India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన KPHB పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. రణధీశ్ (20) KPHB పరిధిలోని ప్రైవేట్ వసతి గృహంలో ఉంటూ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి మియాపూర్‌లోని స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. తిరిగి వస్తున్న సమయంలో JNTU మెట్రో స్టేషన్ వద్ద పాల వ్యాన్ వెనుక నుంచి ఢీకొనడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కన్న తండ్రిని కొడుకు హత్య చేసినట్లు కంగ్టి ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. మండలంలోని చౌకన్పల్లికి చెందిన మారుతిని తన కొడుకు నరసప్ప డబ్బులు అవసరమని మంగళవారం అడిగాడు. దీనికి తండ్రి నిరాకరించడంతో కోపోద్రిక్తుడై నరసప్ప ఆవేశంతో గొడ్డలితో తండ్రిపై దాడి చేశారు. మారుతికి చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
మద్యం మత్తులో యాసిడ్ తాగి ఓ యువకుడు మృతిచెందిన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. ఆటోనగర్‌కు చెందిన షేక్ మాజిద్(31) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. సోమవారం మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన మాజిద్ బాత్‌రూమ్‌లో ఉన్న యాసిడ్ తాగాడు. తీవ్రంగా కడుపునొప్పి రావడంతో గమనించిన కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనపై SI మొగులయ్య కేసు నమోదు చేశారు.
తల్లిదండ్రులు మందలించారని ఓ బాలిక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుండాల మండలంలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ వివరాల ప్రకారం.. గుండాల మండలం సాయనపల్లికి చెందిన రమ్య గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. ఇటీవల ఇంటికి వచ్చిన రమ్యను మళ్ళీ హాస్టల్‌కి వెళ్ళమని తల్లిదండ్రులు మందలించారు. హాస్టల్‌కు వెళ్లడం ఇష్టం లేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో బుధవారం భారీగా కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడటం, విద్యుత్ సరఫరా స్తంభించడం వంటివి జరగవచ్చని పేర్కొంది. మంగళవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి అని వెల్లడించింది.
ఉమ్మడి పాలమూరులో రూ.2లక్షల రుణమాఫీపై అధికారులు ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టారు. జిల్లాలో మొత్తం 5,49,108 మంది రైతులు ఉండగా సుమారు రూ.2,736 కోట్ల వరకు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో 70 శాతం మందికిపైగా రూ.లక్ష లోపు వారే. ఈనెల 18న లక్ష వరకు నగదు జమయ్యే రైతులు 3.14 లక్షల మంది ఉండొచ్చని అంచనా. అయితే ప్రభుత్వం మార్గదర్శకాల నేపథ్యంలో మాఫీ ఎవరెవరికి వర్తిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ. 2లక్షల రుణమాఫీపై అధికారులు ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టారు. జిల్లాలో మొత్తం 5.36లక్షల మంది రైతులు ఉండగా సుమారు రూ.7500 కోట్ల వరకు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో రుణమాఫీ రూ.500 కోట్లు కానున్నట్లు సీఈవో శంకర్‌రావు పేర్కొన్నారు. దీనిపై 19న జరిగే పాలకవర్గం సమావేశంలో నిర్ణయం తీసుకుంటారన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు అంతంతమాత్రమే సాగుతోంది. ఇప్పటివరకు 39.35 శాతం పంటల్ని వేశారు. గతేడాదితో వర్షపాతం విషయంలో పెద్దగా మార్పులేమి లేకున్నా సాగులో మాత్రం వెనకబడింది. సాధారణంగా సాగు చేసే భూమి 15,36,907 ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు సాగైంది 6,04,745 మాత్రమే. పత్తి 4,62,452, మొక్కజొన్న 37,516, వరినాట్లు 20,378 ఎకరాల్లో సాగుచేశారు.
ఉమ్మడి జిల్లాలో ఆదాయపు పన్ను రిఫండ్ పొందేందుకు కొందరు అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు. హైదరాబాద్ రేంజ్-5 పరిధిలో తప్పుడు వివరాలు సమర్పించిన వారు 14 వేల మంది ఉంటే.. అందులో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10,635 మంది ఉన్నారు. తప్పుడు వివరాలు సమర్పించవద్దని, అక్రమ మార్గాలు అనుసరించవద్దని ఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్ సుమిత సూచించారు. కొనుగోళ్లు, చెల్లింపుల వివరాలు ఆదాయపు పన్ను శాఖకు అందుతాయని అన్నారు.
HYD జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 28వ డివిజన్ ఆదర్శ నగర్ కాలనీ ఫేజ్-2లో దారుణం జరిగింది. స్థానికంగా ఉండే విహాన్ అనే బాలుడిపై మంగళవారం రాత్రి కుక్కల గుంపు దాడి చేసింది. కొన్ని కుక్కలు ఆ బాలుడి నెత్తి భాగాన్ని పీక్కుతిన్నాయి. విహాన్ జుట్టు, చర్మం ఊడి నేలపై పడ్డాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విహాన్ మృతిచెందాడని స్థానికుడు నరేందర్ యాదవ్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.