Telangana

News March 23, 2024

నిర్మల్: కుక్కల దాడిలో చిన్నారి మృతి…!

image

ఈనెల 2న వీధి కుక్కల దాడిలో గాయపడిన నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. పెంబి మండలం తాటిగూడకు చెందిన భూక్య సరిత-అమర్సేంగ్ దంపతుల కూతురు శాన్విత ఇంటి ముందు ఆడుకుంటున్న క్రమంలో కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆమెకు నిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. మళ్ళీ గురువారం జ్వరం రావడంతో నిర్మల్లోని ఆసుపత్రికి తరలించి అనంతరం హైదరాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో చిన్నారి మృతి చెందింది.

News March 23, 2024

MHBD: కొడుకూ, కూతురితో బావిలో దూకిన తల్లి

image

MHBD జిల్లాలో శుక్రవారం విషాదం జరిగింది. స్థానికుల ప్రకారం.. MHBD జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామ శివారు వెంకటాపురానికి చెందిన ఆకుల లావణ్య(28) కుటుంబ కలహాలతో తన కూతురు నిత్య(8), కుమారుడు ముఖేష్(10)లను బావిలో తోసి తానూ దూకింది. ఈ ఘటనలో తల్లి, కూతురు మృతి చెందగా.. బాలుడు ముఖేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. భర్త వివాహేతర సంబంధమే మహిళ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.

News March 23, 2024

KNR: వడదెబ్బతో రైతు మృతి

image

వడదెబ్బతో రైతు మృతి చెందిన ఘటన మానకొండూర్ మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దూరుపల్లికి చెందిన పంది జగన్(51)కు రెండెకరాల సాగు భూమి ఉంది. అందులో ఆడ-మగ వరి సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో పొలంలో పుద్దు దులుపుతుండగా.. ఎండ వేడి వల్ల జగన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం KNR ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు.

News March 23, 2024

NLG: జిల్లాలో 5.11 లక్షల పశువులకు టీకాలు

image

పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ కోసం పశువైద్య సంవర్థక శాఖ ఆద్వర్యంలో టీకాలు వేసే కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నామని NLG జిల్లా పశువైద్య సంవర్థక శాఖ అధికారి డాక్టర్ అంబటి యాదగిరి తెలిపారు. జిల్లాలో సుమారు 2లక్షల తెల్లపశువులు, 3.11 లక్ష నల్లజాతి పశువులకు టీకాలను వేయడానికి 74 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఏప్రిల్ 15 వరకు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.

News March 23, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

✓ పలు శాఖలపై ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓటు నమోదుపై ప్రత్యేక కార్యక్రమం
✓చర్ల మండలంలో సంత వేలం పాట
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
✓మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓అన్నపురెడ్డిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓పినపాక మండలంలో ఎమ్మెల్యే పాయం పర్యటన

News March 23, 2024

శిశు మరణాలను నివారించాలి: డీఎంహెచ్ఓ

image

భద్రాద్రి జిల్లాలో ఐదు సంవత్సరాలలోపు పిల్లల మరణాల నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జేవీఎల్.శిరీష అన్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సంభవించిన ఐదు సంవత్సరాలలోపు పిల్లల మరణాలకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.

News March 23, 2024

KMR: మత్తు పదార్థాలు అమ్మిన ముఠా అరెస్ట్

image

మత్తుపదార్థాలు అమ్మిన ముఠాను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎల్లారెడ్డి DSP శ్రీనివాసులు వెల్లడించారు. గురువారం పద్మాజీవాడి X రోడ్‌లో నిషేధిత అల్ఫాజోలం అమ్ముతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. నలుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.5 లక్షల విలువ చేసే అల్ఫాజోలం, 2 కార్లు, 2 బైక్‌లు, 5 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. కాగా రాజస్థాన్‌కు చెందిన మరో 2 పరారీలో ఉన్నారు.

News March 23, 2024

హైదరాబాద్‌: BRSలో అలజడి..!

image

GHMC మేయర్‌ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆమెతో పాటు మరో 10 మంది కార్పొరేటర్లు కూడా హస్తం కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. 2020 ఎన్నికల్లో BRS‌ 56 స్థానాలు గెలుచుకోగా.. అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే 10 మంది పార్టీని వీడారు. మరో 15 మంది కార్పొరేటర్లను ఆకర్షించాలని INC భావిస్తోందట. ఇదిలా ఉంటే ఒక్కొక్కరుగా పార్టీని వీడడం HYD BRSలో అలజడి రేపుతోంది.

News March 23, 2024

హైదరాబాద్‌: BRSలో అలజడి..!

image

GHMC మేయర్‌ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆమెతో పాటు మరో 10 మంది కార్పొరేటర్లు కూడా హస్తం కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. 2020 ఎన్నికల్లో BRS‌ 56 స్థానాలు గెలుచుకోగా.. అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే 10 మంది పార్టీని వీడారు. మరో 15 మంది కార్పొరేటర్లను ఆకర్షించాలని INC భావిస్తోందట. ఇదిలా ఉంటే ఒక్కొక్కరుగా పార్టీని వీడడం HYD BRSలో అలజడి రేపుతోంది.

News March 23, 2024

డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గురుకుల డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పించేందుకు విద్యార్థినీ, విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్‌ తెలిపారు. మణుగూరులోని బాలుర డిగ్రీ కళాశాలతో పాటు కొత్తగూడెం, దమ్మపేట, ఖమ్మం బాలికల కళాశాలల్లో చేరేందుకు అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈనెల 28 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు.