India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్రమంత్రి బండి సంజయ్‌కి బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కోసం 2024-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చే బడ్జెట్ సెషన్‌లో తగినంత బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, నెరవేర్చడంలో కేంద్రం నిబద్ధతగా వ్యవహరించాలన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బండి పాత్ర కీలకమని అందులో పేర్కొన్నారు.
ముస్లింలకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మొహర్రం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మొహర్రం పండుగ త్యాగానికి, స్ఫూర్తికి ప్రతీక అని, విశ్వాసం, నమ్మకం కోసం మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ చేసిన బలిదానాన్ని గుర్తుచేసుకోవటమే మొహర్రం పండుగ ప్రత్యేకత అన్నారు. మానవజాతి త్యాగం ఎంతో గొప్పదని, మంచితనం, త్యాగాన్ని గుర్తు చేసుకోవటమే ఈ పండుగ అని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. అయితే వీటిలో అత్యధికంగా జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు. మూడేళ్ల వ్యవధిలో ప్రధానంగా 565 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆయా ప్రమాదాల్లో 597 మంది మృత్యువాత పడగా.. మరో 1,137 మంది తీవ్ర క్షతగాత్రులు అయ్యారంటే.. ప్రమాదాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
క్షణికావేశం ఓ వ్యక్తి ప్రాణం తీసిన ఘటన కడెంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి తెలిపిన వివరాలు.. చిట్యాల్ గ్రామానికి చెందిన పందిరి గంగారాం(27) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్య, తల్లి అతడిని మందలించారు. ఈ క్రమంలో ఈరోజు వారి మధ్య వాగ్వాదం జరగగా క్షణికావేశంలో గంగారాం పురుగు మందు తాగాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులుఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదైంది.
రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొని జిల్లా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. రూరల్ వైద్యులను ప్రోత్సాహించేలా ఎక్కువ పారితోషికం ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బెడ్‌కు సీరియల్ నంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలి ఆదేశించారు.
సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రిని గొడ్డలితో కొడుకు నరికి చంపేసిన ఘటన కంగ్టి మండలం చౌకన్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మొడ్డే మారుతి (65)ను, ఆయన కొడుకు నరసప్ప (20) గొడ్డలితో నరికి హతమార్చాడు. అయితే తండ్రి కొడుకుల మధ్య డబ్బుల వ్యవహారమే ఈ ఘటనకు కారణమైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని DMHO భాస్కర్ నాయక్ అన్నారు. అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. సరైన కారణం లేకుండా అబార్షన్ చేస్తే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వరంగల్ జిల్లాలోని పదహారు చింతల్ తండాలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన గిరిజన కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. పార్టీ తరఫున రూ.5 లక్షల సాయంతో పాటు పిల్లలిద్దరీ చదువు బాధ్యత తనదేనని చెప్పారు. మానవతా దృక్పథంతో బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు అందించాలని విజ్ఞప్తి చేశారు. దాడికి పాల్పడిన నిందితుడు నాగరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆరోపించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. ఆ రెండు పార్టీలు కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ కొన్ని రోజులుగా ఢిల్లీలో మకాం వేసి ఎవరితో సంప్రదింపులు చేస్తున్నారో తమకు తెలుసన్నారు.
రైతు రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు మమ అనిపించే విధంగా ఉన్నాయని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించారని మండిపడ్డారు. రైతులందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.