India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రెండురోజుల విరామం అనంతరం సోమవారం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రారంభమయింది. దీంతో పత్తి తరలివచ్చింది. అయితే గతవారంతో పోలిస్తే ఈరోజు పత్తి ధర తగ్గింది. గత శుక్రవారం రూ.7,460 పలికిన క్వింటా పత్తి.. నేడు రూ.7,310 పడిపోయింది. ధర అధికంగా పలుకుతుందని ఎంతో ఆశతో పత్తిని మార్కెట్‌కి తీసుకొని రాగా.. ధర తగ్గడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
వర్షాకాలం ప్రారంభమయ్యాక జూన్ చివరి లేదా జులై మొదటి వారంలో కృష్ణా నదికి వరద నీరు వచ్చేవి. గత రెండేళ్లుగా వర్ష ప్రభావం లేకపోవడంతో కేఎల్ఐ ద్వారా ప్రస్తుతం తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని ఎత్తిపోస్తున్నారు. సాగు అవసరాలకు నీళ్లు వదలడం లేదు. దీంతో వానాకాలం పంటలు సాగు చేస్తున్న రైతులు బోరుబావుల పైనే ఆధారపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో కొంత ఉపశమనం పొందిన వరద కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ వారాంతంలో (శుక్ర,శనివారాల్లో) నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి 238 మంది పట్టుబడినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు. వివిధ కూడళ్లు, ప్రధాన రహదారుల్లో పరీక్షలు నిర్వహించారు. పట్టుబడిన వారిలో 184 మంది ద్విచక్ర వాహనదారులు, 13 మంది ఆటో డ్రైవర్లు, 39 మంది కారు డ్రైవర్లు, ఇద్దరు భారీ వాహనాల డ్రైవర్లు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.
అదనపు కట్నం తేవాలని వేధించిన భర్తపై భార్య ఫిర్యాదు చేసింది. CI రవి వివరాల ప్రకారం.. జమ్మకుంట మం. మాచనపల్లికి చెందిన స్రవంతి, ఇల్లందకుంట మం.కి చెందిన సదయ్యకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఉద్యోగరిత్యా వీరు న్యూజిలాండ్‌లో ఉండి గతేడాది HYDకి వచ్చారు. అయితే రూ.20లక్షల అదనపు కట్నం తేవాలని భార్యను నెలక్రితం పుట్టింటికి పంపాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదుతో అత్త, బావతో పాటు.. భర్తపై కేసు నమోదైంది.
హసన్‌పర్తి మం.లోని ఆరెపల్లికి చెందిన చందన అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. చందనకు అదే గ్రామానికి చెందిన జంపన్నతో గతేడాది ప్రేమ వివాహం జరిగింది. అయితే పెళ్లయిన 3 నెలల తర్వాత వరకట్నం కోసం భర్త, అత్తమామ, ఆడబిడ్డ వెంకటమ్మ మానసికంగా వేధించేవారు. దీంతో ఈనెల 7న పురుగు మందు తాగగా KNR ఆసుపత్రిలో ఆదివారం రాత్రి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో సోమవారం ముత్తంగి అలంకారంలో దర్శనమిచ్చారు. తెల్లవారుజామునే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి కసరత్తు చేస్తోంది. ఇందుకు ఉమ్మడి నల్గొండ సహకార సంఘాల పరిధిలో రూ.2 లక్షల లోపు పంట రుణం తీసుకున్న రైతుల వివరాలను అధికారులు సేకరించారు. ఆయా బ్యాంకుల రికార్డుల ఆధారంగా అర్హులైన రైతుల వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. ఉమ్మడి జిల్లాలో 5.36 లక్షల మంది రైతులు పంట రుణమాఫీ పొందే అవకాశం ఉంది. దీంతో రైతుల సంతోషంలో ఉన్నారు.
పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు భర్తీ చేసేందుకు ప్రభుత్వం దోస్త్ ద్వారా అడ్మిషన్ల చేపట్టింది. ఇప్పటికి మూడు దశల్లో అడ్మిషన్లు చేపట్టగా.. ఉమ్మడి జిల్లాలోని 93 కళాశాలల్లో 31 వేల సీట్లు ఉండగా కేవలం 9,709 మంది విద్యార్థులు మాత్రమే చేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వం కొత్తగా ఆరు డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసింది.
వాజేడు మండలం చీకుపల్లి వద్ద ఉన్న బొగతా జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు. వరుసగా వర్షాలు కురవడంతో జలపాతానికి భారీగా వరద వచ్చి చేరుతుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకురాలు బొగతా జలపాతం పక్కన నీటిలో స్నానాలు చేస్తూ సందడి చేస్తున్నారు. బొగత అందాలకు మంత్రముగ్ధులై సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా గడుపుతున్నారు.
బామ్మర్ది దాడిలో బావ మృతిచెందిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా కుకునూరు మం. తిప్పాపురం గ్రామానికి చెందిన రాజు(35) దంపతులు భార్య ఫ్యామిలీతో కలిసి జవహర్‌నగర్‌లో ఉంటున్నారు. శనివారం రాత్రి రాజు మద్యం మత్తులో భార్య, అత్తపై చేయి చేసుకున్నాడు. దీంతో బామ్మర్ది చందు పక్కనే ఉన్న చెక్కతో తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన రాజును గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు.
Sorry, no posts matched your criteria.