Telangana

News September 5, 2024

వరద బాధితులను పరామర్శించిన మంత్రి పొంగులేటి

image

పాలేరు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. వరదల వల్ల ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడారు. ఆందోళన చెందవద్దని అందరికీ ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకుడు రామ్ రెడ్డి, శ్రీ చరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News September 5, 2024

బాధితుల ఖాతాల్లో రూ.10 వేల తాత్కాలిక సాయం: మంత్రి

image

మున్నేటి వరదతో సర్వస్వం కోల్పోయిన బాధితుల ఖాతాల్లో గురువారం నుంచి రూ.10వేల తాత్కాలిక సాయం జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం కేఎంసీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. వరదలు తగ్గిన 40 గంటల్లోనే పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చామన్నారు. ముంపుతో పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు.

News September 5, 2024

హిమాయత్‌నగర్: అక్రమ ప్రకటనలపై హైడ్రా గురి

image

హైడ్రా నగరంలోని అక్రమ ప్రకటనలపై దృష్టి సారించింది. నగరంలో వేలాదిగా ఉన్న అనుమతిలేని ప్రకటన బోర్డులను తొలగించేందుకు సిద్ధమైంది. బుధవారం హిమాయత్‌నగర్ హైవే డివైడర్‌పై ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డులను సిబ్బంది తొలగించారు. ఆయా ప్రకటనలకు అనుమతి లేదని, జీహెచ్ఎంసీ ఆదాయానికి గండి కొడుతూ ప్రకటన సంస్థలు ఏర్పాటు చేసిన బోర్డులన్నింటినీ తీసేస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.

News September 5, 2024

నల్గొండ: పెరిగిన ఉల్లి ధరలు

image

మార్కెట్‌‌లో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. వాటిని కొనాలంటేనే సామాన్యుడు వణికి పోతున్నాడు. నిన్నమొన్నటి వరకు కాస్త పరవాలేదు అనుకున్న ఉల్లి ధర ఇప్పడు ఘాటెక్కింది. వారం రోజుల్లోనే ఉల్లి ధరలు 30-50 శాతం వరకు పెంచారు. ఉమ్మడి జిల్లాలో హోల్సేల్ మార్కెట్లలో తెల్ల ఉల్లిగడ్డల ధర రూ.కిలో 70, ఎర్ర ఉల్లిగడ్డలు కిలో రూ.60కు చేరుకున్నాయి. రిటైల్ వ్యాపారులు వాటికి అదనంగా రూ.10 పెంచి విక్రయిస్తున్నారు.

News September 5, 2024

వరంగల్: దీప్తి జీవాంజి ఫస్ట్ కోచ్ మృతి

image

WGL జిల్లాలో విషాదం నెలకొంది. దేశానికి కాంస్యం తీసుకొచ్చిన దీప్తి జీవాంజి ఫస్ట్ కోచ్ బుధవారం మృతి చెందారు. RDF స్కూల్‌లో PETగా పనిచేసిన వెంకటేశ్వర్లు మొదటగా దీప్తి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. దీప్తి విజయం వెనక ఉన్న ప్రధాన వ్యక్తుల్లో ఒకరుగా నిలిచారు. గత 6-7 ఏళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బుధవారం మృతి చెందారు. జాతీయ స్థాయి క్రీడల్లో ఎందరో విద్యార్థులు రాణించడానికి ఈయన కృషి చేశారు. SHARE

News September 5, 2024

ఖమ్మం: శెభాష్ ఫైర్ సిబ్బంది

image

ఖమ్మం నగరంలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో జిల్లా అగ్నిమాపక శాఖాధికారి అజయ్ కుమార్ ఆధ్వర్యాన వివిధ ప్రాంతాల సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వరదలో చిక్కుకున్న బాధితులను బయటకు తీసుకురావడంలో పాలుపంచుకున్న వారు ఇప్పుడు బురద, చెత్త పేరుకుపోయిన ప్రాంతాల్లో స్థానికులకు సహకరిస్తున్నారు. మొత్తంగా 11 వాహనాలతో మొత్తం వంద మందికి పైగా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.

News September 5, 2024

HYD: హైడ్రాకు హైకోర్టు నిషేధాజ్ఞలు

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి పరిధి హస్మత్‌పేటలోని 13.17 ఎకరాలకు సంబంధించి NVN కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌పై తక్షణ చర్యలు తీసుకోకుండా… హైడ్రా, ఇతర అధికారులపై తెలంగాణ హైకోర్టు నిషేధాజ్ఞలు జారీ చేసింది. పూర్తి విచారణ చేపట్టిన అనంతరం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది.

News September 5, 2024

HYD: హైడ్రాకు హైకోర్టు నిషేధాజ్ఞలు

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి పరిధి హస్మత్‌పేటలోని 13.17 ఎకరాలకు సంబంధించి NVN కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌పై తక్షణ చర్యలు తీసుకోకుండా… హైడ్రా, ఇతర అధికారులపై తెలంగాణ హైకోర్టు నిషేధాజ్ఞలు జారీ చేసింది. పూర్తి విచారణ చేపట్టిన అనంతరం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది.

News September 5, 2024

MBNR: నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

image

తొట్టిలో పడి చిన్నారి మృతి చెందింది. స్థానికుల సమాచారం.. గండీడ్ మం. రుసుంపల్లికి చెందిన హరి దంపతులకు ఇద్దరు పిల్లలు. బుధవారం పిల్లలను తాత వద్ద వదిలి వారు పొలానికి వెళ్లారు. కూతురు గౌతమి ఆడుకుంటూ వెళ్లి పశువులకు నీళ్లు తాగేందుకు నిర్మించిన తొట్టిలో పడింది. పాపను బయటకు తీసి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 5, 2024

కొత్తగూడెం: డివైడర్‌ను ఢీకొని యువకుడి దుర్మరణం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇందిర కాలనీ వద్ద ఈరోజు తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బూర్గంపహాడ్ మండలం మొరంపల్లి గ్రామానికి చెందిన శశికాంత్ రెడ్డి(17) బైక్‌పై పాల్వంచ నుంచి ఇంటికి వస్తున్నాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.