Telangana

News September 5, 2024

HYD: బస్తీ దవాఖానాల్లో డెంగీ కిట్లు

image

జ్వరాలు, ఇతర వ్యాధులపై వైద్య, ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రులు, బస్తీ, పల్లె దవాఖానాలలో అన్ని రకాల వైద్య పరీక్షలను చేస్తున్నారు. మందులను ఇవ్వడంతో పాటు డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే ప్రత్యేక కిట్ల ద్వారా పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేయనున్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే ప్రజలు అప్రమత్తం కావాలని, రోగులకు ఆందోళన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.

News September 5, 2024

నవరాత్రి ఉత్సవాలకు డిప్యూటీ సీఎంకు ఆహ్వానం

image

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నుంచి జరుగునున్న గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సిందిగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లును ఆహ్వానించారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, పార్టీ నాయకులు ఉత్సవ కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు ఉన్నారు.

News September 5, 2024

ఖైరతాబాద్: నిమ్స్ అంటువ్యాధుల చికిత్సకు ప్రత్యేక ఓపీ

image

అంటువ్యాధుల చికిత్సకు పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక ఓపీ సేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. ఇందుకోసం తమిళనాడు సీఎంసీ ఆస్పత్రి డాక్టర్ కె. భానుప్రసాద్‌ను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించినట్లు చెప్పారు. ఆస్పత్రి పాత భవనంలోని జనరల్ మెడిసిన్ విభాగంలో ఓపీ సేవల్ని అందిస్తున్నారు. ప్రతీ మంగళవారం, గురువారం వైద్యుడు అందుబాటులో ఉంటారని తెలిపారు.

News September 5, 2024

HYD: బ్యాడ్మింటన్ టోర్నీకి దరఖాస్తులు

image

తెలంగాణ ఓపెన్ మాస్టర్స్ డబుల్స్ ప్రైజ్ మనీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్-2024కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్ఆర్డీబీఏ ప్రధానకార్యదర్శి కరెడ్ల శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. కొత్తపేటలోని స్పీడ్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆవరణలో ‘ప్రాస్పెక్టస్’ పేరిట ఈ నెల 19-22 వరకు పోటీలు ఉంటాయన్నారు. 17వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

News September 5, 2024

వరద బాధితులను ప్రభుత్వాలు ఆదుకోవాలి: DBP అధ్యక్షుడు

image

తెలుగు రాష్ట్రాలలో వరద బాధితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన అదుకోవాలని దీన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో వారు మాట్లాడుతూ.. వరదల్లో మృతి చెందిన వారి ఒక్కొక్క కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని, క్షతగాత్రులకు రూ.5లక్షలు ఇవ్వాలన్నారు.

News September 5, 2024

HYD: ‘వరదలకు దెబ్బతిన్న కల్వర్టుల వివరాలను నమోదు చేయాలి’

image

వరదలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల వివరాలను నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెగిన కాలువలు, కుంటలు, చెరువు కట్టలు, కల్వర్ట్‌లపై నివేదిక సిద్ధం చేయాలన్నారు.

News September 5, 2024

NLG: మీ ఫేవరెట్ టీచర్ ఎవరు..? కామెంట్ చేయండి!

image

విద్యార్థుల్లో విజ్ఞాన వెలుగులు నింపుతూ, వారు ఉన్నత స్థాయికి చేరేలా నిరంతరం కృషి చేసే వారే గురువులు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నల్గొండ, యాదాద్రి-భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లోని అన్ని విద్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీనియర్ విద్యార్థులు టీచర్లుగా మారి జూనియర్లకు పాఠాలు బోధిస్తూ సందడి చేస్తున్నారు. మరి.. మీ ఫేవరేట్ టీచర్ ఎవరో కామెంట్ చేయండి. SHARE IT

News September 5, 2024

KMM: మీ ఫేవరెట్ టీచర్ ఎవరు..? కామెంట్ చేయండి!

image

విద్యార్థుల్లో విజ్ఞాన వెలుగులు నింపుతూ, వారు ఉన్నత స్థాయికి చేరేలా నిరంతరం కృషి చేసే వారే గురువులు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లోని అన్ని విద్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీనియర్ విద్యార్థులు టీచర్లుగా మారి జూనియర్లకు పాఠాలు బోధిస్తూ సందడి చేస్తున్నారు. మరి.. మీ ఫేవరేట్ టీచర్ ఎవరో కామెంట్ చేయండి. SHARE IT

News September 5, 2024

భువనగిరి: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన పీఈటీ వీరేశం

image

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం జలాల్పూర్ గ్రామంలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్న వీరేశంకు ఉపాధ్యాయ జిల్లా అవార్డుకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ జిల్లా పరిషత్ పాఠశాలల 2024 అవార్డులను ప్రకటించారు. జిల్లాలోని 25 మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు అవార్డులను ప్రభుత్వం ఎంపిక చేశారు.

News September 5, 2024

KNR: మీ ఫేవరెట్ టీచర్ ఎవరు..? కామెంట్ చేయండి!

image

విద్యార్థుల్లో విజ్ఞాన వెలుగులు నింపుతూ, వారు ఉన్నత స్థాయికి చేరేలా నిరంతరం కృషి చేసే వారే గురువులు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని అన్ని విద్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీనియర్ విద్యార్థులు టీచర్లుగా మారి జూనియర్లకు పాఠాలు బోధిస్తూ సందడి చేస్తున్నారు. మరి.. మీ ఫేవరేట్ టీచర్ ఎవరో కామెంట్ చేయండి. SHARE IT