Telangana

News April 10, 2024

సూర్యాపేట: ఒకే కొమ్మకు 55 మామిడి కాయలు

image

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 55 మామిడి కాయలు ఒకే చోట కాశాయి. అది కూడా విరిగిపోయి ఎండినదనుకున్న కొమ్మకు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చెందిన మోదాల గంగయ్య పొలంలో విరిగిపోయి ఎండిపోయిందనుకున్న మామిడి చెట్టు కొమ్మ చిగురించింది. ఆ చిగురే మామిడి కాయల రూపంలో ప్రతిఫలిచింది. ఏకంగా 55 ఒకే చోట కాసి చూపరులను ఆకట్టుకుంటోంది.

News April 10, 2024

HYD: అర్ధరాత్రి ఇంటికెళ్లి బాలికపై అత్యాచారయత్నం

image

యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన సికింద్రాబాద్ కార్ఖానా పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బోయిన్‌పల్లి మడ్‌ఫోర్ట్ వద్ద నివాసం ఉండే బాలిక(17)పై అర్ధరాత్రి ఆ ప్రాంతంలోనే నివాసించే భాను(25) అనే యువకుడు అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆమె కేకలు వేయగా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు మంగళవారం కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

✓ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓అశ్వారావుపేట మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
✓కల్లూరు మండలంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి పర్యటన
✓వైరా మండలంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

News April 10, 2024

భద్రాచలం: రాముడి ఆదాయం 14, వ్యయం 2

image

దేవస్థానంలో మంగళవారం క్రోధినామ తెలుగు సంవత్సరాది వేడుకలను వైభవోపేతంగా జరిపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వేపపూత పచ్చడి నివేదన చేసి భక్తులకు పంచారు. ఈ ఏడాది రాముడి ఆదాయం 14, వ్యయం 2, రాజ పూజ్యం 6, అవమానం6గా ఉందని తెలిపారు. సీతమ్మవారి ఆదాయం 5, వ్యయం 5 అని, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉంటుందని పేర్కొన్నారు. జ్యేష్టమాసం శుక్లపక్షంలో తొలకరులు ఉంటాయని, సస్యవృద్ధి ఉంటుందని వెల్లడించారు.

News April 10, 2024

ఖమ్మం: BRS, కాంగ్రెస్ నేతల ఘర్షణ.. ఉద్రిక్తత

image

కామేపల్లి మండలంలోని పండితాపురంలో BRS, కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. బాధితుల వివరాలిలా.. ఉగాది పండుగ సందర్భంగా గ్రామంలో మంగళవారం ఎడ్లబండ్లతో ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకుడు హరిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఎస్సై ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు.

News April 10, 2024

నల్గొండ: నాలుగేళ్ల చిన్నారి నాలెడ్జ్ అదుర్స్

image

చిట్యాలకు చెందిన నాలుగున్నరేళ్ల గంజి తక్ష్వి తన ప్రతిభలో మంత్రముగ్దుల్ని చేస్తోంది. ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారి ఏమాత్రం తడుముకోకుండా రాష్ట్ర రాజధానుల పేర్లు చెబుతోంది. రెండు రోజుల్లోనే నేర్చుకుందన్నారు. రానున్న కాలంలో ముఖ్యమంత్రులు, జాతీయ పక్షులు, జంతువుల పేర్లు నేర్పించాలని సంకల్పంగా పెట్టుకున్నామన్నాని పాప తల్లిదండ్రులు చెబుతున్నారు.

News April 10, 2024

KNR: గుంటకు రూ.10లక్షలు.. ఖాళీ అవుతున్న గుట్ట

image

KNR-JGTL జాతీయ రహదారిలోని మధురానగర్ శివారులో వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న వంటశాల గుట్ట అక్రమార్కులకు వరంగా మారింది. కొందరు వాణిజ్య అవసరాలకు తవ్వుకోవడంతో పాటు.. గుట్టను తొలచి అడుగు స్థలాన్ని చదను చేస్తున్నారు. ఇక్కడి స్థలం గుంట రూ.10 లక్షల వరకు పలుకుతుండటంతో ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీరివెనక రాజకీయ నేతల అండ ఉండటంతో పాటు అధికారులు పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు.

News April 10, 2024

HYD: ‘గోవాలో పుట్టినరోజు జరుపుకొని వస్తూ డ్రగ్స్ తెచ్చారు’

image

HYD సనత్‌నగర్ బస్టాండ్‌లో నాగరాజ్‌ అనే యువకుడితో పాటు అతడి నలుగురు స్నేహితులను అరెస్ట్ చేశామని SOT రాజేంద్రనగర్ టీం తెలిపింది. వారి నుంచి 4 గ్రాముల MDMA డ్రగ్, 5గ్రాముల గంజాయి, OCB రేపర్స్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. విచారణలో ఏప్రిల్ 4న నాగరాజ్‌ స్నేహితుడు దిలీప్ పుట్టినరోజు సందర్భంగా నలుగురు స్నేహితులతో గోవాకు వెళ్లి MDMA డ్రగ్‌తోపాటు GOA నుంచి బస్సులో HYDకు తిరిగి వచ్చారని తేలిందన్నారు.