీగల దాడిలో బర్ల కాపరి మృతి.
*కాటారం మండలంలో ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య.
*జగిత్యాలలో మత్తులో మైనర్ల హంగామా.
*వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలన్న జగిత్యాల కలెక్టర్.
*ఇఫ్తార్ విందులో పాల్గొన్న పెద్దపల్లి కలెక్టర్.
*కరీంనగర్‌లో నలుగురు బైక్ దొంగల అరెస్ట్.
*ఎల్లారెడ్డిపేట మండలంలో దొంగకు దేహశుద్ధి.
HYDలో దారుణఘటన వెలుగుచూసింది. మద్యానికి డబ్బులివ్వలేదని భార్యను చంపేశాడో భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడలోని రహీంపురకాలనీకి చెందిన అబ్దుల్ సలీమ్, ఆస్మా ఫాతిమా దంపతులు. నిత్యం మద్యం సేవించి భార్యతో సలీమ్ గొడవపడేవాడు. మంగళవారం రాత్రి మందు తాగేందుకు డబ్బులివ్వాలని అడిగాడు. ఫాతిమా ఇవ్వకపోవడంతో గొంతునులిమి చంపేశాడని వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన కావలి వెంకటేష్ వేక్ (WAKE) యాప్‌లో రూ.1, 75,000 పోగొట్టుకున్నాడని ఎస్సై జలంధర్ రెడ్డి తెలిపారు. బాధితుడు సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం ఇచ్చారని చెప్పారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. బుధవారం గరిష్టంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఉష్ణోగ్రతలు గత ఏడాది కంటే ఈ సారి అధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దీంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగాల్పులు వీస్తున్నాయి. ఈ కారణంగా మధ్యాహ్న సమయంలో ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. అటు రాత్రి వేళల్లో ఉక్కపోత కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు.
మెదక్ జిల్లా టేక్మాల్ మండలం తంపులూరులో దుబ్బగళ్ల సంగమ్మ (44)ను వరసకు అల్లుడు హత్య చేసినట్లు అల్లాదుర్గం CI రేణుక రెడ్డి, SI మురళి తెలిపారు. ఈ నెల 20న సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం మర్వెల్లికి చెందిన మల్లగుల్ల యేసు ఆమె ఇంటికి వచ్చాడు. రాత్రి ఆస్తి కోసం సంగమ్మను యేసు హత్య చేసి, ఆభరణాలు తీసుకొని పారిపోయినట్లు వివరించారు. ఈరోజు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
మిర్యాలగూడ పట్టణంలో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు చేసినట్లు తెలుస్తోంది. మూడు ఇళ్లపై బుధవారం పోలీసులు దాడి చేసి పదిమంది మహిళలతో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. పోలీసులు పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లో అనుమానాస్పద ఇండ్లలో తనిఖీలు చేసి 11 మందిని అదుపులో తీసుకున్నట్లు సమాచారం. దీని వెనుక ఉన్న సూత్ర, పాత్రధారులు ఎవరు..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంశం తెర మీదకు వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నల్లగొండ జిల్లాను మూడు జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయనున్నట్లు తెలుస్తోంది. జిల్లాల కుదింపులో సూర్యాపేట జిల్లా తొలగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. లోక్‌సభ అభ్యర్థులు నిబంధనలను ఉల్లంఘిస్తే గుర్తించడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ప్రత్యేక బృందాలను నియమించింది. ప్రత్యేకబృందానికి కేటాయించిన వాహనానికి సీసీ కెమెరా ఏర్పాటు చేసి ఉంది. ఈ బృందం రాజకీయ పార్టీల కార్యక్రమాలు, అభ్యర్థుల ర్యాలీలు జరిగే చోటుకు వెళితే చాలు అవన్నీ కెమెరాలో రికార్డయి అధికారులకు సమాచారం పోతుంది.
సీఎం రేవంత్‌పై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందన్, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ బుధవారం నిజామాబాద్ 1టౌన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తాహెర్ మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ పాలన సాగిస్తున్నారు. ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
ఉమ్మడి పాలమూరులో భానుడి భగభగలు మరింత తీవ్రమవుతున్నాయి. జిల్లాలో గరిష్ఠంగా 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సందర్భంగా ఆరు బయట పనిచేసే వారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు. వడదెబ్బకు గురి కాకుండా కొబ్బరినీళ్లు తీసుకోవాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.