India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర ప్రభుత్వంతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడం నగేష్ అన్నారు. సోమవారం ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీని పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించారు. గతంలో తాను మంత్రి, ఎంపీగా ఉన్నప్పుడే జిల్లాతో పాటు ఇంద్రవెల్లి మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి చేయడం జరిగిందని ఎంపీ నగేష్ గుర్తు చేశారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప రామలింగేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో ఏడాది పాటు కొబ్బరికాయలు, పూజా సామగ్రి అమ్ముకునేందుకు మంగళవారం వేలంపాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో బిల్ల శ్రీనివాస్ తెలిపారు. వేలంలో పాల్గొనే వారు రూ.1.50 లక్షల ధరావత్ సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు. దేవాలయ ఆవరణలో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే వేలంలో ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని ఆయన సూచించారు.
అనాథ విద్యార్థుల చదువుల కోసం ఆదిలాబాద్ జకాత్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు ట్రస్ట్ ఇన్స్‌పెక్టర్ అబ్దుల్ రహీం పేర్కొన్నారు. నర్సరీ నుంచి పీజీ విద్య వరకు అర్హులైన అనాథ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వృత్తి విద్య చదివే నిరుపేద విద్యార్థులు సైతం ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. వివరాల కోసం 93980 71197కి సంప్రదించాలని సూచించారు.
వసతి గృహ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాల రిపోర్టులను సమర్పించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. వర్షాకాల నేపథ్యంలో ప్రతి హాస్టల్లో వైద్య శిబిరాలు నిర్వహించి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు చికిత్సలు చేసి, అవసరమైన మందులను అందించాలని అన్నారు. వసతి గృహలలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక విశ్రాంతి హాలును ఏర్పాటు చేయాలన్నారు.
నిజామాబాద్ నగర బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం నగరంలో శ్రావ్య గార్డెన్‌లో దినేష్ కులాచారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ధర్మపురి అరవింద్, ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరై వారు మాట్లాడుతూ.. నిజామాబాదు అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పడి పనిచేసి ఇందూర్ గడ్డపై కాషాయ జెండా ఎగుర వేసిన కార్యకర్తలకే ఈ విజయం దక్కుతుందన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారులుగా నియమించబడిన అధికారులు ఫీల్డ్ విజిట్ చేయాలని, రోజువారి నివేదిక టూర్ డైరీ మెయింటెన్ చెసి ప్రతీ నెల 5లోగా రిపోర్ట్ సమర్పించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. వన మహోత్సవం సందర్భంగా ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రతీ రోజూ నాటిన మొక్కల వివరాలను పోర్టల్‌లో అప్ లోడ్ చేయాలని అన్నారు.
ప్రజావాణి సందర్భంగా సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల అర్జీలనుపరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం వంద దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
2023-24 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైల్వే రంగం అభివృద్ధికి తెలంగాణకు ప్రాధాన్యం కల్పించారు. తెలంగాణవ్యాప్తంగా రూ.50,848 కోట్లతో 2,647 కిలోమీటర్ల మేర నూతన లైన్లు విస్తరించేలా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూర్ నుంచి జహీరాబాద్‌కు 75 కిలోమీటర్ల మేర సుమారు రూ.1,350 కోట్లతో కొత్త రైల్వేలైన్ వేయనున్నారు. సర్వే పనులు సైతం పూర్తయ్యాయి.
శ్రీనగర్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బోనాల వేడుకల నిర్వహణ కోసం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెక్కులను అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆషాఢ మాసబోనాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతం లో కంటే ఎక్కువ నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ. 15 కోట్లు మంజూరు చేస్తే .. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేసిందన్నారు.
అచ్చంపేట MLA వంశీ కృష్ణకు TG RTC ఛైర్మన్ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఆయన సీఎంకు అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతున్నారు. కేబినెట్‌లో అవకాశం లేకపోవడంతో ఆయనకు ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. NGKL పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా ఆయనకు అనుకూలంగా సీఎంకు లేఖలు ఇచ్చినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు ముందే ప్రకటించే అవకాశం ఉందని టాక్.
Sorry, no posts matched your criteria.