India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
18 ఏళ్లు నిండి కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారికి ఈ నెల 15 వరకు గడువు ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు లేని వారు ఫారం 6 ద్వారా, ఓటర్ ఐడీలో మార్పులు చేర్పులకు ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఫిట్స్‌తో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన వేములవాడలో జరిగింది. ఆదివారం శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఫిట్స్‌కు గురయ్యారు. వెంటనే ఆలయ అధికారులు స్థానికుల సమాచారంతో 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. మరణించినట్లు వేములవాడ టౌన్ ఇన్‌ఛార్జ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. సదరు వ్యక్తి వివరాలు తెలిసిన వారు వేములవాడ పోలీసులను సంప్రదించాలన్నారు.
పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా రఘునాథ్‌పల్లి మండలం ఫతేషాపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండ ఉమేశ్(28) జనగామలో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ ఇబ్బందుల దృష్ట్యా వ్యవసాయ భూమి వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
తండ్రి మందలించాడని మనస్తాపంతో కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI మహేశ్వర్‌రెడ్డి వివరాలు.. గుమ్మడిదల చెందిన బాలేశ్ చిన్న కుమారుడు నవీన్(24) ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు. నవీన్ ఈనెల 4న డబ్బులు అడగ్గా ఏ పని లేకుండా ఎన్ని రోజులు తిరుగుతావని తండ్రి మందలించారు. దీంతో నవీన్ అదే రోజు మధ్యాహ్నం పురుగు మందు తాగి సోదరికి ఫోన్ చేశాడు. సూరారాంరోని ఆసుపత్రిలో తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.
జిల్లాలో దొంగతనాల నివారణకు పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చందనా దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్య కూడళ్లు, నివాసాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వేసవి సెలవుల్లో వేరే ప్రాంతాలకు వెళ్లే వారు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిం చారు. విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి టికెట్ కేటాయింపుల్లో మాదిగలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఒక ప్రకటనలో ఆరోపించారు. తెలంగాణలో అసలు మాదిగలు లేనట్లుగా భావించి.. పూర్తిగా మాదిగలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ఇప్పటికే రెండు స్థానాల్లో మాదిగలకు టికెట్లు కేటాయించిందని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి టికెట్ కేటాయింపుల్లో మాదిగలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఒక ప్రకటనలో ఆరోపించారు. తెలంగాణలో అసలు మాదిగలు లేనట్లుగా భావించి.. పూర్తిగా మాదిగలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ఇప్పటికే రెండు స్థానాల్లో మాదిగలకు టికెట్లు కేటాయించిందని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు ముగిసేవారు వరకు గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరగదని తెలిపారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చికెన్ ధర రూ.294 పలుకుతోంది. వారంలోనే ఏకంగా రూ.50 పెరగడంతో మధ్య తరగతి వాళ్లు కొనేందుకు వెనకాడుతున్నారు. వేసవి కావడంతో అధిక ఉష్ణోగ్రతకు కోళ్లు చనిపోతుంటాయి. దీనికి తోడు పెళ్లిళ్లు, రంజాన్ నేపథ్యంలో హరీస్ తయారీకి ఎక్కువగా చికెన్ వాడటం వల్ల డిమాండ్ పెరిగింది. చికెన్ రూ.350వరకు పెరిగే అవకాశం ఉంది. కోళ్ల ఎగుమతిలో రాష్ట్రంలోనే ఉమ్మడి పాలమూరు మొదటి స్థానంలో ఉంది.
✓ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
✓అశ్వారావుపేట మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
✓ఖమ్మంలో ఎంపీ రవిచంద్ర పర్యటన
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
Sorry, no posts matched your criteria.