India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాకతీయ యూనివర్సిటీ విధానంపై విద్యార్థులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇటీవల జరిగిన 6వ సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యారు. కానీ విడుదలైన ఫలితాల్లో వారు పరీక్షకు హాజరు కాలేదని చూపడంతో ఆశ్చర్యపోతున్నారు. PG విద్య కోసం ఇప్పటికే ఎంట్రెన్స్ పరీక్ష కూడా రాశారు. కానీ పరీక్షలకు హాజరు కాకపోవడంతో ఉన్నత విద్య చదివే అవకాశం కోల్పోవల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చండూరు మండలం ఇడికూడ పంచాయతీ సెక్రటరీ సైదులు సస్పెండ్ అయ్యారు. గతంలో ఆయన చండూరు మేజర్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉన్న సమయంలో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో కలెక్టర్ సైదులును సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
చర్ల మండల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లా ఎస్పీ కిరణ్ చౌహన్ ఎదుట రూ.20 లక్షల రివార్డ్ కలిగిన నలుగురు మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరంతా గతంలో పలు విధ్వంసకర ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ అసెంబ్లీ హాల్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు మాజీ మంత్రి హరీశ్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం భేటీ అయ్యారు. ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న ప్రోటోకాల్ ఉల్లంఘనలను స్పీకర్‌కు వివరించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కేటీఆర్, చింతా ప్రభాకర్, సునీతారెడ్డి, మాణిక్యరావు ఉన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి.
ఏసీ తేజ మిర్చి సోమవారం క్వింటాకు రూ.17,700 పలకగా.. నేడు రూ.17,100 పలికింది.
అలాగే 341 రకం మిర్చికి సోమవారం రూ.14,000 ధర రాగా నేడు రూ.16,500 ధర వచ్చింది.
వండర్ హాట్(WH) మిర్చి నిన్న రూ.14,500 ధర రాగా.. నేడు రూ.15,500కి పెరిగింది.
అల్వాల్ <<13638517>>రేప్ కేసును<<>> పోలీసులు ఛేదించారు. మేడ్చల్ DCP కోటిరెడ్డి మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలహాల నేపథ్యంలో శుక్రవారం అల్వాల్ PSలో ఫిర్యాదు చేసి వెళ్తుండగా కారులో తిప్పుతూ ముగ్గురు అత్యచారానికి పాల్పడ్డారు. మహిళ ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
రైతు రుణమాఫీకి ప్రభుత్వం ఎట్టకేలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను బ్యాంకర్లకు అప్పగించింది. రూ.2లక్షల వరకు రుణం మాఫీ కానుండగా, ఆగస్టు 15వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తిచేయనుంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 5.36 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బ తికున్నా, చనిపోయానని పెన్షన్ ఇవ్వడం లేదంటూ ప్రజావాణిలో ఓ వృద్ధురాలి ఆవేదన చెందారు. HYD ఖైరతాబాద్ బీజేఆర్‌నగర్‌కు చెందిన కే.రుక్నమ్మ(59)కు భర్త చనిపోయాడు. ఒంటరి మహిళ పెన్షన్ ఇవ్వమని దరఖాస్తు చేసుకుంటే.. తాను చనిపోయినట్టు రికార్డుల్లో ఉందని, బతికున్నట్టు నిరూపించుకోవాలని అధికారులు అన్నారని వాపోయారు. తనకు తిరిగి పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను కోరారు.
బతికున్నా, చనిపోయానని పెన్షన్ ఇవ్వడం లేదంటూ ప్రజావాణిలో ఓ వృద్ధురాలి ఆవేదన చెందారు. HYD ఖైరతాబాద్ బీజేఆర్‌నగర్‌కు చెందిన కే.రుక్నమ్మ(59)కు భర్త చనిపోయాడు. ఒంటరి మహిళ పెన్షన్ ఇవ్వమని దరఖాస్తు చేసుకుంటే.. తాను చనిపోయినట్టు రికార్డుల్లో ఉందని, బతికున్నట్టు నిరూపించుకోవాలని అధికారులు అన్నారని వాపోయారు. తనకు తిరిగి పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను కోరారు.
HYD, RR, MDCL, VKB జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో డెంగ్యూ, డిఫ్తీరియా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బాధితుల్లో ఎక్కువ శాతం చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నిలోఫర్‌లో 2 రోజుల్లో ఏడుగురు, గాంధీలో నలుగురు చిన్నారులు డెంగ్యూతో చేరారు. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్‌తో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ రోగుల రద్దీ ఎక్కువైంది. కాచి చల్లారిన నీటిని తాగాలని, వేడి ఆహారం తినాలని వైద్యులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.