Telangana

News April 18, 2024

మెదక్‌: ముహూర్త బలంతో అభ్యర్థులు ముందుకు..!

image

పార్లమెంట్ ఎన్నికల మొదటి ఘట్టం నేటితో ప్రారంభం అవ్వడంతో అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి ముహూర్త బలాన్ని నమ్ముతూ ముందుకు సాగుతున్నారు. మెదక్‌లో నేడు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ వేస్తుండగా ఆయన అయోధ్య వెళ్లి రాముని చెంత నామినేషన్ పత్రాలు పెట్టి టైం ఫిక్స్ చేసుకున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముహూర్త బలం ఫిక్స్ చేసుకొని నామినేషన్ వేస్తున్నారు.

News April 18, 2024

ADB: ఈనెల 25 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

ఓపెన్ స్కూల్ ఇంటర్, పదో తరగతి పరీక్షలు ఈనెల 25 నుంచి ప్రారంభమవుతాయని డీఈఓ ప్రణీత తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయంలో పరీక్షల ఏర్పాట్లపై ఆయా శాఖల వారి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉదయం పూట ఇంటర్, మధ్యాహ్నం పదో తరగతి పరీక్షలు ఉంటాయని ఇంటర్ పరీక్షలకు 463 మంది, పదో తరగతి పరీక్షలకు 792 మంది హాజరవుతారని పేర్కొన్నారు. ఆదిలాబాద్, ఉట్నూర్ లలో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News April 18, 2024

ఇల్లంతకుంటలో భర్త గెలుపు కోసం భార్య ప్రచారం

image

సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంతో పాటు గాలిపెళ్లి, తాళ్లపల్లి, అనంతగిరి గ్రామాలలో కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సతీమణి మాధవి గురువారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. గత ఐదేళ్లలో బండి సంజయ్ ఎంపీగా ఉండి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వినోద్ కుమార్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

News April 18, 2024

నా గెలుపును ఎవరూ ఆపలేరు: ఈటల రాజేందర్

image

మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో తన గెలుపును ఎవరూ ఆపలేరని BJP అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. నామినేషన్ దాఖలుకు ముందు తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మల్కాజిగిరిలో ధర్మానికి, అధర్మానికి జరిగే యుద్ధమే ఈ ఎన్నికలు అని అభివర్ణించారు. కొందరు దొంగ సర్వేలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఆరోపించారు.

News April 18, 2024

నా గెలుపును ఎవరూ ఆపలేరు: ఈటల రాజేందర్

image

మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో తన గెలుపును ఎవరూ ఆపలేరని BJP అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. నామినేషన్ దాఖలుకు ముందు తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మల్కాజిగిరిలో ధర్మానికి, అధర్మానికి జరిగే యుద్ధమే ఈ ఎన్నికలు అని అభివర్ణించారు. కొందరు దొంగ సర్వేలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఆరోపించారు.

News April 18, 2024

భద్రాచలం: ఎడారిని తలపిస్తున్న గోదావరి

image

భద్రాద్రిలో గోదావరి ఎడారిని తలపిస్తోంది. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా చుక్క నీరు కూడా కనిపించడం లేదు. నిన్న జరిగిన శ్రీరామ నవమి వేడుకలలో ఉమ్మడి తెలుగు రాష్ట్రల నుంచి వేలాది మంది భక్తులు వచ్చారు. వారి కోసం మోటార్లు ద్వారా తాత్కలికంగా ఏర్పాటు చేసిన వాటి కింద భక్తులు స్థానాలు చేశారు.

News April 18, 2024

లింగంపేట్: మురికి కాలువలో పసికందు మృతదేహం

image

కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామంలో మురికి కాలువలో పసికందు మృతదేహం కలకలం రేపింది. ఇవాళ ఉదయం గ్రామస్థులు పసికందు మృతదేహన్ని మురికి కాలువలో గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 18, 2024

అభ్యర్థుల నామినేషన్స్ ప్రక్రియ సందర్భంగా నిఘా: ఎస్పీ

image

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో రాజకీయ పార్టీ అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులు, ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని హెచ్చరించారు. నామినేషన్ల కేంద్రాలు నల్గొండ జిల్లాలో ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా నిఘా కట్టుదిట్టం చేశామని తెలిపారు.

News April 18, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. మిర్చి క్వింటా జండా పాట రూ.20,000, పత్తి జెండా పాట క్వింటా రూ.7200 పలికినట్లు అధికారులు వెల్లడించారు. పత్తి, మిర్చికి మంచి ధర పలుకుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సెలవు ఉండడంతో ఈరోజు పంట మార్కెట్ కు పెద్ద ఎత్తున వచ్చింది.

News April 18, 2024

MNCL: ఆర్టీసీ బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం సుమారు 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. బస్టాండ్‌లోని ఆసిఫాబాద్‌కు వెళ్లే ప్లాట్ ఫామ్ వద్ద మరణించిన మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీ గదిలో భద్రపరిచామని, వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.