Telangana

News September 5, 2024

ఆవిష్కరణలకు HYD కేంద్రంగా మారింది: జయేష్

image

HYD సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ISB సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. టీ హబ్‌లో అనేక అంకురాలు మొగ్గ తొడిగి పెద్ద సంస్థలుగా విస్తరించినట్లు తెలిపారు. నూతన ఆలోచనలతో వేలాదిమందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

News September 5, 2024

రంగారెడ్డి: అమ్మే తొలి గురువు: కలెక్టర్ శశాంక

image

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తల్లే తొలి గురువుగా పేర్కొన్నారు. ప్రాథమిక, హై స్కూల్ దశలో మాధవి, జయంత్‌నాథ్, సోమయాజులు, లక్ష్మణరావుల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. జూనియర్ కాలేజీలో మంజుసూరి, బీకాం చదివేటప్పుడు రఘువీర్ సార్లు ప్రతి అంశంలోనూ అవగాహన కల్పించే వారన్నారు. వారి ప్రేరణతోనే సివిల్స్ వైపు అడుగేసి విజయం సాధించానని వివరించారు. 

News September 5, 2024

పుల్కల్: సింగూరు ప్రాజెక్టు భద్రమేనా..?

image

మంజీరా నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు భద్రత పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం సింగూరులో 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రిజర్వాయర్‌కు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు వాపోతున్నారు. తాజా వర్షాలతో భారీగా వరద నీరు పోటెత్తుతోంది. 29.917 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌లో ప్రస్తుతం 27 టీఎంసీలకు చేరడంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.

News September 5, 2024

గోల్కొండ కోటను జయించిన వీరుడు పాపన్న గౌడ్: శ్రీనివాస్ గౌడ్

image

గోల్కొండ కోటను జయించిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్ అంబర్ పేటలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేదల కోసం పోరాడని వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కాలేరు, వెంకటేష్ పాల్గొన్నారు.

News September 5, 2024

HYD: నకిలీ ఓట్లపై చర్యలు: ఆమ్రపాలి

image

నగరంలో నకిలీ ఓట్లు పెరిగాయని వివిధ పార్టీల నాయకులు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి దృష్టికి తీసుకొచ్చారు. బుధవారం జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ), కమిషనర్ ఆధ్వర్యంలో బల్దియా ప్రధాన కార్యాలయంలోని సమావేశం నిర్వహించారు. బీఎ‌ల్‌వో లేకపోవడంతోనే అధికారులు పేర్లు చెప్పలేకపోతున్నారని భాజపా నేత మర్రి శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.

News September 5, 2024

ఖమ్మం: గత నెలలో డయల్-100కు 4,119 కాల్స్

image

సమాజంలో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి నేపథ్యంలో ప్రజల దాన, మాన, ప్రాణాల రక్షణే ధ్యేయంగా ఏర్పాటైన డయల్-100కు గత నెలలో 4,119 కాల్స్ వచ్చినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. వాటిపై 91 FIR నమోదు చేశామని, వీటిలో మహిళలపై వేధింపులు-3, దొంగతనాలు-15, సాధారణ ఘాతాలు-33, అనుమానస్పద మరణాలు-4, ఇతర కేసులు-25 అన్నారు. డయల్-100కు ఫేక్ కాల్స్ చేయొద్దని, అత్యవసర సమయంలో మాత్రమే ఫోన్ చేయాలని పేర్కొన్నారు.

News September 5, 2024

పుల్కల్: సింగూరు ప్రాజెక్టు భద్రమేనా..?

image

మంజీర నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు భద్రత పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం సింగూరులో 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రిజర్వాయర్‌కు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు వాపోతున్నారు. తాజా వర్షాలతో భారీగా వరద నీరు పోటెత్తుతోంది. 29.917 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌లో ప్రస్తుతం 27 టీఎంసీలకు చేరడంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.

News September 5, 2024

HYD: నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలి: KTR

image

జైనూర్ మండలంలో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారయత్నం ఘటనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. గురువారం X వేదికగా స్పందించారు. ‘జైనూర్లో తక్షణమే శాంతి నెలకొనేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం బాధిత మహిళకు రూ.లక్ష పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూడటం దుర్మార్గం’ అని అన్నారు.

News September 5, 2024

HYD: కలుషిత నీటి సమస్యతో.. ప్రజల తిప్పలు!

image

HYD ఎల్బీనగర్, ఉప్పల్, అత్తాపూర్, పాతబస్తీ, కోఠి తదితర ప్రాంతాల్లో కలుషిత తాగు నీరు సరఫరా కావడంతో ఇబ్బందులు పడుతున్నట్లు అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలియాబాద్ సెక్షన్ పరిధిలోనూ పలుచోట్ల నుంచి ఈ సమస్యపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. మంచినీటిలో మురుగు నీరు కలిసి వస్తుందని పేర్కొన్నారు. ప్రతి సెక్షన్ పరిధిలో అధికారిక యంత్రాంగం మంచినీటి పరీక్షలు నిర్వహించాలని వారు కోరారు.

News September 5, 2024

HYD: కలుషిత నీటి సమస్యతో.. ప్రజల తిప్పలు!

image

HYD ఎల్బీనగర్, ఉప్పల్, అత్తాపూర్, పాతబస్తీ, కోఠి తదితర ప్రాంతాల్లో కలుషిత తాగు నీరు సరఫరా కావడంతో ఇబ్బందులు పడుతున్నట్లు అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలియాబాద్ సెక్షన్ పరిధిలోనూ పలుచోట్ల నుంచి ఈ సమస్యపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. మంచినీటిలో మురుగు నీరు కలిసి వస్తుందని పేర్కొన్నారు. ప్రతి సెక్షన్ పరిధిలో అధికారిక యంత్రాంగం మంచినీటి పరీక్షలు నిర్వహించాలని వారు కోరారు.