India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలోని చైతన్యపురికి చెందిన గాడిపర్తి సాహి దర్శిని UPSCలో 112వ ర్యాంకు పొందారు. ఆమె తల్లి హైకోర్టులో న్యాయవాది, తండ్రి ప్రైవేటు స్కూల్ నిర్వాహకుడు. ఇంటర్ వరకూ HYDలోనే చదువుకున్నారు. ఐఐటీ పట్నాలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. పేదవారికి సేవ చేయాలన్నదే తన లక్ష్యమని సాహి దర్శిని పేర్కొన్నారు.
HYDలోని చైతన్యపురికి చెందిన గాడిపర్తి సాహి దర్శిని UPSCలో 112వ ర్యాంకు పొందారు. ఆమె తల్లి హైకోర్టులో న్యాయవాది, తండ్రి ప్రైవేటు స్కూల్ నిర్వాహకుడు. ఇంటర్ వరకూ HYDలోనే చదువుకున్నారు. ఐఐటీ పట్నాలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. పేదవారికి సేవ చేయాలన్నదే తన లక్ష్యమని సాహి దర్శిని పేర్కొన్నారు.
ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనరల్ అభ్యర్థులు రూ.25వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయపార్టీల అభ్యర్థులను ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. గుర్తింపు పొందని రాజకీయపార్టీలు, స్వతంత్ర అభ్యర్థులను పది మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది. నామినేషన్ తో పాటు ఫారం 26 ద్వారా అఫిడవిట్ దాఖలు చేయాలని కలెక్టర్ హరిచందన తెలిపారు.
మహబూబ్ నగర్ పట్టణం ఎనుగొండలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామిని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. స్వామి వారికి పూజలు నిర్వహించారు. అనంతరం పురోహితులు తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భద్రాచలంలో సీతారాముల కల్యాణాన్ని
తిలకించిన భక్తజనకోటి పులకించింది. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడు సీతమ్మ తల్లిని మనువాడిన ఘట్టాన్ని చూసిన భక్తులు తరించారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భద్రాచలానికి తరలివచ్చిన భక్తులు ఎమ్మెల్యే పాయం, ఎమ్మెల్యే తెల్ల వీక్షించి పులకించారు. భక్తుల జయ జయధ్వానాలు, వేద పండితుల మంత్రోచ్చారణలు కల్యాణతంతుతో మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించింది.
భద్రాచలంలో జరుగుతున్న శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. సాంప్రదాయ దుస్తుల్లో పొంగులేటి బ్రదర్స్ అందరినీ ఆకర్షించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆలయ ఈవో రమాదేవి వారికి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ రామనవమి సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు బాస బాల్ కిషన్ ఆకుపై శ్రీ రాముని చిత్ర పటం వేశాడు. దీంతో పాటు జై శ్రీ రామ్ నామం 12 భాషల్లో రాశాడు. దీన్ని చూసిన వారు బాల్ కిషన్‌కు అభినందనలు తెలియజేశారు. కాగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్ కిషన్ చిత్ర కళ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పలు రకాల వినూత్న చిత్రాలు గీసి ప్రశంసలు పొందాడు.
లోక్‌సభ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే కారణంతో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ హఫ్జల్ హసన్, ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఆర్.వీ.సాగర్ ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరించారని ఫిర్యాదు అందింది. దీంతో విచారణ అనంతరం వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ నిషేధిత CPI మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న అజ్ఞాత మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోవాలని ములుగు ఎస్పీ శబరీష్ ప్రకటనలో తెలిపారు. ఆ పార్టీ సిద్ధాంతాలు కాలం చెల్లినవని, వారి భావజాలం ప్రజల్లో ప్రాముఖ్యం కోల్పోయిందని పేర్కొన్నారు. మావోయిస్టు సిద్ధాంతాలను ప్రజలు నమ్మడం లేదన్నారు.
మెదక్ జిల్లాకు CM రేవంత్ రెడ్డి రానున్నారు. శామీర్‌పేటలో మంగళవారం రాత్రి PCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మల్కాజిగిరి మాజీ MLA మైనంపల్లి, ఎంపీ అభ్యర్థి నీలం మధు, డీసీసీ ప్రెసిడెంట్లు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మండల, బ్లాక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులతో మంత్రి కొండా సురేఖ సమావేశమయ్యారు. నీలం మధు ఏప్రిల్ 20న నామినేషన్ వేస్తారని.. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.