India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాను కాంగ్రెస్ పార్టీలో చేరతానని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అంబర్‌పేట MLA కాలేరు వెంకటేశ్ అన్నారు. ఇదంతా హస్తం పార్టీ మైండ్ గేమ్ అని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. 2 పర్యాయాలు తనను ఎమ్మెల్యేగా గెలిపించింది కారు గుర్తు అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చలువతోనే తాను ఎమ్మెల్యే అయ్యాయని కాలేరు వెల్లడించారు.
తాను కాంగ్రెస్ పార్టీలో చేరతానని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అంబర్‌పేట MLA కాలేరు వెంకటేశ్ అన్నారు. ఇదంతా హస్తం పార్టీ మైండ్ గేమ్ అని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. 2 పర్యాయాలు తనను ఎమ్మెల్యేగా గెలిపించింది కారు గుర్తు అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చలువతోనే తాను ఎమ్మెల్యే అయ్యాయని కాలేరు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి శివారులో ఈరోజు జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలానికి చెందిన ఎరుకల మహేశ్(21) ఉగాది పండగ నేపథ్యంలో మామిడి ఆకుల కోసం పల్సర్ బైక్‌పై వెళుతున్నాడు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న మరో బైక్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో మహేశ్ కిందపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు వచ్చి పరిశీలించారు.
తుర్కపల్లి మండలం ములకలపల్లి శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. భువనగిరి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రాజమణి ఈ ప్రమాదంలో మృతి చెందారు. డొంకేన రాములు, రాజమణి దంపతులు ద్విచక్ర వాహనంపై తుర్కపల్లికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. రాజమణి మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ఉగాది పర్వదినం సందర్భంగా సెంట్రల్ రైల్వే ముంబైలోని CSMT (చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్) నుంచి కరీంనగర్‌కు వీక్లీ ఎక్స్ ప్రెస్‌ను నేటి నుంచి నడపనున్నారు. CSMT నుంచి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 గం.కు బయలుదేరి బుధవారం ఉదయం 8:30 గం.కు కరీంనగర్ చేరుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 7:05 గంటలకు KNR నుంచి బయలుదేరి గురువారం మధ్యాహ్నం 1:40 గంటలకు ముంబై చేరుకుంటుంది.
మాజీ మంత్రి, ఎల్లారెడ్డి మాజీ MLA నేరేళ్ల ఆంజనేయలు మంగళవారం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, MP లక్ష్మణ్ సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. ఆయనతోపాటు మాజీ ZPTC తానాజీ రావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో రెండు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుమతి లభించింది. గతేడాది నర్సంపేట, ములుగు పట్టణాలకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను పంపింది. ఈ మేరకు ఆ రెండు కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు దక్కినట్లు తెలిసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో వరంగల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొనసాగుతున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్రికెట్ బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. ఐపీఎల్‌లో బెట్టింగులు 100 రూపాయల నుండి ప్రారంభం అవుతున్నాయి. దీంతో చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు సెల్ ఫోన్ ముందు పెట్టుకొని ఆట ఆడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. మొత్తం ఆన్లైన్ వేదికగా జరుగుతూ ఉండడంతో అధికారులు కూడా ఏమి చేయలేకపోతున్నారు. ఎక్కువగా యువత ఈ బెట్టింగుల్లో ఆడుతున్నారు.
జనగామ జిల్లా కొడకండ్లకు మాజీ మంత్రి ఈటల రాజేందర్, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బుధవారం రానున్నట్లు బీజేపీ మండల శాఖ నాయకులు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా రేపు కొడకండ్లలో నిర్వహించనున్న బీజేపీ బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొననున్నారు. వీరితో పాటు వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌లతో పాటు.. పలువురు నాయకులు హాజరు కానున్నట్లు సమాచారం.
యువతిని పెళ్లి చేసుకోనని ఓ యువకుడు గొంతు కోసుకున్న ఘటన HYD బాలాపూర్ పరిధి మీర్‌పేట్‌లో జరిగింది. ఇన్‌స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ తెలిపిన వివరాలు.. RR జిల్లా కడ్తాల్ వాసి అశోక్(21) దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. అతడికి అచ్చంపేటకు చెందిన యువతి(19) ఇన్‌స్టాలో పరిచయమైంది. ఆమెను ప్రేమ పేరిట లోబర్చుకుని మొఖం చాటేయడంతో PSలో ఫిర్యాదు చేసింది. ఆమెను పెళ్లి చేసుకోనని అశోక్ గొంతు కోసుకున్నాడు.
Sorry, no posts matched your criteria.