India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇటీవల విడుదలైన ఉద్యోగ ప్రకటనలతో నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రభుత్వ కొలువులు సాధించేందుకు కసరత్తు ప్రారంభించారు. తొలి ప్రయత్నంలోనే సాధించాలని కొందరు, ఈసారైనా కల నెరవేర్చుకోవాలని మరికొందరు పోటీ పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో అభ్యర్థులు ఉదయం నుంచి రాత్రి వరకు గ్రంథాలయాల్లో సాధన చేస్తున్నారు. అక్కడి వసతులను ఉపయోగించుకుని అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు శ్రమిస్తున్నారు.
జగిత్యాలలోని మహాలక్ష్మినగర్ బైపాస్ దగ్గర మంగళవారం సాయంత్రం మత్తులో ఉన్న నలుగురు మైనర్లు హంగామా సృష్టించారు. విచిత్రంగా ప్రవర్తిస్తూ ఇళ్ల ముందు నిలిపిన బైకులను తన్ని కింద పడేశారు. కేకలు వేస్తూ రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్థానికులు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ వారికి ఫిర్యాదు చేయగా వారిని పట్టుకోవడానికి వచ్చిన సిబ్బందిపై దాడికి యత్నించారు. ఒకరిని పట్టుకోగా ముగ్గురు పారిపోయారు.
నేరడిగొండ మండలం మర్లపల్లికి చెందిన జాదవ్ కిరణ్ జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల రామాయంపేటలో జరిగిన రాష్ట్రస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో అండర్-18 విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రజత పతకాన్ని సాధించారు. ఈనెల 28 నుంచి 31 వరకు హరియాణాలో నిర్వహించే జాతీయస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఓ కార్మికుడు మృతిచెందిన ఘటన HYD KPHB PS పరిధిలో జరిగింది. SI సుమన్ తెలిపిన వివరాలు.. బాలానగర్ వాసి పవన్(35) ఫ్యాబ్రికేషన్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. KPHB రోడ్ నం.1లోని ఐరిస్ షోరూమ్ షట్టర్ మరమ్మతులు చేసేందుకు వచ్చాడు. నిచ్చెన వేసుకుని మరమ్మతులు చేస్తుండగా షట్టర్ రాడ్డు హైటెన్షన్ విద్యుత్ తీగకు తగిలింది. దీంతో కరెంట్ షాక్‌కు గురై కింద ఇనుప రాడ్డుపై పడటంతో అది మెడకు గుచ్చుకొని మృతిచెందాడు.

మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఏదైనా పని మీద బయటకు వస్తే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. వడదెబ్బ తగిలితే తల తిరగడం, కళ్లు బైర్లు కమ్మడం, నాలుక తడి ఆరిపోతుంది. అలాగే గుండె వేగంగా కొట్టుకోవడం, దాహంగా అనిపిస్తుంది. వాంతులు, విరేచనాలు కూడా అవుతాయి. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. బయటికి వెళ్తే కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. మధ్యాహ్నం పూట లేత రంగు బట్టలు ధరించాలి.
ఉప్పల్‌లో ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో శుభవార్త తెలిపింది. ఉప్పల్ స్టేడియం, నాగోల్, ఎన్.జీ.ఆర్.ఐ స్టేషన్లలో అర్ధరాత్రి మెట్రో అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. రాత్రి 12.15 గంటలకు మెట్రో ట్రైన్ ప్రారంభమై 1.10 గంటలకు చివరి స్టాప్‌కు చేరుకుంటుందని తెలిపారు. ఈ సౌకర్యాన్ని ఐపీఎల్ మ్యాచ్‌కు వచ్చేవారు వినియోగించుకోవాలని సూచించారు.

జూలూరుపాడు మండలం పడమట నర్సాపురానికి చెందిన బాదావత్ రాందాస్ ఆర్టీసీలో బస్సులో ప్రయాణిస్తూ మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. రాందాస్ ఇటీవల అనారోగ్యానికి గురవడంతో తన భార్యతో కలిసి చికిత్స నిమిత్తం బస్సులో హైదరాబాద్‌కు బయల్దేరాడు. మార్గమధ్యలో బస్సు చిట్యాల శివారులో రాందాస్‌కు గుండెనొప్పి వచ్చింది. సీపీఆర్ చేసినా ప్రాణాలు దక్కలేదని ప్రయాణికులు చెప్పారు.
పాలమూరు పార్లమెంటు నియోజకవర్గం మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. గత ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులే మళ్లీ పోటీపడుతూ గత ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేలా వ్యూహాలు రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఉండడంతో పాటు ఎమ్మెల్యేలను, ముఖ్య నాయకులకు ఎప్పటికీ అప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.