India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో మిగులు సీట్ల భర్తీకి ఈనెల 23 చివరి తేదీ అని జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగులు సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉండి ఇంకా దరఖాస్తు చేయని ఉమ్మడి కరీంనగర్ విద్యార్థులు వెంటనే నిర్దేశిత వెబ్‌సైట్ www.tswreis.ac.inలో వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
తన మీద నమ్మకంతో రానున్న పార్లమెంటు ఎన్నికల సమరంలో నాగర్ కర్నూల్ ఎంపీ స్థానానికి BRS అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా మాజీ CM KCRకు RS ప్రవీణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ‘నేను మీ నమ్మకాన్ని వమ్ముచేయను. పేద ప్రజలకిచ్చిన మాట తప్పను’ అని ట్వీట్ చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు శ్రేయోభిలాషులకు బాధ పెట్టి ఉండోచ్చు. ఒక ఉన్నతమైన లక్ష్య సాధన కోసం కొన్ని త్యాగాలు తప్పవన్నారు.
కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం జప్తి జానకంపల్లిలో జరిగింది. స్థానిక ఎస్సై రాజు వివరాలిలా.. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ప్రవీణ్.. చిన్నారులు, విద్యార్థినులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. షీ టీం ఆధ్వర్యంలో గుడ్ టచ్- బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించగా.. విషయం బయటకొచ్చిందన్నారు. కేసు నమోదు చేసినట్టు SI తెలిపారు.
గత నాలుగు రోజులుగా మల్హర్, కాటారం మండలాల పరిధిలో ఆకాశంలో అత్యంత సమీపంలో చక్కర్లు కొడుతున్న జెట్ విమానం ప్రజలను అయోమయానికి గురి చేసిన విషయం విధితమే. అయితే జెట్ విమానంపై అధికారులు అరా తీయగా ఎట్టకేలకు సమాచారం తెలిసింది. ఛత్తీస్‌గడ్‌లోని కాంకేడ్ ఎయిర్ పోర్ట్ అకాడమీలో పెట్టిన ట్రైనింగ్ నేపథ్యంలో జెట్ ఇక్కడ తిరుగుతున్నట్లు తెలిపారు. దీంతో ఊహాగానాలకు తెరపడింది.
నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ రాజ్‌కుమార్ మృతిచెందారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని సవేల గ్రామానికి చెందిన డాక్టర్ రాజ్‌కుమార్ కడెం ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. గత రాత్రి భుక్తాపూర్ వద్ద ఆయన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో డాక్టర్ రాజకుమార్ మృతిచెందారని కడెం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.
భద్రాచలం పట్టణంలోని వంతెన వద్ద స్థానిక పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో శుక్రవారం భారీగా గంజాయి పట్టుబడింది. అనుమానస్పదంగా ఉన్న వాహనాన్ని తనిఖీ చేయగా 67 కేజీల ఎండు గంజాయి దిండ్లు పట్టుబడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయిని, వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. గంజాయి విలువ సుమారు రూ.16.75లక్షలు ఉంటుందని తెలిపారు.
నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగానికి అర్హత కలిగిన వారు మొత్తం 43,326 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 22,992 మంది, మహిళలు 20,330 మంది ఉన్నారు. వీరిలో దివ్యాంగ ఓటర్లు 33,839 మంది.. 85ఏళ్లు పైబడిన ఓటర్లు 9,487 మంది ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న ఓటర్లు మాత్రమే ఫారం-12డీ ద్వారా నేటి నుంచి దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి.. ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగానికి అనుమతిస్తారు.
వరంగల్ జిల్లా సంగెం మండల ఎంపీపీ కందగట్ల కళావతి పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ మండలంలోని ఎంపీటీసీలు అందుకు సంభందించిన తీర్మాన పత్రాన్ని శుక్రవారం వరంగల్ ఆర్డీవో సీదం దత్తుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో వివిధ హోదాలలో పదవులు అనుభవించి ఇప్పుడు అధికార దాహంతో పార్టీ మారడానికి ఏర్పాట్లు చేసుకోవడంతోనే ఎంపీపీ పై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు తెలిపారు.
గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన సైదాపూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారవ.. వెన్నంపల్లి గ్రామానికి చెందిన మారుపాక మహేష్(30) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. మహేష్‌కు గురువారం రాత్రి గుండెలో నొప్పి రావడంతో హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థులు రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సమన్వయ అధికారి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సాంఘీక సంక్షేమ గురుకుల వెబ్ సైట్ tswreis.inలో పరిశీలించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.