Telangana

News April 19, 2024

నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ BJP కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం

image

నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ BJP కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

News April 19, 2024

NLG: కళాశాలల నుండి దరఖాస్తుల ఆహ్వానం

image

2024-25 విద్యా సంవత్సరానికి గాను నూతనంగా ఎంపిక చేసేందుకు రెసిడెన్సియల్ వసతి కలిగి విద్యాబోధనలతో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉండి కాంపీటేటివ్ పరీక్షల్లో ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణత శాతాన్ని కలిగి ఉన్న కళాశాలలు ఆన్లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని షె.కు.అ.శాఖ ఉపసంచాలకులు తెలిపారు. ఆసక్తి గల కళాశాలలు నేటి వరకు 5 ఏళ్లకు సంబంధించిన అకాడమిక్ ప్రొఫైల్ తో పాటు ఈపాస్ వెబ్సైట్ ద్వారా ఈనెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 19, 2024

ఖమ్మం: ‘ఎన్నికల వ్యయ పరిశీలన పారదర్శకంగా జరగాలి’

image

ఎన్నికల వ్యయ పరిశీలన పారదర్శకంగా చేపట్టాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణస్వామి, శంకర నంద్ మిశ్రాలు అన్నారు. ఈ సందర్భంగా వ్యయ పరిశీలకులు, ఖమ్మం ఎన్నికల అధికారి కలెక్టర్ గౌతమ్ తో కలిసి లోకసభ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం, మీడియా సర్టిఫికేషన్ & మీడియా మానిటరింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రంలో చేపడుతున్న చర్యలపై వారు ఆరా తీసారు.

News April 18, 2024

పాలమూరులో తొలిరోజు నామినేషన్లు ఇలా..

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ ఈ విధంగా జరిగింది. మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ రెండు నామినేషన్లు వేయగా.. ఇంటిపెండెంట్‌గా ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ నామినేషన్ వేశారు.

News April 18, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> వారసిగూడ పీఎస్ పరిధిలో బాలుడి మిస్సింగ్
> జూబ్లీ బస్ స్టేషన్లో అగ్నిమాపక అవగాహన డ్రిల్
> పాతబస్తీ హత్య కేసులో ఆరుగురు అరెస్ట్
> ఈతకు వెళ్లి ఇద్దరు మృతి
> కాచిగూడ రైలు మ్యూజియంలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు
> గాంధీ ఆస్పత్రిలో గుర్తుతెలియని డెడ్ బాడీ లభ్యం
> సెంట్రల్ యూనివర్సిటీలో ABVP, SFI విద్యార్థుల మధ్య ఘర్షణ
> రామంతపూర్‌లో BRS మీటింగ్

News April 18, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల: ఇద్దరు SIలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెండ్
@ మల్హర్ మండలంలో లారీ, కారు ఢీ
@ పెద్దపల్లి: తొలి రోజు నాలుగు నామినేషన్లు
@ కరీంనగర్: తొలిరోజు రెండు నామినేషన్లు
@ మెట్ పల్లి: ఐదుగురు పేకాటరాయుళ్ల పట్టివేత

News April 18, 2024

రాత్రి 11 గంటలలోపు దుకాణాలు మూసివేయాలి:సీపీ

image

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో రాత్రి 10:30 నుండి 11 గంటలలోపు ఖచ్చితంగా వ్యాపార, వాణిజ్య దుకాణాలు మూసివేయాలని సీపీ సునీల్ దత్ తెలిపారు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, పబ్లిక్ న్యూసెన్స్, సమయానికి మించి షాపులు తెరవడం, పుట్టినరోజు పేరుతో నడిరోడ్డుపై వాహనాలు అడ్డం పెట్టి న్యూసెన్స్ చేస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించే వారిపై కేసులు నమోదు చేయాలని ఇప్పటికే పోలీస్ అధికారులకు ఆదేశించామని తెలిపారు.

News April 18, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓HYD ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
✓మల్కాజ్గిరి బీజేపి ఎంపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్
✓NAC విద్యాసంస్థలో పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ
✓ప్రభుత్వాలే భూమిని గుంజుకుంటున్నాయి: విశ్వేశ్వర్ రెడ్డి
✓మల్కాజ్గిరి BRS ఎంపీ అభ్యర్థిగా బీఫామ్ అందుకున్న రాగిడి లక్ష్మారెడ్డి
✓భువనగిరి BRS ఎంపీ అభ్యర్థిగా బీఫామ్ అందుకున్న క్యామ మల్లేష్

News April 18, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✔ఉమ్మడి జిల్లాలో  భానుడి భగభగలు.. ఎల్లో హెచ్చరికలు జారీ
✔WNPT:MLA ఎదుట కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం
✔నేడు నామినేషన్ వేసిన డీకే అరుణ, భరత్ ప్రసాద్, మల్లు రవి
✔బిజినేపల్లి:రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
✔బీఫామ్ అందుకున్న ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి,BMP అభ్యర్థి విజయ్
✔తాగునీటి పై అధికారుల ఫోకస్
✔SDNR:పేలుడు పదార్థాలు పట్టుకున్న పోలీసులు
✔కాంగ్రెస్‌ను కాపాడుకునేందుకే ఆత్మహత్యాయత్నం: గణేష్ గౌడ్

News April 18, 2024

అనాధ బాలికలు దరఖాస్తుల ఆహ్వానం

image

దుర్గాబాయి దేశ్ ముఖ్ ప్రభుత్వ మహిళ టెక్నికల్ శిక్షణా సంస్థ HYD, పాలిటెక్నిక్ డిప్లమో కోర్సులకు 2024-25 విద్యాసంవత్సరానికి జనగామ జిల్లాలోని అనాథ బాలికలు, పేదరికంలో ఉన్న బాలికలు పదవ తరగతి పూర్తి చేసిన బాలికలకు అర్హత పరీక్ష లేకుండా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి జయంతి ఒక ప్రకటనలో తెలిపారు. మే 15లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.