Telangana

News April 18, 2024

ఈనెల 25 వరకు బుకింగ్స్ పొడిగింపు: రీజనల్ మేనేజర్

image

శ్రీసీతారాముల కల్యాణ తలంబ్రాలు టిఎస్ ఆర్టిసి కార్గో ద్వారా ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో రూ.151 చెల్లిస్తే భక్తుల ఇండ్ల వద్దకు చేరుస్తామని ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ బుకింగ్స్ ఈనెల 25 వరకు పొడిగించడం జరిగిందని.. కావున భక్తులు తలంబ్రాలను బుక్ చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు

News April 18, 2024

మార్పు, మార్పు అని ప్రజలు మోసపోయారు: ఎర్రబెల్లి

image

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని, కార్యకర్తలు వాటిని తిప్పి కొట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పర్వతగిరి మండల స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మార్పు, మార్పు అని ప్రజలు మోసపోయారని, ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

News April 18, 2024

HYD: ప్రజలారా.. జాగ్రత్త..! ఎండ దంచి కొడుతోంది

image

HYD, RR, MDCL, VKB జిల్లాలలో నేటి నుంచి రాగల 5 రోజుల వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ తెలియజేసింది. ఏకంగా 41 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. పలుచోట్ల వేడిగాలులు వీచే అవకాశం ఉందని, కావున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేసింది.

News April 18, 2024

HYD: ప్రజలారా.. జాగ్రత్త..! ఎండ దంచి కొడుతోంది 

image

HYD, RR, MDCL, VKB జిల్లాలలో నేటి నుంచి రాగల 5 రోజుల వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ తెలియజేసింది. ఏకంగా 41 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. పలుచోట్ల వేడిగాలులు వీచే అవకాశం ఉందని, కావున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేసింది.

News April 18, 2024

KCR చేతుల మీదుగా B- ఫారమ్ అందుకున్న బాజిరెడ్డి

image

నిజామాబాద్ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం తెలంగాణ భవన్‌లో KCR చేతుల మీదుగా B-ఫారమ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు గణేశ్ గుప్తా, జీవన్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్లు విఠల్ రావు, దావ వసంత, అలీం, ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News April 18, 2024

ఆసిఫాబాద్ జిల్లాలో పెరుగిన రాబందుల సంఖ్య

image

ప్రపంచంలో అంతరించిపోతున్న జీవజాతుల్లో రాంబందులూ ఉన్నాయి. అయితే ASF జిల్లాలోని పాలరాపుగుట్టపై అరుదైన లాంగ్ బిల్డ్ వల్చర్ జాతి రాబందులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత నాలుగేళ్లలో వాటి సంఖ్య 10-33 వరకు పెరిగినట్లు గుర్తించారు. బయాలజిస్ట్‌ రవికాంత్‌ ఆధ్వర్యంలో ఫారెస్ట్‌ అధికారులు వాటి పర్యవేక్షణ చేపట్టారు. గుట్టపై జటాయువు పేరుతో సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు.

News April 18, 2024

KNR: మామిడి భళే కాసింది.. ఒకే చోట 22 కాయలు

image

కరీంనగర్ జిల్లాలో వింత జరిగింది. ఓ మామిడి చెట్టుకు ఒకే కొమ్మకు దాదాపు 22 కాయలు కాసింది. ఈ ఘటన KNR జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవి పల్లెకి చెందిన కర్ర జగన్మోహన్ రెడ్డి మామిడి తోటలో జరిగింది. రైతు మాట్లాడుతూ.. గతేడాది ఈదురు గాలులకు కొమ్మలు విరిగిపోవడంతో చెట్టు ఎండిపోయే దశకు చేరిందని అన్నారు. ఇక ఈ చెట్టు కాత కాయదనుకున్నా కానీ, ఒకే చోట సుమారు 50 కాయల వరకు కాసిందని అన్నారు.

News April 18, 2024

ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిణి

image

పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ గురువారం టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రమణి, అసిస్టెంట్ ప్రసన్న ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ పని నిమిత్తం ఓ వ్యక్తి నుంచి అధికారులు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కాగా బాధితుడి ఫిర్యాదు మేరకు అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అధికారులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

News April 18, 2024

బిజినేపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన బిజినేపల్లి మండలం పాలెంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. గుడ్లనర్వకి చెందిన శ్రీశైలం పాలెంలో టిఫిన్ కోసం వచ్చాడు. యూటర్న్ తీసుకునే క్రమంలో వెనుక నుంచి మహబూబ్‌నగర్‌కు చెందిన బద్రీనాథ్ బైక్‌పై వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బద్రీనాథ్ అక్కడికక్కడే మృతి చెందాగా.. స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 18, 2024

NZB ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాపేల్లి సత్యనారాయణ

image

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి అభ్యర్థుల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమయ్యింది. ఈ మేరకు స్వతంత్ర అభ్యర్థిగా రాపెల్లి సత్యనారాయణ తన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా రిటర్నింగ్ అధికారి ఛాంబర్ వద్దకు చేరుకున్న వారి నామినేషన్లు మాత్రమే స్వీకరిస్తామన్నారు.