India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో ఈ సారి ఎండాకాలం లోక్‌సభ ఎన్నికలతో మరింత వేడెక్కనుంది . రాజకీయ పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు, అభ్యర్థుల ప్రకటనలతో ప్రచార ప్రక్రియ ఊపందుకుంటుంది. ఇప్పటికే నల్లగొండకు అభ్యర్థిని ప్రకటించి కాంగ్రెస్, బిజెపిలు ఒక అడుగు ముందుకు వేశాయి. భువనగిరి ఎంపీ స్థానానికి ఏ పార్టీ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్లో టికెట్ కోసం పోటీ పడుతుండగా.. బీఆర్ఎస్‌లో అయోమయం నెలకొంది.
పెద్దపల్లి లోక్ సభ ఎన్నికల్లో మూడు పార్టీల అభ్యర్థులను ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్, కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ బరిలో ఉన్నారు. అయితే పెద్దపల్లిలో మూడు పార్టీల అభ్యర్థులను ప్రకటించడంతో రాజకీయం వేడెక్కింది. మూడు పార్టీల నాయకులు ప్రచారంతో హోరెత్తించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎవరు గెలుస్తారో మీరు కామెంట్ చేయండి.
లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఈ మేరకు భువనగిరి స్థానానికి అభ్యర్థిని కూడా ప్రకటించింది. సీపీఐతో కలిసి పోటీ చేయాలని భావించినా.. ఆ పార్టీ కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలనే యోచనలో ఉండడంతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. కాగా సీపీఎంకు పడే ఓట్ల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్..
ఖమ్మం జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ కార్డుల పంపిణీ ప్రక్రియను తపాలాశాఖ మొదలు పెట్టింది. ఐదు నియోజకవర్గాలలో మొత్తం 37 వేల కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఖమ్మం ప్రధాన తపాలా కార్యాలయానికి చేరిన కార్డులను స్పీడ్ పోస్ట్ ద్వారా అందించే కసరత్తును పోస్టల్ శాఖ ప్రారంభించింది.
కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రకటించిన రెండో జాబితాలో WGL లోక్‌సభ అభ్యర్థి పేరు లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న ఆశావహులు, ఎవరికి వారు టికెట్ తమకే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఈసారి లోకసభ ఎన్నికల్లో ఆశించిన మేరకు సీట్లు సాధించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. కాగా, కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఈనెల 28న జరగనున్న MBNR స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రవినాయక్ అధికారులను ఆదేశించారు. ఉపఎన్నికకు సంబంధించి నోడల్ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. ARO, నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పోలింగ్ సిబ్బందికి ఈనెల 23, 26న శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు.
యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉ.9గం లకు మహా చండి హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచకాలు, దోపిడీ పాలన పోయిందని, ప్రజా పాలన వచ్చిందని చెప్పారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం తథ్యమని అన్నారు.
రాష్ట్రంలో దోపిడీ పాలన పోయి ప్రజల పాలన వచ్చిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కేంద్రానికి చెందిన పలువురు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్ తదితరులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఏప్రిల్ రెండో తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.
Sorry, no posts matched your criteria.