Telangana

News July 17, 2024

HYD: బాలుడిని పీక్కు తిన్న కుక్కలు.. మృతి

image

HYD జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 28వ డివిజన్ ఆదర్శ నగర్ కాలనీ ఫేజ్-2లో దారుణం జరిగింది. స్థానికంగా ఉండే విహాన్ అనే బాలుడిపై మంగళవారం రాత్రి కుక్కల గుంపు దాడి చేసింది. కొన్ని కుక్కలు ఆ బాలుడి నెత్తి భాగాన్ని పీక్కుతిన్నాయి. విహాన్ జుట్టు, చర్మం ఊడి నేలపై పడ్డాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విహాన్ మృతిచెందాడని స్థానికుడు నరేందర్ యాదవ్ తెలిపారు.

News July 17, 2024

మంత్రి కోమటిరెడ్డి తొలి ఏకాదశి శుభాకాంక్షలు

image

జిల్లా ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. తొలకరితో తోడుగా వచ్చే తొలిఏకాదశి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను తీసుకువస్తుందన్నారు. అలాగే ముస్లిం సోదరులకు మొహర్రం పండుగా శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలకు గుర్తుగా జరుపుకునే పండగ మొహర్రం అన్నారు. లౌకికవాద స్ఫూర్తికి మొహర్రం తార్కాణంగా నిలుస్తుందన్నారు.

News July 17, 2024

నిజామాబాద్: రూ.45 లక్షలు కాజేసిన మహిళ

image

ఓ బ్యాంకు CSP నిర్వహకురాలు మహిళా సంఘాల వద్ద రూ.45లక్షలు కాజేసిన ఘటన పొతంగల్ మం. కల్లూర్‌లో వెలుగుచూసింది. CSPగా పనిచేస్తున్న సంధ్య 40 మహిళా సంఘాలకు చెందిన నగదును బ్యాంకులో జమచేసేది. కాగా 9 నెలలుగా ఆ నగదును ఆమె అక్కలు, తన బావ ఖాతాల్లో జమచేసింది. అనుమానం వచ్చిన IKP CC రమ బ్యాంకు లావాదేవీలు పరిశీలించగా విషయం బయటపడింది. దీనిపై విచారణ చేపట్టిన కోటగిరి SI సందీప్ సదరు మహిళను విచారించగా నేరం ఒప్పుకుంది.

News July 17, 2024

పాలేరు అభ్యర్థులకు నోటీసులు

image

అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు
నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో వ్యయ వివరాలు వెల్లడించని ఇద్దరికి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఎన్నికల నియామవళి ప్రకారం పోటీ చేసిన అభ్యర్థులు ప్రచారానికి వెచ్చించిన ప్రతీ ఖర్చు వివరాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. కానీ పాలేరులో రామిరెడ్డి సుంకిరెడ్డి, రామసహాయం మాధవీరెడ్డి వివరాలు సమర్పించకపోవడంతో నోటీసులు పంపారు. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని తెలిపారు.

News July 17, 2024

19 నుంచి మిర్యాలగూడ స్టాప్‌ ఎత్తివేత

image

విశాఖ, చైన్నె, నారాయణాద్రి రైళ్లకు మిర్యాలగూడలో ఈనెల 19నుంచి స్టాప్‌ను ఎత్తివేస్తూ రైల్వే అధికారులు ఆదేశాలిచ్చారు. కోవిడ్‌ సమయంలో ఈ రైళ్లకు స్టాప్‌ ఎత్తివేయగా EX MP ఉత్తమ్‌, EX MLA భాస్కర్‌రావు మిర్యాలగూడలో రైళ్లను నిలపాలంటూ అధికారులకు విన్నవించారు. గత ఏడాది జులై నుంచి ఆయా రైళ్లు నిలిచేలా అనుమతించారు. ఆదేశాలిచ్చేటప్పుడే ఏడాది పాటు రైళ్లు నిలుపుతామని ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం ఏడాది పూర్తయింది.

News July 17, 2024

MBNR: జూరాలకు కృష్ణమ్మ పరుగులు

image

ఎగువన కురుస్తోన్న వర్షాలకు జూరాలకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. అల్మట్టి జలాశయానికి మంగళవారం వరకు లక్ష క్యూసెక్కులకు పైగా వరద చేరింది. నారాయణ్‌పూర్ జాలాశయంలో 37.64TMCలకు గానూ 28.67TMCల నిల్వ ఉంది. దీంతో జూరాలకు 3వేల క్యూసెక్కులను వదులుతుండగా దాన్ని 60వేల వరకు పెంచే అవకాశం ఉందని ప్రాజెక్టు ఈఈ అహ్మద్ తెలిపారు. జూరాల సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిలువ 7.68 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

News July 17, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు GOOD NEWS

image

రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈనెల 18న రైతుల ఖాతాల్లో తొలి విడుతగా రూ.లక్ష జమ చేస్తామని CM ప్రకటించారు. 2018-12-12 నుంచి 2023-12-9 వరకు పంట రుణాలు రూ.2లక్షల్లోపు మాఫీ కానున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ ఉన్న 4.50 లక్షల మందికి రూ.3,509 కోట్లు కావాలని అధికారుల అంచనా. ADB 1.17- రూ.1030.61కోట్లు, మంచిర్యాల 0.94- రూ.804.22, నిర్మల్ 1.20- రూ.952.39కోట్లు, ASF 1.19- 722.18 కోట్లు అవసరం కానున్నాయి.

News July 17, 2024

జగిత్యాల్లో ఆటోమెటిక్ వాతావరణ కేంద్రం

image

జగిత్యాలలో వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఆటోమెటిక్ వాతావరణ కేంద్రాన్ని భారత వాతావరణ శాస్త్ర విభాగం, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ, భారత శాస్త్ర, సాంకేతిక విభాగం రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. దీంతో వాతావరణ పరిస్థితులను 5రోజుల ముందుగానే తెలుసుకోవచ్చు. వాతావరణాన్ని అంచనా వేసి సంబంధిత వాతావరణ కేంద్రానికి పంపిస్తారు. ఆ వివరాలు వాతావరణ కేంద్రం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు.

News July 17, 2024

‘ఆదాయ పన్ను ఎగవేతదారులపై చర్యలుంటాయి’

image

ఆదాయ పన్ను ఎగవేతదారులపై చర్యలుంటాయని ఖమ్మం ఆదాయపన్ను అధికారి ఉమామహేశ్వర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీడీవోలకు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలుపై ఆదాయపన్ను అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి ఆదాయపన్ను ముఖ్య ఆదాయ వనరులని, ఆదాయపన్ను క్రింద వసూలయ్యే ప్రతి పైసా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చవుతుందన్నారు.

News July 17, 2024

ఆర్డినెన్స్ అధికారులతో మెదక్ ఎంపీ సమీక్ష సమావేశం

image

సంగారెడ్డి జిల్లా ఎద్దు మైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉన్నతాధికారులతో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉద్యోగ భద్రత, కార్మిక సమస్యలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చీఫ్ జనరల్ మేనేజర్ శివ శంకర్ ప్రసాద్, జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) విజయ్ దత్, బీజేపీ రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్, బీఎంఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.