India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ADB జిల్లాలో కోడి మాంసం ధర కొండెక్కింది. వారం క్రితం కిలో రూ. 200 ఉండగా అమాంతం రూ.300 చేరుకోవటంతో మాంసాహారుల నోరు చప్పబడింది. ఉమ్మడి జిల్లాలో నిత్యం 65 టన్నుల వరకు కోడి మాంసం విక్రయాలు జరుగుతాయి. ఆదివారం 100 టన్నుల వరకు విక్రయాలు జరుగుతాయి. వేసవి తాపం ప్రారంభం..కూరగాయలతో పాటు మాంసంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 10 రోజులుగా ఎండలు ఎక్కువగా ఉండటంతో వేడి ఉష్ణోగ్రతకు కోళ్లు మృత్యువాతపడుతున్నాయి.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన మధుప్రియ(10) తన తమ్ముడు మణివర్ధన్(6)ను కాపాడినట్లు గ్రామస్థులు తెలిపారు. స్థానికుల వివరాలు.. ఇంట్లో వాటర్ హీటర్ ఆన్‌లో ఉండగా అది తెలియని మణివర్ధన్ దానిని పట్టుకోగా షాక్ తగిలింది. అలాగే హీటర్ వదలక ఏడుస్తుండగా స్నానం చేస్తున్న అక్క మధుప్రియ విని వెంటనే వెళ్లి సమయస్ఫూర్తితో హీటర్ ప్లగ్ తీసి కాపాడింది.
ఈనెల 13న రెండో శనివారం పాఠశాలలకు సెలవు లేదని NGKL, WNPT జిల్లాల డీఈవో డా.గోవిందరాజులు తెలిపారు. ప్రతి నెలలో రెండో శనివారం సెలవు ఉంటుండగా ఈ నెలలో రెండో శనివారం పాఠశాలలకు పని దినమని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు పనిచేసేలా సంబంధిత ఎంఈవోలు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ భర్త చంద్రశేఖర్‌ను పోలీసులు బైండోవర్ చేశారు. దండు చంద్రశేఖర్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని NZB శివారు ప్రాంతాల్లో అక్రమంగా మట్టి తవ్వకాల్లో భాగస్వాములుగా ఉన్నారని పోలీసులు బుధవారం నిజామాబాద్ దక్షిణ మండల నాయబ్ తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. NZB నగరంలోని నాలుగో టౌన్ పరిధిలో నివాసం ఉంటున్న దండు చంద్రశేఖర్‌ను పోలీసులు రెవెన్యూ అధికారుల ఎదుట బైండోవర్ చేశారు.
భార్యకు ఉరివేసి హత్య చేసిన సంఘటన తిరుమలయపాలెం మండలంలో బుధవారం జరిగింది. సుబ్లేడ్‌కు చెందిన పోలెపొంగు ఇస్తారి, ఆయన భార్య సరోజన (63) కుమారుడు సుమంత్‌తో కలిసి జీవిస్తున్నారు. సుమంత్ మంగళవారం ఉగాది పండుగకు భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్లారు. అయితే మద్యం మత్తులో ఉన్న ఇస్తారి భార్యతో గొడవ పడి మెడకు ఉరివేశాడు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
లోక్ సభ ఎన్నికల నియమావళితో అధికార యంత్రాంగం జిల్లాలో ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఇప్పటివరకు జిల్లా సరిహద్దు చెక్ పోస్టులతో పాటు ఎస్ఎస్‌టీ కేంద్రాల ద్వారా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో రూ.2,48,58,597 నగదుతో పాటు 13.406 గ్రాముల బంగారం ఆభరణాలు, 3,453 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. వాస్తవ దృవపత్రాలు చూపిన వారికి 24 గంటల్లో తిరిగి నగదు, బంగారు వస్తువులను అందజేస్తున్నారు.
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధి టోల్ ప్లాజా వద్ద ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన సురేష్ గంగారం(51) మృతి చెందాడు. టోల్ ప్లాజా వద్ద పార్కు చేసిన కంటైనర్ లారీ అకస్మాత్తుగా ముందుకు వెళ్లి రోడ్డుకు అడ్డంగా డివైడర్ పైకెక్కింది. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కామారెడ్డికి చెందిన డ్రైవర్ అనిల్ తీవ్రంగా గాయపడ్డారు.
రంజాన్ సందర్భంగా నేడు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. ఉదయం 8 గంటల నుంచి 11:30AM వరకు అమల్లో ఉంటాయన్నారు. మీరాలం ట్యాంకు ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్‌ట్యాంకు పరిసర ప్రాంతాల్లో దారి మళ్లిస్తామన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. SHARE IT
రంజాన్ సందర్భంగా నేడు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. ఉదయం 8 గంటల నుంచి 11:30AM వరకు అమల్లో ఉంటాయన్నారు. మీరాలం ట్యాంకు ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్‌ట్యాంకు పరిసర ప్రాంతాల్లో దారి మళ్లిస్తామన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
SHARE IT
ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండగను పురస్కరించుకొని నేడు సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు ఉంటుందని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మ్యూజియం మూసి ఉంటుందని పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.
Sorry, no posts matched your criteria.