Telangana

News April 18, 2024

MBNR: ఈనెల 21న ప్రవేశ పరీక్ష

image

సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 21న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ మహబూబ్ నగర్ తూర్పు ప్రాంతీయ సమన్వయకర్త విద్యుల్లత తెలిపారు. గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు జారీ చేసిన ప్రకటనతో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఆన్లైన్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

News April 18, 2024

నేడు భద్రాద్రిలో రాముడి పట్టాభిషేకం

image

భద్రాద్రిలో బుధవారం సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ పట్టాభిషేక సమయాన సకల లోకాల దేవతలు, భక్తులు నేత్రపర్వంగా తిలకించి పులకితులవుతారట. ఈ వేడుకను తిలకించేందుకు తెలంగాణ గవర్నర్‌ సీపీ. రాధాకృష్ణన్ రానున్నారు. ఇప్పటికే పట్టాభిషేకానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

News April 18, 2024

HYD‌లో ప్లంబింగ్ టెక్నీషియన్ల‌కు ఉచిత ట్రైనింగ్

image

నగరంలోని HMWSSB, ఇతర ప్రభుత్వ సంస్థలు కలిసి ప్లంబింగ్ టెక్నీషియన్లకు.. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఏప్రిల్ 22, 24, 25వ తేదీల్లో ట్రైనింగ్ ఉంటుందని వాటర్ బోర్డు తెలిపింది. ఆసక్తిగలవారు https://forms.gle/cpgRCaEqr4UBKaMH7 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

News April 18, 2024

పాలమూరు ప్రజలారా.. దొంగలతో జర జాగ్రత్త !

image

ఎండాకాలం వచ్చిందంటే చాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పట్టణవాసులు ఇంటిల్లిపాది విహారయాత్రలు, సొంతూళ్లకు వెళ్తుంటారు. ప్రతి ఏడాదిలో జరిగే చోరీల కంటే ఈ వేసవి మూడు నెలల వ్యవధిలోని అధిక శాతం జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అంతర రాష్ట్ర ముఠా సైతం వేసవిని ఆసరాగా చేసుకుంటున్నారు. అందుకే వేసవి వేళ, ఉమ్మడి జిల్లా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

News April 18, 2024

HYD: 40 శాతం మందికే వాటర్‌ మీటర్లు!

image

HYD నగరంలో HMWSSB పరిధిలో దాదాపు 13.5 లక్షల మంది వినియోగదారులు ఉండగా కేవలం సుమారు 5 లక్షల వరకు, అంటే 40 శాతానికి తక్కువ మందికి మాత్రమే వాటర్ మీటర్లు ఉండడం గమనార్హం. HMWSSB రికార్డుల ప్రకారం మీటర్లు అంతంత మాత్రమే ఉండటంతో నల్లాలకు మోటర్లు పెట్టి నీటిని లాగేస్తున్నా తెలియని పరిస్థితి. నీటి ఎద్దడికి ఇదొక కారణంగా కనిపిస్తోంది. దీనిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

News April 18, 2024

NZB: ఈ నెల 19న BRS ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి నామినేషన్

image

నిజామాబాద్ పార్లమెంట్ BRS ఎంపీ అభ్యర్థిగా ఈ నెల 19న మధ్యాహ్నం 12.05 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరు కానున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాల BRS శ్రేణులు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

News April 18, 2024

MBNR: నేటి నుంచి నామినేషన్ల పర్వం..

image

నేటి నుంచి ఎంపీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 24 వరకు ఉమ్మడి జిల్లాలోని 2 ఎంపీ స్థానాలకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉ. 10 గంటల నుంచి మ. 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారి ఛాంబర్లోకి అయిదుగురికి మాత్రమే అనుమతి ఉందని పేర్కొన్నారు.

News April 18, 2024

సిద్దిపేట: ‘నామినేషన్ల స్వీకరణ పకడ్బందీగా నిర్వహించాలి’

image

ఉమ్మడి జిల్లాలో లోక్ సభ ఎన్నికలు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్ల స్వీకరణ, తుది ఓటరు జాబితా రూపకల్పనపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సిద్దిపేట కలెక్టర్ మనూచౌదరి, అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ పాల్గొన్నారు.

News April 18, 2024

నేడు భద్రాద్రికి గవర్నర్

image

నేడు భద్రాద్రిలో మహా పట్టాభిషేకం కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ రానున్నారు. ఈ సందర్భంగా విధులు కేటాయించిన అధికారులు ఉదయం 6 గంటలకే హాజరుకావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. గవర్నర్ పర్యటనపై బుధవారం ఐటీసీ విశ్రాంతి భవనంలో రెవెన్యూ, డీఆర్డీఎ, జడ్పీ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమీక్షించారు. గవర్నర్ పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొవాలని అధికారులను ఆదేశించారు.

News April 18, 2024

సిరిసిల్ల: పకడ్బందీగా నామినేషన్ల ప్రక్రియ చేపట్టాలి: వికాస్ రాజ్

image

పకడ్బందీగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. ఎంపీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ, తుది ఓటర్ జాబితా రూపకల్పనపై జిల్లా ఎన్నికల అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్ ఓటర్ నమోదు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సమావేశంలో సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్, ఆర్డిఓలు రమేష్, రాజేశ్వర్ పాల్గొన్నారు.