India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ నందు రైతు భరోసా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతు భరోసా పథకాన్ని ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుందో రైతులే చెప్పాలన్నారు. రైతులు సూచించిన మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రైతులకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి కసరత్తు చేస్తోంది. ఇందుకు ఉమ్మడి నల్గొండ సహకార సంఘాల పరిధిలో రూ.2 లక్షల లోపు పంట రుణం తీసుకున్న రైతుల వివరాలను అధికారులు సేకరించారు. ఆయా బ్యాంకుల రికార్డుల ఆధారంగా అర్హులైన రైతుల వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. ఉమ్మడి జిల్లాలో 5.36 లక్షల మంది రైతులు పంట రుణమాఫీ పొందే అవకాశం ఉంది. దీంతో రైతుల సంతోషంలో ఉన్నారు.
భార్యను చంపి భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బేల మండలంలో చోటుచేసుకుంది. సైద్పూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ కుటుంబకలహాల కారణంగా తన భార్య సునీతను కత్తితో పొడిచి దారుణంగా హత్యచేశాడు. అనంతరం తానూ కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. అతడి పరిస్థితి విషమంగా ఉందన్నారు. పోలీసులకు, అంబులెన్సుకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.
అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 8 తులాల బంగారు, 2 తులాల వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం, ఇనుప రాడ్, రెండు మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లొ నిందుతులపై 17 కేసులు ఉన్నట్లు తెలిపారు. సంపత్, పరుశురాం అనే ఇద్దరిని రిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.
నార్కట్‌పల్లి మండలం గోపాలయపల్లి గ్రామంలో శ్రీ వారిజాల వేణు గోపాలస్వామి వారి ఆలయంలో సోమవారం సుదర్శన యాగ సహిత రుద్రయాగం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
మణుగూరు ఏరియా సింగరేణి పాఠశాలలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఇటీవల వే2న్యూస్‌లో కథనం ప్రచురించారు. స్పందించిన సింగరేణి అధికారులు సింగరేణి పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న, విద్యార్థుల సౌకర్యార్థం మూడు బస్సులను సోమవారం ఏర్పాటు చేశారు. సమస్యను పరిష్కరించిన వే2న్యూస్, సింగరేణి అధికారులకు విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
WGL జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. నెక్కొండ మండలం ముదిగొండ వాసి మణిదీప్(10)ను కుక్క కరిసింది. దీంతో MGMలో 3 ఏఆర్వీ ఇంజెక్షన్లను కుటుంబీకులు వేయించి, అనంతరం స్థానిక RMP దగ్గరకి తీసుకెళ్లగా 4వ ఇంజెక్షన్ వేశారు. వేసిన 5నిమిషాలకే బాలుడు కుప్పకూలడంతో 108లో మళ్లీ MGMకు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వైద్యులు, RMPనిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
హేతుబద్ధీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎయిడ్స్ పరీక్ష కేంద్రాలను మూసివేసింది. తొలి విడుతలో చెన్నూర్, మందమర్రిలో గల ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ ట్రైనింగ్ సెంటర్ (ICTC) కేంద్రాలు మూసివేశారు. కాగా ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో చెన్నూర్, మందమర్రి, ఆదిలాబాద్, ఖానాపూర్, ముధోల్‌లో కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో HIV పరీక్షలకు చేయించుకునేందుకు ప్రజులు, గర్భిణులు ఇబ్బంది పడాల్సి వస్తోంది.
గచ్చిబౌలిలోని DLF బిల్డింగ్ గేట్ నంనంబర్-3 వద్ద గోల్కొండ చెఫ్స్ పక్కన టిఫిన్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టిఫిన్ సెంటర్‌లోని కిచెన్‌లో మంటల చెలరేగాయని ప్రత్యక్షసాక్ష్యులు తెలిపారు. ప్రమాద సమయంలో కిచెన్ నుంచి అందరిని బయటికి పంపడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
గచ్చిబౌలిలోని DLF బిల్డింగ్ గేట్ నంనంబర్-3 వద్ద గోల్కొండ చెఫ్స్ పక్కన టిఫిన్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టిఫిన్ సెంటర్‌లోని కిచెన్‌లో మంటల చెలరేగాయని ప్రత్యక్షసాక్ష్యులు తెలిపారు. ప్రమాద సమయంలో కిచెన్ నుంచి అందరిని బయటికి పంపడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Sorry, no posts matched your criteria.