India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో 16 మంది నాయకులపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆరేళ్ల పాటు వారిపై సస్పెన్షన్ విధిస్తూ పార్టీ పట్టణ అధ్యక్షుడు నగేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. వేటుకు గురైన వారిలో ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారు. వారితో పాటు పార్టీ క్రమశిక్షణ చర్యల కింద పలువురు నాయకులకు సైతం బహిష్కరించినట్లు పేర్కొన్నారు.
బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ఆలయం పక్షాన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ విజయరామారావు ఓ ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి చివరి రోజు గురుపౌర్ణమి ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 13 ఎస్హెచ్ఓ స్టేషన్లు ఉన్నాయి. అన్నీ ఖమ్మంలో ఉన్న ఉప కమిషనర్ కార్యాలయం పర్యవేక్షణలో పని చేస్తున్నాయి. ఆరేళ్లలో ఒక్క ఎన్ఫోర్స్మెంట్ విభాగం 9,008 కిలోల గంజాయిని పట్టుకొంది. ఎన్ఫోర్స్మెంట్, రెండు జిల్లాల్లోని జిల్లా టాస్క్ ఫోర్స్ బృందాలు కేసులను ఆయా పరిధి స్టేషన్లలో నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే స్టేషన్లలో మూలుగుతున్న గంజాయి కలిసి స్టేషన్లలో కుప్పలు పేరుకుపోతున్నాయి.
కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. గురువారం సాయంత్రం 22 అడుగులు ఉన్న నీటిమట్టం శుక్రవారం ఉదయానికి 24 అడుగులకు చేరుకుంది. ఎగువున భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి మరింత పెరిగే సూచనలు ఉన్నాయని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఓ యువకుడు పీరు మోస్తూ.. కుప్పకూలిన ఘటన వనపర్తి మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. సవాయిగూడెం గ్రామానికి చెందిన గువ్వల మధుసుదన్(29) గురువారం పీరు ఎత్తుకొని గ్రామంలో ఊరేగిస్తుండగా గుండెనొప్పికి గురయ్యాడు. స్థానికులు వనపర్తి ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మధుసుదన్‌కు భార్యా, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె పుట్టుకతో దివ్యాంగురాలు.
పెద్దపల్లి జిల్లాలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల వివరాలు.. కమాన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన రెడ్డి అభిలాశ్ (20) పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాగా కొద్ది రోజులుగా కుటుంబీకులతో కలిసి యైటింక్లయిన్ కాలనీ క్వార్టర్స్‌లో ఉన్నాడు. గురువారం అక్కడి నుంచి కమాన్‌పూర్‌కి వచ్చిన అభిలాశ్.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి తల్లి ఫిర్యాదు మేరకు SI చంద్రశేఖర్ కేసు నమోదు చేశారు.
ప్రేమ పేరుతో 14ఏళ్ల బాలికను లోబర్చుకుని ఏడాదిగా హత్యాచారం చేసిన ఘటన HYD మీర్‌పేట్‌లో జరిగింది. పోలీసుల కథనం.. బీహార్‌కు చెందిన కుటుంబం స్థానికంగా టిఫిన్ సెంటర్ నడుపుతోంది. పాన్‌షాప్ నిర్వాహించే రాకేశ్ ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. ఏడాదిగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈక్రమంలో తాను గర్భం దాల్చిన విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రేమ పేరుతో 14ఏళ్ల బాలికను లోబర్చుకుని ఏడాదిగా హత్యాచారం చేసిన ఘటన HYD మీర్‌పేట్‌లో జరిగింది. పోలీసుల కథనం.. బీహార్‌కు చెందిన కుటుంబం స్థానికంగా నివసిస్తోంది. పాన్‌షాప్ నిర్వాహించే రాకేశ్ ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. ఏడాదిగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈక్రమంలో తాను గర్భం దాల్చిన విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కేవలం రెండు కేంద్రాలను మాత్రమే అధికారులు ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ పాతిమా విద్యాలయం, జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాలలో డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు నిర్వహించిన పరీక్ష కేంద్రాలకు 647 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 81 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ప్రతి రోజు 728 మంది అభ్యర్థులకు ఉదయం, మధ్యాహ్నం రెండూ పూటలు పరీక్షలు నిర్వహించనున్నారు.
కూసుమంచి మండలంలోని మునిగేపల్లి వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు గుర్తించిన పాద ముద్రలు చిరుత పులివి కావని అటవీ రేంజి అధికారి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఓ వ్యవసాయ క్షేత్రంలో పాదముద్రలను గుర్తించిన కౌలు రైతు గ్రామ కార్యదర్శికి సమాచారం ఇచ్చాడు. గ్రామ కార్యదర్శి నరేశ్ ద్వారా సమాచారం అందుకున్న రేంజర్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈసందర్భంగా తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
Sorry, no posts matched your criteria.