Telangana

News March 25, 2024

HYD: గాంధీలో గర్భిణులకు కొండంత అండగా వైద్యం!

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని MCH భవనంలో పిల్లలకు, గర్భిణులకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల 600 నుంచి 800 వరకు ప్రసవాలు జరుగుతున్నట్లు డాక్టర్ రాజారావు పేర్కొన్నారు. 300 నుంచి 400 వరకు గైనిక్ సమస్యలు ఉన్నవారు ఓపీ తీసుకుంటున్నారని అన్నారు. గాంధీ ఆసుపత్రి ప్రధాన భవనాలకు మాత శిశు సంరక్షణ భవనాలకు అనుసంధానం చేసేలా స్కైవాక్ వంతెన ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

News March 25, 2024

ADB: ఈనెల 30 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం

image

కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ చదువుతున్న రెగ్యులర్, బ్యాక్ లాక్ విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించాలని కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహం తెలిపారు. సెమిస్టర్-2, 4, 6 విద్యార్థులు ఈ ఫీజును చెల్లించాలని సూచించారు. రూ.50 అపరాధ రుసుంతో వచ్చే నెల 10వ తేదీ వరకు చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.

News March 25, 2024

MBNR: కలర్ పడుద్ది.. కళ్లు భద్రం..!

image

హోలీ అంటేనే రంగుల కేళి.. చిన్నా పెద్దా తేడా లేకుండా కలిసి ఆడే పండుగ. నేడు ఈ వేడుక జరుపుకొనేందుకు పాలమూరు ప్రజలు సిద్ధమైన వేళ వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. సరదా సంబురం మాటున ప్రమాదం పొంచి ఉన్నదని.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రంగులు కళ్లల్లో పడకుండా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సహజ సిద్ధమైన రంగులను వినియోగిస్తే మంచిది అని అంటున్నారు.

News March 25, 2024

HYD: అందెశ్రీ దంపతులను సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి

image

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ గీత రచయిత అందెశ్రీ దంపతులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దంపతులు ఆదివారం ఘనంగా సన్మానించి అభినందిచారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ.. రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పూలబోకే అందజేసి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

అశ్వారావుపేట: కానిస్టేబుల్‌పై దురుసు ప్రవర్తన.. కేసు నమోదు

image

అశ్వారావుపేట మండలం పేరాయిగూడెంలో సీసీ రోడ్డు నిర్మించి, వాహనాలు రాకుండా ట్రాక్టర్‌ను అడ్డుపెట్టారు. గ్రామానికి చెందిన నలుగురు ట్రక్కు విషయమై దుర్భాషలాడుతుండటంతో పోలీసులకు తెలిపారు. అక్కడికి వచ్చిన కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించి, విధులకు ఆటంకం కలిగించారు. దీనిపై కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు రాజేశ్‌, వెంకటేశ్వర్లు, రాంబాబు, ప్రసాద్‌పై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.

News March 25, 2024

గ్రామైక్య సంఘాల అధ్యక్షులకు గుర్తింపు కార్డులు

image

గ్రామైక్య సంఘాల అధ్యక్షులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) గుర్తింపు కార్డులు ఇవ్వనుంది. కార్డుపై సహాయకురాలి పేరు, చిరునామా, పుట్టిన తేదీ, గుర్తింపు కార్డు నెంబర్, సంఘం పేరు ఉండనుంది. ఇప్పటికే వీటి తయారీ పూర్తయ్యిందని, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 2600 గ్రామైక్య సంఘాల్లోని ఆయా సంఘాల అధ్యక్షులకు పది రోజుల్లో కార్డులు అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

News March 25, 2024

మహబూబ్‌నగర్: MLC ఎన్నిక పోలింగ్ కేంద్రాల వివరాలు

image

✓MPDO కార్యాలయం, MBNR – 245 మంది ఓటర్లు
✓MPDO కార్యాలయం, కొడంగల్ – 56 ఓటర్లు
✓MPDO కార్యాలయం, NRPT – 205 ఓటర్లు
✓RDO ఆఫీస్, వనపర్తి – 218 ఓటర్లు
✓ZP కార్యాలయం, GDL – 225 ఓటర్లు
✓బాలికల జూనియర్ కళాశాల, కొల్లాపూర్ – 67 ఓటర్లు
✓బాలుర ZPHS, NGKL – 101 ఓటర్లు
✓బాలికల ZPHS, అచ్చంపేట – 79 ఓటర్లు
✓ప్రభుత్వ జూనియర్ కళాశాల, కల్వకుర్తి – 72 ఓటర్లు
✓MPDO కార్యాలయం, షాద్నగర్ – 171 ఓటర్లు
✓మొత్తం ఓటర్లు – 1439.

News March 25, 2024

కూకట్‌పల్లిలో యువతిపై అత్యాచారం 

image

ఓ యువతిపై అత్యాచారం జరిగిన ఘటన KPHBలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కరీంనగర్‌కు చెందిన ఓ యువతి(30) సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి సంబంధించి KPHBలో ఆన్‌లైన్‌ శిక్షణకు చేరింది. ఈక్రమంలో ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు నరేందర్ కుమార్ ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం శిక్షణ సహచరుడు సంతోష్‌కు తెలపగా అతడు కూడా ఆమెను వేధించాడు. దీంతో ఆమె ఆత్మహత్యకు యత్నించింది. నరేందర్, సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.