Telangana

News April 18, 2024

HYD: FREE కోచింగ్ మీకోసమే.. త్వరపడండి!

image

HYD కొండాపూర్ పరిధిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్(NAC) ఆధ్వర్యంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలోని ఐజీఎంఎం, ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో నిరుద్యోగ యువతకు పలు కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. 18-35 ఏళ్లలోపు వారికి ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తూ 3 నెలలపాటు ఆయా కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

News April 18, 2024

 KCR చేతుల మీదుగా B- ఫారమ్ అందుకున్న క్యామ మల్లేశ్‌

image

భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేశ్‌కు ఆపార్టీ అధ్యక్షుడు కేసీఆర్ B-ఫారమ్ అందించారు. హైద్రాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో మల్లేశ్‌ B-ఫారమ్ అందుకున్నారు. భువనగిరిలో గెలిచి రావాలని కేసీఆర్ పార్టీ నాయకులకు సూచించారు. B-ఫారమ్‌తో పాటు రూ.95లక్షల  చెక్కును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తదితరులున్నారు.

News April 18, 2024

విజయవాడ పార్లమెంట్ స్థానానికి జనగామ వాసి నామినేషన్

image

విజయవాడ పార్లమెంట్ స్థానానికి జనగామ వాసి నామినేషన్ వేసినట్లు ఆ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఢిల్లీ రావు తెలిపారు. తొలిరోజు 4 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా జనగామ జిల్లాకు చెందిన అర్జున్ చేవిటి రెండు నామినేషన్లు, సోషలిస్ట్ యునిటీ సెంటర్ ఆఫ్ ఇండియా(కమ్యూనిస్ట్) అభ్యర్థిగా విజయవాడ అజిత్ సింగ్ నగర్‌కు చెందిన గుజ్జుల లలిత రెండు దాఖలు చేశారన్నారు.

News April 18, 2024

భద్రాచలం: ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఎస్సై, కానిస్టేబుల్

image

భద్రాచలంలో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పోలీస్ అధికారులు చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. భద్రాచలం టౌన్ ఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ శంకర్, నవీన్‌లు ఒకే విషయంలో 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 18, 2024

ఖమ్మంలో తొలిరోజు ఒక నామినేషన్ దాఖలు

image

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో తొలి రోజు ఒక నామినేషన్ స్వీకరించినట్లు ఖమ్మం రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 17- ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఆధార్ పార్టీ తరఫున కుక్కల నాగయ్య ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రకటించారు.

News April 18, 2024

నిజామాబాద్‌లో మొదటి రోజు 2 నామినేషన్లు

image

పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి మొదటి రోజు 2 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా రాపెల్లి సత్యనారాయణ, విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా భుక్యానంద్ నామినేషన్ వేసినట్లు వెల్లడించారు.

News April 18, 2024

బీఫామ్ అందుకున్న మన్నె శ్రీనివాస్ రెడ్డి

image

మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మన్నే శ్రీనివాస్ రెడ్డి గురువారం తెలంగాణ భవన్లో కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మన్నె శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

News April 18, 2024

మందమర్రిలో ఈ నెల 21న పుట్ బాల్ జట్టు ఎంపిక

image

మందమర్రిలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో ఈ నెల 21న మధ్యాహ్నం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బాలుర సీనియర్స్ పుట్ బాల్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్ల పుట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి రఘునాథ రెడ్డి తెలిపారు. క్రీడాకారులు ఆధార్ కార్డు, 3 ఫోటోలు, బర్త్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని సూచించారు.

News April 18, 2024

 KCR చేతుల మీదుగా B- ఫారమ్ అందుకున్న నామా 

image

ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావుకు ఆపార్టీ అధ్యక్షుడు కేసీఆర్ B-ఫారమ్ అందించారు. హైద్రాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో నామాకు B-ఫారమ్ అందుకున్నారు. మరోసారి గెలిచి రావాలని కేసీఆర్ పార్టీ నాయకులకు సూచించారు. B-ఫారమ్‌తో పాటు రూ.95లక్షల విలువచేసే చెక్కును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ, ఎంపీ వద్దిరాజు తదితరులున్నారు.

News April 18, 2024

NLG: తొలి రోజు ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు

image

NLG పార్లమెంట్ స్థానానికి తొలి రోజు నలుగురు అభ్యర్థులు 6 సెట్ల నామినేషన్లను దాఖలు చేసినట్లు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. చోల్లేటి ప్రభాకర్ స్వతంత్ర అభ్యర్థిగా 2 సెట్ల నామినేషన్ దాఖలు చేయగా, BJP అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరఫున ఆ పార్టీ నేత ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.