India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓ బాలిక బావిలో పడి మృతి చెందింది. నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన దేవరకొండ శ్రీనివాస్, అతని భార్య, కూతురుతో కలిసి బాతులు పెంచుకొనుటకు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గంగారం గ్రామానికి వచ్చారు. గురువారం బాతులు మేపుతుండగా బాలికకు దాహం వేసి గూడెపు తిరుపతిరెడ్డి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ తిరుపతి కేసు నమోదు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల్లో అసంతృప్తుల సెగ ఆయా పార్టీల్లో తల నొప్పిగా మారింది. ముఖ్యంగా బీజేపీ పార్టీలో మాజీ ఎంపీ గోడం నగేష్‌కు టికెట్ కేటాయింపుతో విభేదాలు బయటపడ్డాయి. ప్రస్తుత ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ పార్టీ ప్రచార కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ, నేతల మధ్య అనైక్యత పార్టీకి తలనొప్పిగా మారింది.
మహబూబ్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి, నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్, పలు స్వతంత్ర అభ్యర్థులు కూడా శుక్రవారం నామపత్రాలు దాఖలు చెయ్యనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో అభ్యర్థిని ప్రకటనపై కార్యకర్తలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఉమ్మడి జిల్లాలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీగా ప్రవర్తన నియమావళి అమలు అవుతోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో.. రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. ప్రవర్తన నియమావళికి లోబడి పార్టీలు అభ్యర్థులు నడుచుకోవలసి ఉంటుంది. ప్రచార సమయంలో అభ్యర్థుల ఖర్చుల వివరాలను అధికారులు షాడో బృందాల ద్వారా నమోదు చేస్తున్నారు. ఒకవేళ గీత దాటితే చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది.
నిర్మల్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లి జాతీయ రహదారి పై గల బస్ స్టేషన్ వద్ద గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని ఓ వ్యక్తి వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు తెలిపారు. ఆ వ్యక్తికి సుమారు 50 ఏళ్ల వయసు ఉంటుందని తెలిపారు. చామనఛాయతో ఉన్న ఈ వ్యక్తి బిక్షాటన చేసేవాడని ఆచూకీ తెలిస్తే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.
నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మహావీర్ తండాకు చెందిన జాదవ్ సుధాకర్(35), అతని భార్యతో కలిసి గురువారం ద్విచక్రవాహనంపై డిచ్పల్లికి వెళ్తున్నారు. జక్రాన్పల్లి జాతీయ రహదారిపై బ్రేక్ డౌన్ కారణంగా నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టగా.. సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన అతని భార్యను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తిరుపతి తెలిపారు.
ఎల్ఎండీ మానేరు డ్యామ్‌లో దూకిన యువకుడిని లేక్ పోలీసులు రక్షించారు. శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు గురువారం మానేరు డ్యామ్ నీటిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించగా గస్తీ కాస్తున్న పోలీసులు నీటిలో దూకి తనని రక్షించి కౌన్సిలింగ్ ఇచ్చి అతని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ఆ యువకుడు తెలియజేశారు.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL)లో ఖాళీగా ఉన్న 327 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను సింగరేణి అధికారులు విడుదల చేశారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు మే 4వ తేదీలోపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు, దరఖాస్తు చేయడం కోసం https://scclmines.com/ వెబ్ సైట్‌ను సందర్శించవచ్చని సింగరేణి అధికారులు తెలిపారు.
భర్త వదిలేయడంతో పిల్లలతో కలిసి ఉపాధి వెదుక్కుంటూ వచ్చిన ఓ మహిళపై రౌడీషీటర్ అత్యాచారం చేశారు. పోచారం IT కారిడార్ CI రాజు వర్మ వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన మహిళ (30) అన్నోజిగూడలో అద్దె ఇంట్లో ఉంటూ ఘట్‌కేసర్‌లోని ఓ హోటల్‌లో పని చేస్తోంది. ఆమెను ఈ నెల 16న రౌడీషీటర్ ఉమేశ్ నాయక్ (22) బెదిరించి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని గురువారం రిమాండ్‌కు తరలించారు.
Sorry, no posts matched your criteria.