Telangana

News March 26, 2024

హైదరాబాద్: RTC X రోడ్స్‌లో IPL టికెట్ల విక్రయం

image

హైదరాబాద్ RTC X రోడ్స్‌లో చిక్కడపల్లి పోలీసులు మంగళవారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. IPL టికెట్లు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు రైడ్స్ చేశారు. విజయ్, ప్రణయ్, సాత్విక్‌ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకొన్నారు. రేపటి SRH VS MI మ్యాచ్ టికెట్లు‌ బ్లాక్‌లో అమ్ముతున్నట్లు గుర్తించారు. ముగ్గురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 26, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 68 వేల నగదు సీజ్ . @ ధర్మారం మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు. @ వేములవాడలో కుక్కను తప్పించబోయి బోల్తా పడిన కారు. @ లైసెన్సుడ్ గన్ లను సరెండర్ చేయాలన్న రామగుండం పోలీస్ కమిషనర్. @ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. @ వివాహితను ట్రాప్ చేసిన ఇబ్రహీంపట్నం ఏఎస్ఐ ఎస్పీ ఆఫీస్ కు అటాచ్.

News March 26, 2024

MNCL: విద్యుత్ షాక్ తగిలి ఒకరి మృతి

image

విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో చోటు చేసుకుంది. వివరాలు చూస్తే… మండలంలోని తాళ్లపేట గ్రామానికి చెందిన సిద్ధం పుల్లయ్య (82) అనే వృద్ధుడు తన ఇంటి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ షాక్ తగిలి పుల్లయ్య మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపించారు.

News March 26, 2024

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తుమ్మల తనయుడు

image

ఖమ్మం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగేందర్ మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కలయికలో యుగేందర్ పలు అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. కాగా రేపు కాంగ్రెస్ పార్టీ సీఈసీ మీటింగ్ ఢిల్లీలో జరుగుతున్న నేపథ్యంలో తనను పార్టీ అభ్యర్థిగా ఖరారు చేయాలని యుగేందర్ సీఎంను కోరినట్లు సమాచారం.

News March 26, 2024

జహీరాబాద్: అడవిలో అస్థిపంజరం..!

image

జహీరాబాద్ మం. తూముకుంట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని అస్థిపంజరం లభ్యమైనట్లు రూరల్ SI ప్రసాద్ రావు తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఫారెస్ట్ అధికారులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లినట్లు పేర్కొన్నారు. 60 నుంచి 65 సంవత్సరాల మధ్యగల వృద్ధుడి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి, ఎముకల మాత్రమే మిగిలినట్లు గుర్తించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు SI వివరణ ఇచ్చారు.

News March 26, 2024

రాష్ట్రంలో ఆదిలాబాద్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రత

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడు ఠారెత్తిస్తున్నాడు.. ఇవాళ రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. తలమడుగు, సాత్నాలలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రత మరింతే పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.

News March 26, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!

image

✔వంద శాతం పంట నష్టం నగదు జమ చేస్తాం: మంత్రి జూపల్లి
✔ఫారుక్ నగర్: చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి
✔MBNR:ఉమ్మడి జిల్లాలో పడిపోయిన భూగర్భ జలాలు
✔నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు:MBNR ఎమ్మెల్యే
✔’వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి’: ఉమ్మడి జిల్లా కలెక్టర్లు
✔క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు:SP
✔TET ఫీజు తగ్గించాలి:PYL
✔MBNR:DEOపై చర్యలు తీసుకోవాలని CS కు ఫిర్యాదు
✔ఉపాధి హామీ పనులపై ఫోకస్

News March 26, 2024

తన రాజకీయ వారసుడిని ప్రకటించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి

image

మాజీ స్పీకర్, బాన్సువాడ MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి తన రాజకీయ వారసుడిని ప్రకటించారు. ఆయన తనయుడు, ఉమ్మడి NZB జిల్లా మాజీ డీసీసీబీ ఛైర్మెన్, పోచారం భాస్కర్ రెడ్డి పేరును ఆయన వెల్లడించారు. మంగళవారం బాన్సువాడ శివారులోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా భాస్కర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

News March 26, 2024

మల్యాల: మాజీ భార్య రెండో పెళ్లిచేసుకుందని హత్య చేశాడు!

image

ఇటీవల మల్యాల మండలం మ్యాడంపల్లిలో జరిగిన హత్య మిస్టరీ వీడింది. మాజీ భార్య రెండోపెళ్లిని తట్టుకోలేక ఓ భర్త ఆమెను హతమర్చాడు. సీఐ నీలం రవి తెలిపిన వివరాలు.. గొల్లపల్లి మండలం అగ్గిమల్లకు చెందిన కొల్లూరి నరేశ్, యదాద్రి చెందిన కరిపే అంజలికి 2020 పెళ్లిచేసుకుని విడిపోయారు. తరచూ ఆమెకు ఫోను చేస్తూ వేధించేవాడు. ఈక్రమంలో ఆమె రెండోపెళ్లి చేసుకుంది. ఇది జీర్ణించుకులేక ఈ నెల 17న రప్పించి ఆమెను హత్య చేశాడు.

News March 26, 2024

‘రజాకర్’ సినిమా ఉచిత ప్రదర్శన

image

ఇటీవల విడుదలైన ‘రజాకార్’ సినిమాను వలిగొండ మండల కేంద్రంలోని వెంకటేశ్వర థియేటర్లో రేపు మార్నింగ్, మ్యాట్నీ షోలు వేయనున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ సహకారంతో ఉచితంగా ప్రదర్శించనున్నట్లు నాయకులు పేర్కొన్నారు. మరుగున పడ్డ తెలంగాణ చరిత్రను రజాకార్ సినిమా ద్వారా ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలన్నారు.