India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హనుమకొండ ఠాణా పరిధి కిషన్ పురలో వాచ్ మెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. నడికూడ మండలం చర్లపల్లికి చెందిన రాజేందర్(45) కిషన్ పురలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్ మెన్‌గా పనిచేస్తున్నాడు. వారం క్రితం భార్యాభర్తలమధ్యలో ఘర్షణ జరిగింది. దీంతో రాజేందర్ భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన అతను గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకున్నాడు.
MLC ఉపఎన్నిక నిర్వహణకు పోలింగ్ సిబ్బంది, సెక్టార్ అధికారులు, మైక్రో అబ్జర్వర్, POలు, APOలను నియమించాలని కలెక్టర్ రవి నాయక్ అన్నారు. వీరికి ఈనెల 23, 26వ తేదీల్లో మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇవ్వాలని, మొత్తం పది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, MBNR ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ ఉంటుందన్నారు. అక్కడి నుంచే ఈనెల 27న పోలింగ్ సామగ్రిని ఆయా కేంద్రాలకు పంపిణీ చేస్తామన్నారు.
ఖాజాపూర్ గ్రామానికి చెందిన సుభద్రబాయి(83)కి మతిస్థిమితం సరిగ్గా ఉండేది కాదు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం సాలూర శివారులోని ఓ కుంటలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహం గురువారం నీటిలో తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక అనంత నగర్‌కు చెందిన మహిళను ఆమె ఇంట్లోనే గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యాచారం చేసి హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో నిందితుల ఆధార్ కార్డులు, మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమాని నుంచి వివరాలు సేకరిరంచి దర్యాప్తు చేపట్టారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా MP ఎన్నికల సందడి మొదలైంది. నిన్న సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదలైంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ పరిధిలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్-12, BRS- 2 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాయి. ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ బలంగానే కనిపిస్తోంది. లోక్ సభ పోరులో ఓటరు నాడి ఎటువైపనేది ఆసక్తిగా మారింది.
ప్రమాదవశాత్తు రైలులో నుంచి కిందపడి ఓ గుర్తుతెలియని యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం మధిర రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. యువకుడి వయసు సుమారు 21 సంవత్సరాలు ఉంటుందని స్థానికులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ సభ్యుల సహకారంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడి మృతదేహం వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లభించలేదని పోలీసులు తెలిపారు.
మహబూబ్ నగర్: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న దృష్ట్యా పరిమితికి మించి రూ.50వేల నగదు, బంగారు, ఇతర ఆభరణాలు తరలిస్తే ఆధారాలు వెంట ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ తెలిపారు. జడ్పీ సీఈవో బి. రాఘవేంద్రరావు, జిల్లా ఆడిట్ అధికారి ఎం.శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి బి.పద్మ, కోశాగార ఉప సంచాలకుడు బి.శ్రీనివాస్ లతో జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.20,200 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,400 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ.100 పెరగగా, పత్తి ధర మాత్రం రూ.50 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు. ప్రతి ఒక్కరూ మార్కెట్ నిబంధనలు పాటించాలని సూచించారు.
కరువు మళ్లీ కోరలు చాస్తోంది. చేతికి అందివస్తుందనుకున్న వరి సహా పండ్ల తోటలు కళ్లముందే వాడిపోతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో 11,13,170 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా.. 1,14,796 ఎకరాల్లో వరి పంట ఎండిపోయినట్లు సమాచారం. విధిలేని పరిస్థితుల్లో కొంత మంది రైతులు తమ పొలాల్లో పశువులను మేపు తుండగా, మరికొంత మంది ట్యాంకర్లలో నీటిని తరలించి పంటలు ఎండిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
కేసముద్రం పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్ అయ్యారు. ఇటీవల సాంబయ్య, వీరన్న అనే కానిస్టేబుల్స్ ఇసుక లారీ డ్రైవర్‌ను ఘోరంగా కొట్టారు. ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందడంతో ఇద్దరిని సస్పెండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.