Telangana

News March 19, 2024

RR: ‘సిబ్బందికి సెలవులు ఇవ్వకండి’

image

MP ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు వివిధ శాఖల సిబ్బందికి సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని జిల్లా కలెక్టర్‌ శశాంక అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిబ్బందికి సంబంధించిన ఇంటి చిరునామాలు, ఎపిక్‌ కార్డుల వివరాలు తప్పనిసరిగా అందించాలన్నారు. సిబ్బందికి సెలవులు ఇవ్వరాదని సూచించారు. ఈ మీటింగ్‌‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ఉన్నారు.

News March 19, 2024

ADB: అన్న చనిపోయాడని సమాచారం.. తమ్ముడికి గుండెపోటు

image

చావు గురించి తప్పుడు సమాచారం ఓ నిండు ప్రాణాన్ని తీసిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలో జరిగింది. బోథ్‌కు చెందిన నరసింహదాస్‌, బాపు ఇద్దరు అన్నదమ్ములు. అనారోగ్యంతో బాధపడుతున్న బాపు బతికే ఉన్నా, ఆయన చనిపోయాడంటూ బంధువులు ఫోన్‌ చేసి చెప్పడంతో తమ్ముడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అన్న ఇక లేడని రోదించిన దాస్ గంటల వ్యవధిలోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నింపింది.

News March 19, 2024

రాజంపేటలో కరెంటు షాక్ తగిలి యువకుడి మృతి

image

మండలంలోని తలమడ్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు కరెంట్ షాక్‌తో మృతి చెందినట్లు ఎస్ఐ సంపత్ తెలిపారు. గ్రామానికి చెందిన ప్రవీణ్ తన ఇంటి వద్ద నల్ల నీటికి మోటార్ కనెక్షన్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలిందన్నారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News March 19, 2024

MDK: భారీ వర్షం.. చిన్నారి మృతి

image

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. గత రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన గాలులు వీయడంతో జాజి తండా గ్రామంలో ఓ ఇంటి పైకప్పు కూలిపోయి సంగీత(3)కు గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 19, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ పలు శాఖలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓రెండవ రోజు కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షలు
✓తల్లాడ మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓సత్తుపల్లి మండలం లో ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి పర్యటన
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓ఖమ్మం జిల్లాలో ఓటు నమోదు పై ప్రత్యేక కార్యక్రమం
✓పినపాక మండలంలో ఎమ్మెల్యే పాయం పర్యటన

News March 19, 2024

కొల్లాపూర్: మంచంపైనే పరీక్ష రాసిన విద్యార్థి

image

కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి సాంబశివుడికి నెల కిందట ప్రమాదంలో కాలు విరిగింది. సోమవారం కుమారుడు తెలుగు పరీక్ష రాసేందుకు తల్లిదండ్రులు బయ్యన్న, సుజాత మరో సహాయకుడితో మంచంతో సహా ఆటోలో కొల్లాపూర్ లోని పరీక్ష కేంద్రానికి తరలించారు. ముందస్తు అనుమతితో సాంబశివుడిని మంచంపైనే కూర్చొని పరీక్ష రాయించినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు.

News March 19, 2024

KTDM: ప్రిన్సిపల్‌ వేధింపులు.. విద్యార్థినుల ఆందోళన..!

image

ప్రిన్సిపల్‌, సహాయకులు విద్యార్థినుల హాస్టల్లోకి వచ్చి అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారంటూ భద్రాద్రి జిల్లా ప్రభుత్వ వైద్యకళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ.. ప్రిన్సిపల్‌ విద్యార్థినులుండే హాస్టల్‌కు రాత్రివేళ సిబ్బందితో వచ్చి క్రమశిక్షణ పేరుతో కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొందరితో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రిన్సిపల్‌ వివరణిస్తూ.. ఎప్పుడూ అసభ్యకరంగా మాట్లాడలేదన్నారు.

News March 19, 2024

పదో తరగతి పరీక్షలు..మొదటి రోజు 99.61% హాజరు

image

MBNR:పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు మొత్తం 12,738 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు 59 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెగ్యులర్ విద్యార్థులకు 58 కేంద్రాలు ఏర్పాటు చేయగా గతంలో అనుత్తీర్ణులై మళ్లీ ఫీజు చెల్లించిన వారికి ఒక కేంద్రం ఏర్పాటు చేశారు.జిల్లా కలెక్టర్ రవినాయక్-2,జిల్లాస్థాయిఅధికారులు-7,DEO రవీందర్-6,ప్లయింగ్ స్క్వాడ్స్ 24 కేంద్రాలను తనిఖీ చేశాయి.

News March 19, 2024

NLG: తొలిరోజు 151 మంది గైర్హాజరు

image

పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 109 కేంద్రాల్లో తొలిరోజు తెలుగు పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 19, 326 మంది విద్యార్థులకు గాను 19, 175 మంది పరీక్షకు హాజరయ్యారు. 151 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ హరిచందన జిల్లా కేంద్రంలోని డైట్ ప్రభుత్వ పాఠశాలతో పాటు దేవరకొండ రోడ్డులోని సెయింట్ ఆల్ఫోన్సెస్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

News March 19, 2024

ఇంద్రవెల్లి: గొంతు తడవాలంటే 2KM వెళ్లాల్సిందే..!

image

ఇంద్రవెల్లి మండలం సాలెగూడ గ్రామస్థులకు తాగు నీరు లేక అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో గిరిజనులు గ్రామంలో ప్రతీ ఇంటి ముందు డ్రమ్ములతో కూడిన ఎడ్లబండ్లే దర్శనమిస్తున్నాయి. నీళ్లు కావాలంటే బండి కట్టాల్సిందేనని.. రోజూ సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని పంట చేల వద్దకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం పనులు సైతం వదులుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.