India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలో BRS లీడర్‌కు ప్రమాదం తప్పింది. మంగళవారం తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ ఖైరతాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తన మిత్రుడిని పరామర్శించి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మార్గమధ్యలో (కొత్తపేట క్రాస్ రోడ్డు సమీపంలో) టైరు పగిలిపోవడంతో కారు అదుపు తప్పి మెట్రో డివైడర్‌ను ఢీ కొట్టింది. ఎయిర్‌బెలూన్స్ ఓపెన్ కావడంతో పల్లె రవి, డ్రైవర్ ఖదీర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలకు బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈనెల 17న నిర్వహించనున్న శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి ఆలయ కమిటీ సభ్యులు రఘునందన్ రావును ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మెదక్ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ క్రోధి నామ ఉగాది సందర్బంగా మంగళవారం సాయంత్రం పంచాంగ పఠనం చేశారు. అయ్యప్ప దేవాలయ ప్రధాన అర్చకులు వైద్య రాజు పంతులు పంచాంగ పఠనం గావించారు. ఈ సందర్బంగా ద్వాదశ రాశులకు సంబంధించి గోదారా ఫలాలు, తెలుగు సంవత్సరంలో రాజు, మంత్రి, పశు పాలకుడు తదితర వివరాలు వినిపించారు. అలాగే ఆదాయం, ఖర్చు, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉండబోతుంది అని తెలిపారు.
చికెన్‌పాక్స్, తట్టు కేసులు ఉమ్మడి KNR జిల్లాలో పెరుగుతున్నాయి. వేసవి కారణంగానే కేసులు పెరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇటీవల KNR పట్టణం గణేశ్‌నగర్‌కు చెందిన విద్యార్థికి జ్వరం వచ్చి.. సాయంత్రంలోపే శరీరంపై బుగ్గలు కనిపించాయి. అతడికి తగ్గగానే తన తమ్ముడికి వచ్చింది. ఉమ్మడి జిల్లా మొత్తం ఇదే పరిస్థితి. అయితే వ్యాక్సిన్లు వేసుకోనివారిలో ఈ తీవ్రత ఎక్కువ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రేమ వివాహం చేసుకున్నాడని అమ్మాయి తరఫువాళ్లు అబ్బాయిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ ఘటన MHBD జిల్లాలో జరిగింది. డోర్నకల్ మండలంలోని ఓ తండాకు చెందిన గణేశ్, ఓ యువతి ప్రేమించుకొని ఇటీవల HYDలో పెళ్లి చేసుకున్నారు. దీంతో యువతి తండ్రి డోర్నకల్ ఠానాలో కేసు పెట్టగా.. ఆమెను వారి తల్లిదండ్రులతో పంపించారు. అదేరోజు గణేశ్ ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా అమ్మాయి తరఫువాళ్లు గణేశ్, అతడి తల్లిపై దాడి చేశారు.
ఉగాది పండగ సందర్భంగా నేడు శిల్పారామంలో ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పండితులు పార్టీ నేతల జాతకాన్ని వివరించారు. అనంతరం నాయకులను సన్మానించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలో మరో నేత బీజేపీలో చేరారు. నేడు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే పండరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ డా.లక్ష్మణ్ సమక్షంలో ఆయన చేరగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బిబి పాటిల్, నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే మాజీ మంత్రి, ఎల్లారెడ్డి మాజీ MLA నేరేళ్ల ఆంజనేయలు బీజేపీలో చేరారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అద్భుతమైన ఫలితాలు ఇస్తూ వచ్చిన కార్యక్రమం ఒకటి హరితహారం. తాజాగా పదోవిడత హరితహారం అమలుకు నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. ఖమ్మం జిల్లాలో 70.57 లక్షలు, భద్రాద్రి జిల్లాలో 65.73 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందుకోసం ప్రతి గ్రామపంచాయతీ నర్సరీలో 10వేలు మొక్కలు పెంచాలని సూచించింది. జూన్, జూలై నెలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాల్సి ఉంది.
లోక్‌సభ ఎన్నిక నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ పక్కాగా అమలు చేయాలని ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్ కుమార్ ఆదేశించారు. బెజ్జూరు పోలీస్ స్టేషన్‌ను నేడు ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన ప్రజా ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సిబ్బందికి సూచించారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల నియమావళి పార్టీలు, వ్యక్తులకు అతీతంగా పారదర్శకంగా అమలు చేయాలన్నారు. చెక్ పోస్ట్ విధుల్లో ఉంటే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, స్థానాచార్యులు కాపీందర్, ప్రధాన అర్చకులు జితేంద్రప్రసాద్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.