Telangana

News March 19, 2024

ఉమ్మడి జిల్లాకు వాతావరణ శాఖ చల్లటి కబురు

image

ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి పలుచోట్ల నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఇటీవల ఎండ వేడి మీతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News March 19, 2024

నెక్స్ట్ బీజేపీ లిస్టులో నా పేరు వస్తుంది: జలగం

image

ఖమ్మం: బీజేపీ అధిష్ఠానం విడుదల చేసే ఎంపీ అభ్యర్థుల నెక్స్ట్ లిస్టులో ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా తన పేరు ఉంటుందని జిల్లా బీజేపీ నేత జలగం వెంకట్రావు అన్నారు. మొదటి లిస్టులో తన పేరు ఎందుకు ఆగిందో పార్టీకే తెలియాలన్నారు. పాత బీజేపీ నేతలతో మాట్లాడే తాను పార్టీలో చేరినట్లు చెప్పారు. బీజేపీ సీనియర్ నేతల సహకారం తనకే ఉందన్నారు. ఖమ్మంలో బీజేపీ సత్తా ఏంటో ఎన్నికల్లో తెలుస్తుందని పేర్కొన్నారు.

News March 19, 2024

NZB: ఏప్రిల్ 25 నుంచి ఓపెన్ ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలు

image

ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్పీ దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30ల నుంచి 5.30ల వరకు జరగుతాయన్నారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

News March 19, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంపీ ఎన్నికలపై కసరత్తు

image

లోక్‌సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈవీఎంల చెకింగ్ పూర్తి కాగా.. క్షేత్రస్థాయిలో పోలింగ్ సజావుగా సాగడానికి కావాల్సిన ఏర్పాట్లను NLG, SRPT, YDD జిల్లాల కలెక్టర్లు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పర్యవేక్షిస్తున్నారు. NLG లోక్‌సభ స్థానానికి కలెక్టర్ హరిచందన రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనుండగా, BNGకి హనుమంతు కె జెండగే ఆర్వోగా వ్యవహరిస్తారు.

News March 19, 2024

KNR: చిన్నారికి పేరు పెట్టిన KCR

image

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన ఓ చిన్నారికి మాజీ సీఎం కేసీఆర్ నామకరణం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో.. నియోజవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకురాలు అకినేపల్లి శిరీష-ప్రవీణ్‌ దంపతుల ద్వితీయ కుమార్తెకు శ్రేయా ఫూలే అని పేరు పెట్టారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

News March 19, 2024

ఎదురు కాల్పులు..మంచిర్యాల జిల్లా మావోలు మృతి

image

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు, మవోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూర్ ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ మృతి చెందారు. ఈ కాల్పుల్లో మెుత్తం నలుగురు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఏకే-47, తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

News March 19, 2024

HYD వచ్చిన యువతి.. వ్యభిచారం చేయాలని దాడి..!

image

ఉపాధి కోసం HYDకు వచ్చిన యువతితో వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గద్వాల జిల్లాకు చెందిన యువతి టెలీకాలర్ జాబ్ కోసం ఈనెల 10న నగరంలోని MGBS బస్టాండ్‌కు వచ్చింది. ఒంటరిగా ఉన్న ఆమెను గమనించిన ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి IBPకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వంగపహాడ్‌(WGL)కు తరలించి వ్యభిచారం చేయాలని దాడి చేశారు. ఈ విషయమై బాధితురాలు హసన్‌పర్తి PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

News March 19, 2024

HYD వచ్చిన యువతి.. వ్యభిచారం చేయాలని దాడి..!

image

ఉపాధి కోసం HYDకు వచ్చిన యువతితో వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గద్వాల జిల్లాకు చెందిన యువతి టెలీకాలర్ జాబ్ కోసం ఈనెల 10న నగరంలోని MGBS బస్టాండ్‌కు వచ్చింది. ఒంటరిగా ఉన్న ఆమెను గమనించిన ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి IBPకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వంగపహాడ్‌(WGL)కు తరలించి వ్యభిచారం చేయాలని దాడి చేశారు. ఈ విషయమై బాధితురాలు హసన్‌పర్తి PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

News March 19, 2024

BREAKING.. MBNR: ప్రభుత్వ కళాశాల లెక్చరర్ ఆత్మహత్యాయత్నం

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెల్దండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా చేస్తున్న శంకర్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. శంకర్‌ను కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2024

వరంగల్: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. నిన్న క్వింటా పత్తి ధర రూ.7,280 పలకగా.. ఈరోజు రూ.7,300 పలికింది. జిల్లాలో విచిత్ర వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ సరుకులను మార్కెట్‌కు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.