Telangana

News March 20, 2024

కరీంనగర్: గుండెపోటుతో ఏఎస్సై మృతి

image

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మార్కొండ కిషన్(59) బుధవారం జ్యోతినగర్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. కిషన్ పోలీస్ శాఖలో సుధీర్ఘ కాలం పాటు సేవలందించారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంత్యక్రియలు వారి స్వగ్రామమైన తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో జరగనున్నాయి.

News March 20, 2024

టేక్మాల్: చెరువులో దూకి వృద్ధ మహిళ ఆత్మహత్య

image

టేక్మాల్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన నీరుడి కిష్టమ్మ(70) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గొల్లగూడెం గ్రామానికి చెందిన కిష్టమ్మ కుడి చెంపపై కంతి ఏర్పడి దుర్వాసన వస్తుంది. దాని కారణంగా ఆమె వద్దకు ఎవరు రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈరోజు మధ్యాహ్నం టేక్మాల్ పంతులు చెరువులో దూకి కిష్టమ్మ ఆత్మహత్య చేసుకుందని చెప్పారు.

News March 20, 2024

వలస కూలీల ట్రాక్టర్ బోల్తా.. 20 మందికి గాయాలు

image

చర్ల మండలంలోని దోసిల్లపల్లి గ్రామ మూలమలుపు వద్ద బుధవారం అదుపుతప్పి వలస కూలీల ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి స్వల్ప గాయాలు, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చర్ల ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఛత్తీస్‌గఢ్
రాష్ట్రం చింతల్ నార్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.

News March 20, 2024

పరద: అనుమానాస్పదంగా యువకుడి మృతి.. కేసు నమోదు

image

అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందిన ఘటన పదర మండలం వంకేశ్వరం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎల్కచేను స్వామి(26) మంగళవారం రాత్రి తమ సొంత పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. బుధవారం ఉదయం గమనించిన గ్రామస్థులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అమ్రాబాద్ ఆసుపత్రిలో పంచనామా నిర్వహించారు.

News March 20, 2024

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి: కలెక్టర్

image

జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా సంబంధిత అధికారులు చూడాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మైనింగ్ అనుమతులకు రెవెన్యూ అధికారుల ఎల్ఓసి తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

News March 20, 2024

ఖైరతాబాద్ RTO ఆఫీస్‌లో HERO అల్లు అర్జున్

image

HYD ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. అంతర్జాతీయ లైసెన్స్ కోసం ఖైరతాబాద్ రవాణా కార్యాలయానికి అల్లు అర్జున్ వచ్చారు. లైసెన్స్ కోసం కావాల్సిన పత్రాలపై స్వయంగా సంతకాలు చేసి ఫొటోలు దిగారు. దీంతో అధికారులు, స్థానిక సిబ్బంది అల్లు అర్జున్‌తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. అల్లు అర్జున్ రాకతో కార్యాలయం వద్ద సందడి నెలకొంది.

News March 20, 2024

ఖైరతాబాద్ RTO ఆఫీస్‌లో HERO అల్లు అర్జున్

image

HYD ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. అంతర్జాతీయ లైసెన్స్ కోసం ఖైరతాబాద్ రవాణా కార్యాలయానికి అల్లు అర్జున్ వచ్చారు. లైసెన్స్ కోసం కావాల్సిన పత్రాలపై స్వయంగా సంతకాలు చేసి ఫొటోలు దిగారు. దీంతో అధికారులు, స్థానిక సిబ్బంది అల్లు అర్జున్‌తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. అల్లు అర్జున్ రాకతో కార్యాలయం వద్ద సందడి నెలకొంది.

News March 20, 2024

సంగారెడ్డి: ‘మార్చి 28 లోగా ఆ నిధులు ఖర్చు చేయాలి’

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, కేజీబీవీ పాఠశాలలకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులన్నీ మార్చి 28వ తేదీ లోపల డ్రా చేసి ఖర్చు చేయాలని లేనిచో నిధులన్నీ వెనక్కి వెళ్తాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలిపారు. అదేవిధంగా దీనికి సంబందించిన యూసీలను సిద్దం చేసుకోవాలని సూచించారు.

News March 20, 2024

BJP ఎంపీ అభ్యర్థి డీకే అరుణ రాజకీయ ప్రస్థానం

image

>1996లో టీడీపీ తరఫున MBNR ఎంపీగా పోటీ చేసి ఓటమి
>2004లో సమాజ్ వాది పార్టీ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా గెలుపు
>2009, 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా గెలుపు
>2018లో గద్వాల ఎమ్మెల్యేగా ఓటమి
>2019లో బీజేపీలో చేరి MBNR ఎంపీగా పోటీ చేసి ఓటమి
కీలక పదవులు:
>కాంగ్రెస్ ప్రభుత్వంలో పౌర సంబంధాలు, సమాచార శాఖ, చిన్న తరహా, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు
>ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా..

News March 20, 2024

కామారెడ్డి: మహిళ టీచర్‌కు షోకాజ్ నోటీస్ 

image

ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన బిచ్కుంద మండల ప్రజా పరిషత్ పాఠశాల సెకండరి గ్రేడ్ ఉపాధ్యాయురాలు కృష్ణవేణికి ఫైనల్ షోకాజ్ నోటిస్ జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 2, 2022 నుంచి ముందస్తు అనుమతులు లేకుండా విధులకు రావడం లేదని, 10 రోజుల్లోగా సమాధానం రాకపోతే సర్వీస్ నుంచి తొలగిస్తామని ఆయన పేర్కొన్నారు.