India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మండలానికి చెందిన ఓ బాలిక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బోధన్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో వెతకగా 10 పేజీల లెటర్ లభ్యమైనట్లు వెల్లడించారు. 4 ఏళ్ల క్రితం ఆమె తండ్రి చనిపోవడంతో మనస్తాపానికి గురైనట్లు ఆమె తల్లి పేర్కొంది.
ఈనెల 25నుంచి మే 2వరకు జరుగనున్న ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సోమవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా సాగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పరీక్ష కేంద్రాల్లోకి ఫోన్లు అనుమతించొద్దన్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలతో పాటుగా వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీస్ డిప్లమోలలో ప్రవేశం కోసం నిర్వహించే పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష పాలీసెట్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ భరద్వాజ పేర్కొన్నారు. ఏప్రిల్ 22 వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని, మే 17న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. 150 మార్కులతో పరీక్ష ఉంటుందన్నారు.
భద్రాచలం గోదావరి నదిపై నిర్మించిన రెండవ వంతెనను జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, ఎస్పీ సోమవారం మధ్యాహ్నం లాంఛనంగా ప్రారంభించారు. 2014లో అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంతెనకు శంకుస్థాపన చేశారు. పదేళ్లుగా నిర్మిస్తున్న ఈ వంతెనను శ్రీరామనవమి నాటికి ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వంతెనను రూ. 100 కోట్ల వ్యయంతో 2 కీ.మీ పొడవు నిర్మించారు.
ఎండాకాలం వచ్చేసింది. HYD నగరంలో ఇంటిల్లిపాది విహారయాత్రలు, సొంతూళ్లకు వెళ్తుంటారు. ఏటా HYD, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో కలిపి 3 వేలకు పైగా చోరీలు జరుగుతుంటే అందులో అధిక శాతం ఈ వేసవి మూడు నెలల వ్యవధిలోనివేనని అధికారులు తెలిపారు. అంతర రాష్ట్ర ముఠా సైతం వేసవిని ఆసరాగా చేసుకుంటున్నారు. అందుకే వేసవి వేళ, నగర ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
గ్రేటర్ పరిధిలో HYD,RR జిల్లాల వినియోగదారుల కమిషన్లున్నాయి. ఇందులో ప్రతినెలా 100కి పైగా కొత్త కేసులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత ఈ 3 నెలల్లోనే 30-40 శాతం కేసులు నమోదయ్యాయని, విహారయాత్రలకు వెళ్లే వారి నుంచి టూర్ ప్యాకేజీలు, టిక్కెట్ బుకింగ్స్ పేరుతో ముందే డబ్బులు వసూలు చేస్తున్న కొన్ని సంస్థలు మోసం చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ విభాగం ఇన్‌ఛార్జ్‌గా కౌన్సిలర్ అంబకంటి అశోక్‌ను నియమిస్తూ ఓబీసీ కమిటీ రాష్ట్ర ఛైర్మన్ శ్రీకాంత్ గౌడ్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు, కౌన్సిలర్ అంబకంటి అశోక్ ప్రస్తుతం పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. తాజాగా ఆయనకు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ట్రాఫిక్ రూట్, పార్కింగ్ స్థలాలు, తలంబ్రాలు, లడ్డూ ప్రసాదం స్టాల్స్, కల్యాణ మండపం యొక్క సెక్టార్ ప్లాన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్యూఆర్ కోడ్ లో పూర్తి సమాచారం లభిస్తుందని తెలిపారు.
నల్గొండలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సోమశేఖర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మిర్యాలగూడ మండలం కొత్తగూడెంలోని నూకల వెంకట్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రి ఫార్మసీ అనుమతి కోసం 20,000 డిమాండ్ చేశాడు. భాదితుడు సోమశేఖర్‌కు రూ. 18 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు.
నిజామాబాద్ నగరం, జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏక కాలంలో తనిఖీలు చేస్తున్నారు. వ్యాపారుల వద్ద నుంచి అప్పు తీసుకున్న వారికి సంబంధించిన ఆస్తి పత్రాలు, చెక్కులు, ప్రామిసరీ నోట్లను సీజ్ చేశారు. పలువురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.