India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD, ఉమ్మడి RRలోని పార్లమెంట్ స్థానాల్లో BRS మాజీ నేతలకే రెండు జాతీయ పార్టీల్లో టికెట్లు వస్తుండడం గమనార్హం. BRSను వీడి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌కు టికెట్ కన్ఫర్మ్ కాగా సునీతా మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డికి కూడా టికెట్ ఇస్తారని సమాచారం. ఇక BRSను వీడి BJPలో చేరిన ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఇప్పటికే టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. దీనిపై మీ కామెంట్?
ఓ తల్లి కొడుకుని హత్య చేసిన ఘటన బిజినపల్లి మండలం అల్లిపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకు హరీశ్(11)ను గురువారం ఇంట్లో భర్త లేని సమయంలో రోకలి బండతో కొట్టి చంపేసింది. తర్వాత బుట్టలో చుట్టి, నీటి తొట్టిలో పడేసి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆత్రం సుగుణ సీఎం రేవంత్ రెడ్డి, ఇంఛార్జ్ జిల్లా మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో గురువారం చేరారు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఆమె ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆమె బరిలో ఉన్నారు.
బీఆర్ఎస్ నాయకులకు నీళ్లు వదలమని అడిగే హక్కు లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత వర్షాకాల సీజన్ లో వాళ్లు అధికారంలో ఉన్నప్పటికీ నీటిని విడుదల చేయలేకపోయారని అలాంటప్పుడు ఈ సీజన్ లో నీళ్లు ఇవ్వమని అడిగే హక్కు వారికి ఎలా ఉంటుందని మంత్రి ప్రశ్నించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలను పూర్తిగా ఎండబెట్టే పరిస్థితికి తెచ్చారని బీఆర్ఎస్ పై ఆయన మండిపడ్డారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ఓయూ జేఏసీ నేత, కడెం మండలానికి చెందిన సిద్ధార్థ నాయక్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు గురువారం కడెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబడి ఉందని వాపోయారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం తాను ఎన్నికల బరిలో దిగుతున్నానని ఆయన తెలిపారు. ఓయూ జేఏసీ తరఫున పోటీ చేయనున్నానని ఆయన వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గురువారం పాలకవర్గం పెట్టిన అవిశ్వాస తీర్మాన సమావేశంలో భాస్కర్ రెడ్డికీ వ్యతిరేకంగా మెజార్టీ సభ్యులు ఓటింగ్లో పాల్గొనడంతో ఆయన పదవి కోల్పోయారు. 21 మంది పాలకవర్గ సభ్యులకుగాను 17 మంది హాజరయ్యారు. అందులో 16 మంది భాస్కర్ రెడ్డి పై వ్యతిరేకంగా చేతులెత్తి అవిశ్వాసానికి మద్దతు తెలిపారు.
సుజాతనగర్ మండలంలో పదో తరగతి బాలికపై అదే తరగతికి చెందిన <<12894244>>బాలుడు అత్యాచారానికి <<>>పాల్పడిన ఘటన తెలిసిందే. బాలిక తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టగా.. సదరు బాలుడికి రూ.2 లక్షలు జరిమానా విధించారు. తాజాగా ఈ విషయం బయటకు రావడంతో రంగంలో దిగిన ఐసీడీఎస్ అధికారులు బాలికను విచారించి బాలుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాంతంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నివేదికల ప్రకారం 2018 సంవత్సరంలో 12, 2021 సంవత్సరంలో 21 పులులు ఉండగా, ప్రస్తుతం 2024 సంవత్సరంలో 32 పెద్ద పులులు ఉన్నట్లు గుర్తించారు. ఇవి కాక చిరుత పులులు 176, ఎలుగుబంట్లు 250, ఇతర అటవీ జంతువులు 10వేల వరకు ఉన్నాయి. క్రమంగా వన్యప్రాణుల సంఖ్య పెరగటంతో పరోక్షంగా అడవి సంరక్షణకు ఉపయోగపడుతోంది.
రానున్న ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశామని పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి కరీంనగర్‌లోని అన్ని హోటళ్లు, లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. అక్రమ డబ్బు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేసే వారిని కట్టడి చేస్తామన్నారు.
అత్యాచారం కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ రాజేంద్రనగర్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. గచ్చిబౌలి PS పరిధిలో ఉండే బాలిక మీద కన్నేసిన శివకృష్ణ (22).. 2014, అక్టోబర్‌లో కిడ్నాప్ చేశాడు. ఓ గదిలో బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. బుధవారం విచారణకు రాగా 10 ఏళ్ల జైలు శిక్ష, బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది.
Sorry, no posts matched your criteria.