Telangana

News March 26, 2024

MBNR:గడువు పొడగింపు..దరఖాస్తుల ఆహ్వానం!

image

సాంఘిక,గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికిగాను 6-9 తరగతుల్లో ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించారని ఎస్సీ గురుకుల విద్యాలయాల మహబూబ్ నగర్ తూర్పు ప్రాంతీయ సమన్వయకర్త విద్యుల్లత తెలిపారు.ఆయా వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని సీట్లు కేటాయిస్తామని, అర్హులైన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News March 26, 2024

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.7170

image

మూడు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఈరోజు పున: ప్రారంభమైంది. దీంతో మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు మార్కెట్‌కు భారీగా పత్తి తరలివచ్చింది. అయితే గత వారంతో పోలిస్తే ఈరోజు పత్తి ధర భారీగా తగ్గింది. గత వారం క్వింటా పత్తి రూ.7300 కి పైగా పలకగా.. ఈరోజు రూ.7170కి పడిపోయినట్లు అధికారులు తెలిపారు. 

News March 26, 2024

జగిత్యాల: రెండు కుటుంబాల్లో చిచ్చుపెట్టిన హోలీ వేడుకలు

image

హోలీ వేడుకలు రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీశాయి. జగిత్యాల జిల్లా తిప్పన్నపేట గ్రామంలో హోలీ వేడుకలో యువకుడు విసిరిన కోడిగుడ్డు పక్కింటిపై పడటంతో వివాదం జరిగింది. కోడిగుడ్డు విసిరిన ప్రకాష్ అనే యువకుడుని పక్కింట్లో ఉండే రమ ప్రశ్నించడంతో ప్రకాష్ కొడవలితో దాడికి దిగాడు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రమను స్థానికులు జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.

News March 26, 2024

HYD: లైంగికంగా వేధిస్తున్నాడని కత్తితో పొడిచాడు..!

image

లైంగిక వేధింపులు తాళలేక ఓ యువకుడు ఓ వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన HYD ఘట్‌కేసర్ పరిధిలో జరిగింది. CI తెలిపిన వివరాలు.. జనగామ వాసి భీమానాయక్‌తో బిహార్ వాసి మితేశ్‌కు పరిచయం ఏర్పడింది. పని ఇప్పిస్తానని, తన దగ్గరకు రావాలని భీమానాయక్ మితేశ్‌ను లైంగికంగా వేధిస్తున్నాడు. కోపం పెంచుకున్న మితేశ్ అతడిని కొండాపూర్‌కు పిలిచి, మద్యం తాగిన అనంతరం కత్తితో దాడి చేశాడు. మితేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

News March 26, 2024

MDK: ఒంటరిగా వెళ్లేవారే వీరి TARGET.. జర జాగ్రత్త!

image

ఒంటరిగా వెళుతున్న వారే లక్ష్యంగా దారి దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీసులు అరెస్టు చేశారు. CI ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాలు.. పటాన్‌చెరులో ఉంటున్న ఏడుగురు సభ్యుల ముఠా ఒంటరి మహిళలనే లక్ష్యంగా చేసుకొని దారి దోపిడీలకు పాల్పడుతోంది. సోమవారం ఇంద్రేశం వద్ద ORR సర్వీస్ రహదారిలో వాహనాలను తనిఖీ చేస్తుండగా పారిపోతున్న వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

News March 26, 2024

రోడ్డుపై పసికందు.. వారిపైనే అనుమానం!

image

చండూరు పరిధిలోని బంగారిగడ్డలో ఓ పసికందును పడవేసిన ఘటన కలకలం సృష్టించింది. అయితే ఇది అవివాహితులు ఎక్కడో ప్రసవించి ఇక్కడ వదిలివేసి వెళ్లినట్లు ICDS అధికారులు అనుమానిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.

News March 26, 2024

ఎల్లారెడ్డిలో బైక్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి

image

కామారెడ్డి జిల్లాలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ మహేశ్ వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి నుంచి నిజాంసాగర్ వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు మహమ్మద్ నగర్ మండలం అసన్ పల్లికి చెందిన కురుమ ప్రశాంత్ (23)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 26, 2024

MBNR: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు..

image

MLC ఉప ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,439 మంది MPTCలు, ZPTCలు, మున్సిపల్ కౌన్సిలర్లు, MLAలు, MLCలు, MPలు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్నారు. 850 మందికి పైగా ఓటర్లు BRSకు సంబంధించిన వారు ఉండగా, 350 మంది కాంగ్రెస్ పార్టీ, 50 మంది BJP, మిగతా ఇతర పార్టీలు, స్వతంత్రులు ఉన్నారు. రాష్ట్రంలో అధికార మార్పు జరగడంతో BRS ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.

News March 26, 2024

HYD సిటీ బస్సుల సమాచారం.. మీ చేతిలో!

image

HYDలోని సిటీ ఆర్టీసీ బస్సుల సమాచారం తెలుసుకోవడం చాలా సులభమని అధికారులు తెలిపారు. కోఠి, రేతి ఫైల్ బస్ స్టేషన్లలో కమ్యూనికేషన్స్ సెంటర్లు ఏర్పాటు చేశామని, సెంటర్లకు కాల్ చేస్తే సమాచారం అందిస్తారని పేర్కొన్నారు. 9959226160, 9959226154 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని తెలియజేశారు. ఇటీవల సిటీలో నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నారు.

News March 26, 2024

HYD సిటీ బస్సుల సమాచారం.. మీ చేతిలో!

image

HYDలోని సిటీ ఆర్టీసీ బస్సుల సమాచారం తెలుసుకోవడం చాలా సులభమని అధికారులు తెలిపారు. కోఠి, రేతి ఫైల్ బస్ స్టేషన్లలో కమ్యూనికేషన్స్ సెంటర్లు ఏర్పాటు చేశామని, సెంటర్లకు కాల్ చేస్తే సమాచారం అందిస్తారని పేర్కొన్నారు. 9959226160, 9959226154 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని తెలియజేశారు. ఇటీవల సిటీలో నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నారు.