Telangana

News April 19, 2024

MNCL: రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి

image

మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం ఉదయం రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. మృతురాలు డార్క్ బ్రౌన్ రంగు పూల చీర, బ్రౌన్ కలర్ డాట్స్ బ్లౌజ్, ఆకుపచ్చ పసుపు పచ్చ గాజులు ధరించి ఉంది. జీఆర్పీ ఎస్ఐ సుధాకర్ ఉత్తర్వు మేరకు హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 8712658596, 8328512176 నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

News April 19, 2024

24న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నామినేషన్

image

ఈనెల 24వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఆయన హైదరాబాదులో బీఫామ్ అందుకున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ రానున్నట్లు తెలిసింది.

News April 19, 2024

ప్రధాని మోదీ ప్రోత్సాహంతో తెలంగాణలో వెలుగులు: ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి

image

భారతదేశ ప్రధాని మోదీ ప్రోత్సాహంతో తెలంగాణలో వెలుగులు నిండాయని నల్గొండ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నల్లగొండ పార్లమెంటు పరిధిలో శుక్రవారం పలు నియోజకవర్గంలో పర్యటన చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు, మౌలిక వస్తువుల నిర్మాణం, నగదు బదిలీ ద్వారా గత పదేళ్ల లో 10 లక్షల కోట్లు తెలంగాణకు మోదీ ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు.

News April 19, 2024

MBNR: CM పర్యటనకు భారీ భద్రత

image

జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చంద్ర రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న క్రమంలో జిల్లా పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాటు చేసింది.CM పర్యటనకు మొత్తం 1,500 మందితో పోలీసులు బందోబస్తు ఉండనున్నారు. నలుగురు ASPలు, DSPలు 15,CIలు 75,SIలు,100 ADIలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు కలిపి 1,306 మంది విధుల్లో ఉండనున్నారు.

News April 19, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✒నేడు పాలమూరుకు CM రేవంత్ రెడ్డి రాక
✒ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న వార్షిక పరీక్షలు
✒SA-2 మార్కులు నమోదు చేయండి:DEOలు
✒వేసవి క్రీడలపై అధికారుల ఫోకస్
✒CM పర్యటనకు భారీ భద్రత:SP హర్షవర్ధన్
✒నేడు నామినేషన్ వెయ్యనున్న ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి,వంశీ చంద్ రెడ్డి,స్వతంత్ర అభ్యర్థులు
✒పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు
✒నేడు సివిల్ ర్యాంకర్లకు సన్మానించనున్న CM,జిల్లా నేతలు
✒ఉపాధి హామీ పనులపై అధికారుల నజర్

News April 19, 2024

ఖమ్మం: తగ్గిన మిర్చి, పత్తి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించారు. మిర్చి జెండా పాట క్వింట రూ.19500, పత్తి క్వింటా జండా పాట 7150 రూపాయలు ధర పలికినట్లు అధికారులు వెల్లడించారు. నిన్నటి కంటే ఈరోజు భారీగా ధర తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి కంటే ఈరోజు మిర్చి 500, పత్తి 150 రూపాయలు తగ్గింది.

News April 19, 2024

బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉంది: మంత్రి తుమ్మల

image

పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ కు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. 400 సీట్లు గెలుచుకుంటామంటూ బీజేపీ మ్యాజిక్ చేసే ప్రయత్నం చేస్తోందని రెండు సార్లు ప్రజలను మోసం చేసిన మోదీ మూడోసారి మోసం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు.

News April 19, 2024

HYD: గ్రేటర్‌లో 4,053 మెగావాట్ల విద్యుత్ వినియోగం

image

గ్రేటర్‌లో గురువారం రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైంది. గతంలో నమోదైన రికార్డులను బ్రేక్ చేస్తూ.. గురువారం ఏకంగా 4,053 మెగావాట్లు నమోదు కావడం విశేషం. 2023 మే 19న అత్యధికంగా 3,756 మెగావాట్లు నమోదు కాగా.. 2024 ఏప్రిల్ 1న 3,832 మెగావాట్లు నమోదైంది. డిస్కం చరిత్రలో ఈ స్థాయిలో విద్యుత్ వినియోగం జరగడం ఇదే తొలిసారి.

News April 19, 2024

NGKL: BJP అభ్యర్థి భరత్ ప్రసాద్ ఆస్తుల వివరాలు

image

నాగర్ కర్నూల్ బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ తన కుటుంబానికి రూ.33.85 లక్షల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. ఇందులో రూ.15.86 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయన్నారు. తనపై కేసుల్లేవన్నారు. సొంత కారు లేదని, చేతిలో నగదు రూ.2 లక్షలు ఉన్నాయని, బైక్, 15 తులాల బంగారంతో కలిపి రూ.17.99 లక్షల చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. కల్వకుర్తి మండలం గుండూరులో 7.02 ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు.

News April 19, 2024

కలెక్టరేట్ ఆవరణలో 144 సెక్షన్ విధింపు

image

లోక్ సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయ పరిధిలో 144 సెక్షన్ విధించినట్లు రాచకొండ భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. రిటర్నింగ్ కార్యాలయం ఏర్పాటు చేసినందున కలెక్టరేట్ ప్రాంగణం బయట 100 మీటర్ల వరకు ఈ నిబంధన వర్తిస్తుందని ఐదుగురు కన్నా ఎక్కువమంది గుమిగూడరాదని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 29 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయన్నారు.