Telangana

News April 8, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*మాట నిలబెట్టుకున్న KTR
*బండి సంజయ్‌పై మంత్రి పొన్నం ఫైర్ (VIDEO)
*100% సిజేరియన్లు చేసే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్న సిరిసిల్ల కలెక్టర్.
*కొండగట్టు మెట్ల దారి సమీపంలో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
*పెద్దపల్లి సమీపంలో లారీ, కారు ఢీ.. పలువురికి గాయాలు.
*మల్లాపూర్ హెడ్ కానిస్టేబుల్ అశోక్ సస్పెండ్.
*సిరిసిల్ల: పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు స్పాట్ అడ్మిషన్స్
*ఉగాది ఎఫెక్ట్: భారీగా పెరిగిన ధరలు

News April 8, 2024

ఐనవోలు: కొత్త కళ సంతరించుకున్న మల్లన్న ఆలయం

image

హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని మల్లికార్జునస్వామి ఆలయం కొత్త శోభను సంతరించుకుంది. ఇటీవల ఓ దాత రూ.13 లక్షలతో ఇత్తడి తొడుగు, బంగారుపూతతో గర్భాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో ఆలయం కొత్త రూపును సంతరించుకుంటూ, భక్తులను ఆకర్షిస్తున్నది. దాతల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని దేవస్థానం ఈవో అద్దంకి నాగేశ్వర్రావు తెలిపారు.

News April 8, 2024

HYD: కుమారుడిని చంపి తల్లిదండ్రుల ఆత్మహత్య

image

హైదరాబాద్‌లో సోమవారం విషాదఘటన వెలుగుచూసింది. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధి సన్‌సిటీలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కొడుకును చంపి, భార్య భర్తలు విషం తాగారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 8, 2024

NLG: ముగ్గురి మృతికి కారణమైన వ్యక్తికి కఠిన కారాగార శిక్ష

image

మద్యం మత్తులో డీసీఎం వాహనం నడిపి ముగ్గురి మృతికి కారణమైన మహమ్మద్ అప్సర్ పాషాకు పది సంవత్సరాల క కఠిన కారాగార శిక్ష రూ. 2 వేలు జరిమాన విధిస్తూ భువనగిరి జిల్లా మొదటి అదనపు కోర్టు తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు. 2022లో భువనగిరి శివార్లలో టేకులసోమారం గ్రామస్థులు నర్సింహ్మ, రాజ్యలక్ష్మి, జంగమ్మ అనే ముగ్గురు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మృతి కేసులో అప్సర్ పాషాకు జైలు శిక్ష విధించారు.

News April 8, 2024

HYD మెట్రో‌లో‌ మహిళలకు FREE జర్నీ కల్పించాలని డిమాండ్

image

మహిళల‌ సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఉప్పల్‌ మాజీ MLA NVSS ప్రభాకర్‌ అన్నారు. హైదరాబాద్‌ మెట్రో, MMTSలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు. స్కూల్, కాలేజీ విద్యార్థులకు కూడా ఈ వెసులుబాటు ఉండాలన్నారు. కానీ, ఇవేమీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదన్నారు. రాబోయే ఎన్నికలు అభివృద్ధి కోసం జరిగేవని, కాంగ్రెస్‌‌ను నమ్మి మోసపోవొద్దు అంటూ పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్?

News April 8, 2024

HYD మెట్రో‌లో‌ మహిళలకు FREE జర్నీ కల్పించాలని డిమాండ్

image

మహిళల‌ సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఉప్పల్‌ మాజీ MLA NVSS ప్రభాకర్‌ అన్నారు. హైదరాబాద్‌ మెట్రో, MMTSలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు. స్కూల్, కాలేజీ విద్యార్థులకు కూడా ఈ వెసులుబాటు ఉండాలన్నారు. కానీ, ఇవేమీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదన్నారు. రాబోయే ఎన్నికలు అభివృద్ధి కోసం జరిగేవని, కాంగ్రెస్‌‌ను నమ్మి మోసపోవొద్దు అంటూ పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్?

News April 8, 2024

KMM: అనారోగ్యంతో బాలిక మృతి

image

అనారోగ్యంతో బాలిక మృతి చెందిన సంఘటన సోమవారం పినపాక మండలంలో చోటుచేసుకుంది. కరకగూడెం గ్రామానికి చెందిన బాలిక సౌమ్య (8)కు కామెర్లు రావటంతో మణుగూరులోనీ ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందింది. విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బాలిక మృతదేహన్ని సందర్శించి నివాళులర్పించారు.

News April 8, 2024

ASF: ఇంట్లో ఉరేసుకుని యువతి సూసైడ్

image

రెబ్బెన మండలం పాసిగాం గ్రామానికి చెందిన రజిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రెబ్బెన ఏఎస్ఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాసిగాం గ్రామానికి చెందిన శంకర్‌తో 2019లో రజితకు వివాహమైంది. పిల్లలు కలగడం లేదని శంకర్ మద్యం సేవించి తరుచూ రజీతను మానసికంగా వేధించేవాడు. దీంతో మనస్తాపానికి గురైన రజిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

News April 8, 2024

కొండగట్టు మెట్ల దారి సమీపంలో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట పరిధిలోని కొండగట్టు మెట్ల దారి సమీపంలో సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని తక్కళ్లపల్లికి చెందిన మల్లయ్య(45)కు మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఈరోజు కుటుంబ సభ్యులు కొండగట్టుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో చెట్టుకు ఉరేసుకున్నాడు.

News April 8, 2024

నల్గొండ జిల్లా ప్రజలకు SP కీలక సూచన

image

విద్యార్థినులు, మహిళలు ఫేస్ బుక్, వాట్స్‌అప్, ఇన్‌స్టాగ్రామ్‌ల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని జిల్లా SP చందన దీప్తి సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని, మహిళా రక్షణ కోసం పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. పోలీస్ శాఖ మహిళా భద్రతకు పటిష్ఠమైన నిఘా పెట్టిందన్నారు.