Telangana

News April 19, 2024

నాగర్ కర్నూల్ BSP అభ్యర్థిగా మంద పోటీచేస్తే ఎవరికి నష్టం..?

image

మాజీ ఎంపీ మంద జగన్నాథం బీఎస్పీలో చేరారు. ఆయన నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఎస్పీ నుంచి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే రాజకీయంగా ఏ పార్టీకి నష్టం జరుగుతుందనే చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో మొలైంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఆ సామాజికవర్గం ఓట్లలో చీలిక వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనిపై మీ కామెంట్..

News April 19, 2024

ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి: వ్యయ పరిశీలకులు

image

ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సాధారణ ఎన్నికల వ్యయ పరిశీలకులు సునీల్ కుమార్ రాజ్ వాన్ష్ పేర్కొన్నారు. నర్సాపూర్ మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్ పోస్టుల వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు 24 గంటలు పని చేయాలని, వాటిని పరిశీలించాలని, సాంకేతిక లోపాలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, తహసిల్దార్ కమలాద్రి పాల్గొన్నారు.

News April 19, 2024

మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో శంకర్పల్లి వాసి

image

శంకర్పల్లి మున్సిపాలిటీ వివేకానంద నగర్ కాలనీకి చెందిన దండుగుల వెంకటేష్ నేపాల్‌లోని ఖుంజంగ్ మౌంట్ ఎవరెస్టు సమ్మిట్ బేస్ క్యాంపు పాల్గొని 5364 మీటర్ల ఎత్తు గల పర్వతాన్ని అధిరోహించారు. తన మిత్రుడు నరేష్ రెడ్డితో కలిసి సుమారు వారం రోజులపాటు సాగిన ఈ ట్రెక్కింగ్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను ముగించుకున్నారు. ఎత్తైన పర్వతంపై భారతదేశపు మువ్వన్నెల జెండాను ఎగరవేయడం గర్వంగా అనిపించిందని పేర్కొన్నారు.

News April 19, 2024

మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో శంకర్పల్లి వాసి

image

శంకర్పల్లి మున్సిపాలిటీ వివేకానంద నగర్ కాలనీకి చెందిన దండుగుల వెంకటేష్ నేపాల్‌లోని ఖుంజంగ్ మౌంట్ ఎవరెస్టు సమ్మిట్ బేస్ క్యాంపు పాల్గొని 5364 మీటర్ల ఎత్తు గల పర్వతాన్ని అధిరోహించారు. తన మిత్రుడు నరేష్ రెడ్డితో కలిసి సుమారు వారం రోజులపాటు సాగిన ఈ ట్రెక్కింగ్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను ముగించుకున్నారు. ఎత్తైన పర్వతంపై భారతదేశపు మువ్వన్నెల జెండాను ఎగరవేయడం గర్వంగా అనిపించిందని పేర్కొన్నారు.

News April 19, 2024

WGL: టెట్ ఉచిత శిక్షణా తరగతులు

image

టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి టెట్ ఉచిత శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను జిల్లా కేంద్రంలోని ఉమాపతి భవన్‌లో ఆ సంఘం నేతలు ఆవిష్కరించారు. ఉచిత శిక్షణ కోసం 9573141365 నంబర్‌కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

News April 19, 2024

MNCL: ‘ఓపెన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

image

ఈ నెల 25 నుంచి మే 2 వరకు జరగనున్న ఓపెన్ ఇంటర్, 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్భందీ చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేవం నిర్వహించారు. ఇంటర్ పరీక్షలకు 5, 10వ తరగతికి 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు, మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా చర్యలు చేపట్టమన్నారు.

News April 19, 2024

వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

image

NRPT జిల్లాలో గ్రామాలలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అర్హత గల వ్యాయమ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకటేష్ తెలిపారు. మే 1 నుంచి 31 వరకు 14 ఏళ్ళలోపు బాలబాలికలకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. వ్యాయమ ఉపాధ్యాయులు సంబందిత ధ్రువపత్రాలతో ఈనెల 23లోగా జిల్లా క్రీడల అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News April 19, 2024

నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ BJP కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం

image

నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ BJP కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

News April 19, 2024

NLG: కళాశాలల నుండి దరఖాస్తుల ఆహ్వానం

image

2024-25 విద్యా సంవత్సరానికి గాను నూతనంగా ఎంపిక చేసేందుకు రెసిడెన్సియల్ వసతి కలిగి విద్యాబోధనలతో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉండి కాంపీటేటివ్ పరీక్షల్లో ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణత శాతాన్ని కలిగి ఉన్న కళాశాలలు ఆన్లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని షె.కు.అ.శాఖ ఉపసంచాలకులు తెలిపారు. ఆసక్తి గల కళాశాలలు నేటి వరకు 5 ఏళ్లకు సంబంధించిన అకాడమిక్ ప్రొఫైల్ తో పాటు ఈపాస్ వెబ్సైట్ ద్వారా ఈనెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 19, 2024

ఖమ్మం: ‘ఎన్నికల వ్యయ పరిశీలన పారదర్శకంగా జరగాలి’

image

ఎన్నికల వ్యయ పరిశీలన పారదర్శకంగా చేపట్టాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణస్వామి, శంకర నంద్ మిశ్రాలు అన్నారు. ఈ సందర్భంగా వ్యయ పరిశీలకులు, ఖమ్మం ఎన్నికల అధికారి కలెక్టర్ గౌతమ్ తో కలిసి లోకసభ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం, మీడియా సర్టిఫికేషన్ & మీడియా మానిటరింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రంలో చేపడుతున్న చర్యలపై వారు ఆరా తీసారు.