Telangana

News April 11, 2024

HYD: నేడు సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు

image

ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండగను పురస్కరించుకొని నేడు సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు ఉంటుందని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మ్యూజియం మూసి ఉంటుందని పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.

News April 11, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> జిల్లావ్యాప్తంగా రంజాన్ వేడుకలు
> సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టా రాగమయి పర్యటన
> కారేపల్లిలో కోట మైసమ్మ తల్లి జాతర
> ఖమ్మంలో ఎంపీలు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర పర్యటన
> మధిరలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం
> ఎర్రుపాలెం మండలం అయ్యవారిపల్లి లో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు
> భద్రాచలం రామాలయంలో బ్రహ్మోత్సవాలు
> ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
> జ్యోతిరావు పూలే జయంతి

News April 11, 2024

MBNR, NGKL: 5ఏళ్లు.. 3,27,451 మంది ఓటర్లు

image

ఉమ్మడి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఈ ఐదేళ్లలో(10.67 శాతం) 3,27,451 మంది ఓటర్లు పెరిగారు. 2024 ఎన్నికల నాటికి MBNR లోక్‌సభ పరిధిలో 16,80,417, నాగర్‌కర్నూల్‌ పరిధిలో 17,37,773కు ఓటర్ల సంఖ్యం పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 68వేల ఓట్లు నమోదుయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో 18-39 ఏళ్ల మధ్య ఓటర్లు 52 శాతం ఉన్నారు. ఈ ఐదేళ్లలో 701 కేంద్రాలు పెరిగాయి.

News April 11, 2024

రేపు బాస్కెట్ బాల్ జిల్లా జట్టు ఎంపిక పోటీలు

image

కరీంనగర్ జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో ఈనెల 12న జిల్లా బాలబాలికల జట్టు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి ఆనంతరెడ్డి తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారుల వయసు ధ్రువీకరణపత్రం, ఆధార్, రెండు పాస్పోర్ట్ ఫొటోలతో హాజరు కావాలని సూచించారు. ప్రతిభ చాటిన వారిని ఈనెల 21నుంచి 23వరకు జరిగే 8వ జూనియర్స్ అంతర్ జిల్లా టోర్నమెంట్‌కి తీసుకెళ్తామని పేర్కొన్నారు.

News April 11, 2024

నిజామాబాదీలు నేడే రంజాన్

image

రంజాన్ మాసంలో 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులు నేడు రంజాన్ వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. నెలవంక దర్శనం ఇవ్వడంతో ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగనున్నాయి. ఈ మేరకు మసీదులు, ఈద్గా మైదానాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇవాళ ఉదయాన్నే ముస్లింలు ఈద్గాలకు చేరుకోనున్నారు. నమాజ్, ప్రత్యేక ప్రార్థనలతో మసీదులు, ఈద్గాలు ముస్లింలతో కిటకిటలాడనున్నాయి.

News April 11, 2024

ఉమ్మడి పాలమూరులో రంజాన్ సందడి..!

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని పలు పట్టణాల్లో వ్యాపార కేంద్రాలు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. ముస్లింలు పగలంతా ధ్యానంలో గడుపుతారని భావించిన వ్యాపారులు.. అర్ధ రాత్రి వరకు షాపులను తెరిచి ఉంచుతున్నారు. వస్త్రాలు,మెహందీ, మిస్వాక్, ఇత్తర్ (సుగంధ ద్రవ్యాలు), సుర్మా, గృహ పరికరాలతో పాటు సేమియాలు, డ్రై ఫ్రూట్స్ తదితర వస్తువులను కొనుగోలు చేశారు. దీంతో దుకాణాల్లో సందడి నెలకొంది.

News April 11, 2024

ADB: ఒకేసారి 2 సీట్లు సాధించిన విహాన్

image

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని మహాగావ్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయ దంపతులు రాథోడ్ కృష్ణారావు శోభారాణి కుమారుడు విహాన్ ఒకే సారి రెండు సీట్లు సాధించాడు. ఇటీవల దేశ వ్యాప్తంగా నిర్వహించిన నవోదయ విద్యాలయ, సైనిక్ స్కూలులో 241మార్కులతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవ పాఠశాలలో సీటు దక్కించుకున్నాడు. దీంతో బుధవారం ప్రధానోపాధ్యాయుడు రాజ్‌కుమార్, కార్తీక్ ఆయనను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

News April 11, 2024

కరీంనగర్: ఉద్యోగులూ.. జర జాగ్రత్త!

image

ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు ఎన్నికల సందర్భంగా జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం నిబంధనలు తెలియజేస్తున్నాయి. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఇటీవల సిద్దిపేట జిల్లాలో 106 మంది ఈజీఎస్, ఐకెపీ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. కావున జిల్లాలోని ఉద్యోగులు పార్టీలపై పక్షపాతం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.

News April 11, 2024

మెదక్: ఆర్భాటంగా ప్రారంభం.. కొనుగోలు అంతంతే..!

image

అధికారులు ఆర్భాటంగా దాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా కొనుగోళ్లను మాత్రం ప్రారంభించలేదు. ప్రస్తుతం వాతావరణ మార్పుల నేపథ్యంలో కల్లాల్లో ధాన్యం పోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లాలో 2,60,933 ఎకరాల్లో వరి సాగవగా.. 3.66 లక్షల మెట్రిక్ టన్నుల పంట సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 200కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా పూర్తిస్థాయిలో కోనుగోళ్లు చేయట్లేదని రైతులు అంటున్నారు.

News April 11, 2024

నల్గొండ ఎస్పీ చందనా దీప్తి హెచ్చరిక

image

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాల్లో ఇతర నాయకులను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎన్నికల నియమావళి కింద పరిగణించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని పాటించాలని కోరారు. కుల, మత, వర్గ భాషాపరమైన అంశాల ఆధారంగా రెచ్చగొట్టడం, ప్రేరేపించడం లాంటివి చేస్తే సహించబోమని హెచ్చరించారు.