Telangana

News September 5, 2024

ఉపాధ్యాయులు కీలక భూమిక వహిస్తారు: ఎంపీ కావ్య

image

విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక భూమిక వహిస్తారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లకు ఎంపీ కావ్య శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారని, వాటి ద్వారా విద్యార్ధులకు మెరుగైన ప్రమాణాలతో విద్య అందేలా ఉపాధ్యాయులందరూ పునరంకితం కావాలన్నారు.

News September 5, 2024

సిద్దిపేట: అనుమానిస్తున్నాడని భర్తను చంపేసింది

image

మద్దూరు మం. రేబర్తికి పరమేశ్వర్‌(40), భారతి దంపతులకు కొడుకు, కుమార్తె ఉన్నారు. HYDకి వల వచ్చి పరమేశ్వర్‌ డ్రైవర్‌గా, భారతి ప్రైవేటు జాబ్ చేస్తున్నారు. పరమేశ్వర్‌ నిత్యం భార్యను అనుమానిస్తూ వేధింపులకు చేయడంతో మాదాపూర్‌ PSలో పలుమార్లు ఫిర్యాదు చేసింది. ఈనెల 1న రాత్రి గొడవ జరగ్గా తల్లి, కుమారుడు కలిసి పరమేశ్వర్‌ తలపై కొట్టి చంపారు. ఈ విషయం కుమార్తె బంధువులకు చెప్పడంతో దారుణం బయటకొచ్చింది.

News September 5, 2024

మెట్రోలో ఫీడర్ సర్వీసులు పెంచాలని డిమాండ్

image

నగరంలో ప్రయాణికులు మెట్రోకి మొగ్గు చూపుతున్నారు. దీంతో 5 లక్షల మార్క్ దాటింది. అన్ని స్టేషన్ల వరకు ఫీడర్ సర్వీస్లు లేకపోవడంతో ప్రయాణికులు సొంత వాహనాల్లో స్టేషన్లకు రావాల్సి వస్తోందంటున్నారు. అయితే ఇటీవల పార్కింగ్ ఫీజుల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అన్ని ప్రాంతాల నుంచి ఫీడర్ సర్వీసులు ఉంటే వాహనం తేవాల్సిన అవసరం లేదని ప్రయాణికులు అంటున్నారు. మెట్రో కోచ్లు పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది.

News September 5, 2024

గురువు పాత్ర అత్యున్నతమైనది: సీతక్క

image

విద్యార్థికి దశ, దిశను చూపించే గురువు పాత్ర సమాజంలో అత్యున్నతమైనదని మంత్రి సీతక్క అన్నారు. నేడు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. చదువు మాత్రమే అన్ని రకాల అణచివేతలు, నిర్బంధాల నుంచి స్వేచ్ఛను ప్రసాదిస్తుందని అన్నారు. విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని కొనియాడారు.

News September 5, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలోనే గురువుల గ్రామం ‘వెన్నచేడ్’

image

మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంలోని వెన్నచేడ్ గ్రామం ఉమ్మడి జిల్లాలోనే ప్రభుత్వ టీచర్లకు కేంద్రం. ఇక్కడ దాదాపు 210 మంది ఉపాధ్యాయులు ఉండగా.. వీరిలో 50కి పైగా మహిళలు ఉన్నారు. చాలా మంది ఉపాధ్యాయులు చదివిన పాఠశాలలోనే బోధిస్తున్నారు. 150 పైగా యువత DSCకి ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ 1956లో పాఠశాల ప్రారంభం కాగా గ్రామంలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. టీచర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం..

News September 5, 2024

మెట్రోలో ఫీడర్ సర్వీసులు పెంచాలని డిమాండ్

image

నగరంలో ప్రయాణికులు మెట్రోకి మొగ్గు చూపుతున్నారు. దీంతో 5 లక్షల మార్క్ దాటింది. అన్ని స్టేషన్ల వరకు ఫీడర్ సర్వీస్లు లేకపోవడంతో ప్రయాణికులు సొంత వాహనాల్లో స్టేషన్లకు రావాల్సి వస్తోందంటున్నారు. అయితే ఇటీవల పార్కింగ్ ఫీజుల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అన్ని ప్రాంతాల నుంచి ఫీడర్ సర్వీసులు ఉంటే వాహనం తేవాల్సిన అవసరం లేదని ప్రయాణికులు అంటున్నారు. మెట్రో కోచ్లు పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది.

News September 5, 2024

HYD: పల్లె రహదారులకు రూ.24 కోట్లు: సీతక్క

image

రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల పునరుద్ధరణ కోసం తక్షణసాయంగా రూ.24 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో చెరువులు, వాగులు ఇతర జలాశయాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను గుర్తించి, వాటి పూర్తి వివరాలతో వెంటనే నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిసరఫరాల శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

News September 5, 2024

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 70.71 టీఎంసీల నీరు నిలువ

image

ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ ప్రాజెక్టులో భారీగా గంట గంటకు ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 1088.30 అడుగులు, 80.5 టిఎంసిలు ఉండగా ప్రాజెక్టులో 2,64,722 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అవుట్ ఫ్లో 2,78,380 క్యూసెక్కులు. ప్రస్తుతం ప్రాజెక్టులో 70.71 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వివిధ అవసరాల కోసం ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

News September 5, 2024

HYD: కాంగ్రెస్ అసమర్థతతో 2 ప్రాజెక్టు పోయాయి: KTR

image

తెలంగాణ నుంచి కేన్స్ టెక్నాలజీ సంస్థకు చెందిన అత్యంత అధునాతనమైన ‘ఓశాట్ ‘ యూనిట్ గుజరాత్‌కు తరలిపోతోందన్నది వాస్తవమని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. దీనిపై ఐటీ మంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై ‘X’లో బుధవారం కేటీఆర్ స్పందించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ, గందరగోళ నిర్ణయాల కారణంగా.. 2 పెద్ద ప్రాజెక్టులను రాష్ట్రం కోల్పోవడం బాధాకరమని అన్నారు.

News September 5, 2024

మారేడ్ పల్లి: ఎస్సీ గురుకులాల్లో స్పాట్ అడ్మిషన్లు

image

రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మిగిలిన సీట్లకు ఈనెల 5, 6 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి తెలిపారు. హైదరాబాద్ లో బుధవారం మాట్లాడారు. జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో 3,168 సీట్లు ఖాళీగా ఉంటే.. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలకు 221 అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.