Telangana

News March 22, 2024

NGKL ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్థానం..

image

అలంపూర్‌లో సవరన్న, ప్రేమమ్మ దంపతులకు 1967లో జన్మించిన RS ప్రవీణ్ కుమార్.. ఎంఏ(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) హార్వర్డ్ యూనివర్సిటీలో చేశారు. 1995 బ్యాచ్ IPSగా ఎంపికైన RSP స్వేరోస్ సంస్థ స్థాపించి పలు కార్యక్రమాలు చేపట్టారు. గతేడాది తన ఉద్యోగానికి రిజైన్ చేసిన ఆయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా BRSలో చేరి NGKL ఎంపీగా పోటీ చేస్తున్నారు.

News March 22, 2024

ఆదిలాబాద్ MPకి హైకమాండ్ బుజ్జగింపులు..!

image

ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాబురావుకు జాతీయస్థాయిలో నామినేటెడ్ పోస్ట్ బీజేపీ హైకమాండ్​ ఆఫర్ చేసినట్లు తెలిసింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీటును బాబురావుకు కాకుండా బీఆర్ఎస్​ నుంచి బీజేపీలో చేరిన నగేశ్‌ను ఆదిలాబాద్​ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ​సోయం తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. బీజేపీ నుంచి కాంగ్రెస్​లో చేరే ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

News March 22, 2024

సీఎం రేవంత్ రెడ్డి కలిసిన జిల్లా నాయకులు

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖ్య నాయకులు శుక్రవారం ఆయన చాంబర్ లో కలిశారు. మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ప్రతాప్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు కలిశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల అంశంపై చర్చించారు. పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సీఎం సూచించారు.

News March 22, 2024

ఖమ్మం: బీఆర్ఎస్ నుంచే నామా పోటీ

image

ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగేశ్వరరావు పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. కాగా నామా పార్టీ మారతారని, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నుంచి బరిలో ఉంటారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిపై నామా స్పందిస్తూ.. తాను బీఆర్ఎస్ నుంచే ఖమ్మం ఎన్నికల్లో బరిలో దిగుతానని పేర్కోన్నారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని నామా స్పష్టం చేశారు. రెండు రోజుల్లో నామా ఖమ్మం రానున్నారు.

News March 22, 2024

సిరిసిల్ల: 9 మంది పోలీస్ సిబ్బంది ఎస్పీ ఆఫీసుకు అటాచ్

image

వేములవాడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది పోలీస్ సిబ్బందిని సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయానికి ఎస్పీ అఖిల్ మహాజన్ అటాచ్ చేశారు. వేములవాడ పోలీస్ స్టేషన్‌లో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు కానిస్టేబుళ్లు, నలుగురు హోంగార్డులను ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు.

News March 22, 2024

KNR: ఈనెల 23 నుంచి ఓపెన్ డిగ్రీ ప్రయోగ పరీక్షలు

image

ఈనెల 23 నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మూడవ సంవత్సరం ఐదవ సెమిస్టర్ B.SC ప్రయోగ పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు కరీంనగర్ ప్రాంతీయ సమన్వయ అధికారి ఆడెపు శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. ప్రయోగ పరీక్షల సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరలా 1.గంట నుంచి నాలుగు గంటల వరకు జరుగుతాయని విద్యార్థులు తప్పక హాజరుకావాలని సూచించారు.

News March 22, 2024

పాలమూరులో ఆపరేషన్ ఆకర్ష్..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గతంలో BRS పార్టీలో కీలక పదవులు అనుభవించిన వారు.. ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, జడ్పిటిసిలు, మున్సిపల్ చైర్మన్లు, పురపాలిక చైర్మన్లు, పలువురు కౌన్సిలర్లు, MPTCలు BRS పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఆపరేషన్ ఆకర్ష్ మరింత వేగం అందుకున్నట్లు తెలుస్తోంది.

News March 22, 2024

రసవత్తరంగా మహబూబ్‌నగర్ MLC ఉపఎన్నిక

image

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ముందుకెళ్తుంది. దీంతో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను కాపాడుకునేందుకు నేతలు క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పటికే వివిధ మండలాల నుంచి ఓటర్లను క్యాంప్‌కు తీసుకెళ్లగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ ఓటర్లకు గాలం వేసే పనిలో ఉన్నారని సమాచారం.

News March 22, 2024

క్యాంప్ కార్యాలయం బోర్డు మార్చిన భద్రాచలం ఎమ్మెల్యే

image

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తుంది. కాగా భద్రాచలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసిఆర్‌తో ఉన్న బోర్డును తొలగించి, ఆయన ఒక్కరే ఉన్న ఫోటో ఫ్లెక్సీ బోర్డును అమర్చారు. బోర్డు మార్పుతో పార్టీ చేరిక ఖరారు అయినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని రెండుసార్లు కలిశారు.

News March 22, 2024

వరంగల్: అన్నదాతకు నిరాశ… తగ్గిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర భారీగా తగ్గింది. గురువారం (నిన్న) క్వింటా పత్తికి రూ.7,315 ధర రాగా.. ఈరోజు (శుక్రవారం) రూ.7250 కి పడిపోయింది. ధర తగ్గడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. రేపటినుండి మార్కెట్ కు వరుసగా మూడు రోజుల వరుస సెలవులు నేపథ్యంలో ఈరోజు పత్తి తరలివచ్చింది.