Telangana

News July 17, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి నేడు రూ.6,25,875 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ64,992, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.41,050, అన్నదానం రూ.5,19,833 వచ్చినట్లు ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ పేర్కొన్నారు.

News July 17, 2024

KNR: పిచ్చి కుక్కల దాడిలో 25 మందికి గాయాలు

image

హుజురాబాద్‌లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోజు రోజుకీ కుక్కల బెడదతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. హుజురాబాద్ పట్టణంలో బుధవారం రాత్రి ప్రతాపవాడ, మామిండ్లవాడ, గాంధీ నగర్, విద్యానగర్‌లలో 25 మందిని పిచ్చి కుక్కలు కరవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కుక్కల బెడద నుంచి కాపాడాలని పలు కాలనీల వాసులు కోరుతున్నారు.

News July 17, 2024

MBNR: రేపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబరాలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ కోసం మొదటి విడత లిస్టు అధికారులు విడుదల చేశారు. 2018 డిసెంబరు 12 నుంచి మంజూరైన, రెన్యూవల్ అయిన రుణాలకు, 2023 డిసెంబరు 9 వరకు బకాయిలున్న పంట రుణాలకు, స్వల్పకాలిక రుణాలకు మాత్రమే రుణమాఫీ చేయనుంది. ఈనెల 18న రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేయగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు వేదికలో సంబరాలు చేసుకోవడానికి పార్టీ నేతలు సమాయత్తం అవుతున్నారు.

News July 17, 2024

కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద రైతులపై దాడులు: హరీశ్‌రావు

image

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రిలో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యంగా భూమిని లాక్కుంటున్నారని ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతున్న ధమక్కపల్లి కిష్టయ్యను పరామర్శించారు. కాంగ్రెస్ ఇష్ట రాజ్యాంగ పేద రైతుల భూముల మీద దాడులు చేస్తున్నారని అన్నారు.

News July 17, 2024

ఆదిలాబాద్: మూడు రోజులు భారీ వర్షాలు..!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురువారం, శుక్రవారం, శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 11.5 నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. కాగా మంగళవారం ఆసిఫాబాద్ దహెగాం మండలం కుంచవెల్లిలో 13.2 సెంటిమీటర్ల వర్షం కురిసింది.

News July 17, 2024

HYD: బాలుడిని పీక్కుతిన్న కుక్కల పట్టివేత

image

విహాన్ అనే బాలుడిని కుక్కలు పీక్కుతిని చంపేసిన ఘటన‌తో జవహర్‌నగర్‌ మున్సిపల్ అధికారులు అప్రమత్తం అయ్యారు. బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో <<13645143>>కుక్కలను పట్టుకుని<<>> బర్త్ కంట్రోల్‌ సెంటర్‌కు తరలించారు. కాగా, మంగళవారం రాత్రి సుమారు 20 కుక్కలు 20 నిమిషాల పాటు దాడి‌ చేసి చిన్నారిని చంపినట్లు‌ స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై CM రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, చర్యలకు ఆదేశించారు.

News July 17, 2024

HYD: బాలుడిని పీక్కుతిన్న కుక్కల పట్టివేత

image

విహాన్ అనే బాలుడిని కుక్కలు పీక్కుతిని చంపేసిన ఘటన‌తో జవహర్‌నగర్‌ మున్సిపల్ అధికారులు అప్రమత్తం అయ్యారు. బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో <<13645143>>కుక్కలను పట్టుకుని<<>> బర్త్ కంట్రోల్‌ సెంటర్‌కు తరలించారు. కాగా, మంగళవారం రాత్రి సుమారు 20 కుక్కలు 20 నిమిషాల పాటు దాడి‌ చేసి చిన్నారిని చంపినట్లు‌ స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై CM రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, చర్యలకు ఆదేశించారు.

News July 17, 2024

భద్రాద్రి వద్ద స్వల్పంగా పెరుగుతున్న గోదావరి

image

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద నీరు వచ్చి చేరడంతో బుధవారం మధ్యాహ్నం 16 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రం ఏడు గంటలకు 18.5 అడుగులకు చేరుకుంది. వరద మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఎగువన ఉన్న ప్రాజెక్టులు గేట్లు ఎత్తి వేయడంతో భద్రాద్రి వద్ద గోదావరి గురువారం ఉదయానికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

News July 17, 2024

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

image

రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మా ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. రైతుల కష్టాలు తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడం సంతోషకరమన్నారు.

News July 17, 2024

నిజామాబాద్ జిల్లాలో 44,469 మందికి రుణమాఫీ

image

రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం విడుదల చేసే రుణమాఫీ పథకంలో నిజామాబాద్ జిల్లాలో 44,469 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారీగా రైతుల జాబితాను రూపొందించారు. కాగా తొలి విడతగా రూ.లక్ష వరకు ఉన్న రైతు రుణాలకు నిధుల విడుదల చేయనున్నారు. ఈ నెలాఖరులోపు రూ.1.5లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ, ఆగస్టులో రూ. 2లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేయనున్నారు.