Telangana

News April 16, 2024

సివిల్స్‌లో మెరిసిన సిద్దిపేట జిల్లా యువకుడు

image

సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రానికి చెందిన బుద్ది అఖిల్ యాదవ్ UPSC-2023 ఫలితాల్లో సత్తా చాటారు. ఆలిండియా స్థాయిలో 321 ర్యాంకుతో విజయ ఢంకా మోగించారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అఖిల్.. ఇప్పటికే ఆలిండియా సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై IPSగా ఢిల్లీలో పనిచేస్తున్నారు. అఖిల్ తాజాగా IASగా ఎంపికయ్యారు. -CONGRATS

News April 16, 2024

రేపు వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా సెలవు ప్రకటించినట్లు తెలిపారు. తిరిగి 18న (గురువారం) నుంచి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

News April 16, 2024

KNR: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

image

వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన ముత్తారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికలు తెలిపిన వివరాలు.. ఓడేడుకు చెందిన మొగిలి రమేష్ (45) ప్రతి రోజు లాగానే తన పంట పొలం వద్దకు మోటారు వేయడానికి ఉదయం వెళ్లి మధ్యాహ్నం వరకు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా మానేరులో కింద పడి ఉండటం చూసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు.

News April 16, 2024

NLG: భానుడి భగ భగ..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం పది గంటలు దాటితే బయటికి రావాలంటే జంకుతున్నారు. రెండు, మూడు రోజులు వడగాలులు వీస్తాయని అవసరమైతే  తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. 

News April 16, 2024

వరంగల్ జిల్లాలో ముగ్గురికి సివిల్స్ ర్యాంకులు

image

నేడు విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో ఓరుగల్లు బిడ్డలు సత్తాచాటారు. జిల్లా నుంచి  ముగ్గురు సివిల్స్ సర్వీసుకు ఎంపికయ్యారు. వరంగల్ నగరానికి చెందిన జయసింహారెడ్డికి 103వ ర్యాంకు, గీసుకొండ మండలం అనంతరం గ్రామానికి చెందిన సయింపు కిరణ్ 568వ ర్యాంకు, శివనగర్‌కు చెందిన కోట అనిల్ కుమార్‌ 764 ర్యాంకు సాధించారు. వీరిలో జయసింహారెడ్డికి ఐఏఎస్, కిరణ్‌కు ఐపీఎస్, అనిల్ కుమార్‌కు ఐఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉంది.

News April 16, 2024

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

జూలూరుపాడు మండలం పడమట నర్సాపురంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కిలారు నరసింహారావు అనే వ్యక్తి మృతి చెందాడు. బేతాళపాడుకి చెందిన కిలారు నరసింహారావు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

News April 16, 2024

మెదక్: మంజీరా నదిలో యువకుడి మృతదేహం

image

మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతనశెట్టిపల్లి శివారులోని మంజీరా బ్రిడ్జి కింద గుర్తుతెలియని వ్యక్తి మృతిదేహం లభ్యమైంది. మంజీరాలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు ఎవరు..? ఎలా చనిపోయాడు అనేది తెలియాల్సి ఉంది.

News April 16, 2024

GET READY: హైదరాబాద్‌ సిద్ధం

image

రేపటి శ్రీ రామనవమి వేడుకలకు హైదరాబాద్‌ సిద్ధమైంది.‌ రాముడి శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ రావు తెలిపారు. మంగళవారం శోభాయాత్ర ముగింపు ప్రాంగణమైన సుల్తాన్‌బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలను ఆయన సందర్శించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో యాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.

News April 16, 2024

GET READY: హైదరాబాద్‌ సిద్ధం

image

రేపటి శ్రీ రామనవమి వేడుకలకు హైదరాబాద్‌ సిద్ధమైంది.‌ రాముడి శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ రావు తెలిపారు. మంగళవారం శోభాయాత్ర ముగింపు ప్రాంగణమైన సుల్తాన్‌బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలను ఆయన సందర్శించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో యాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.

News April 16, 2024

మళ్లీ BRSలో చేరిన జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్ధన్

image

ఇటీవల బీజేపీ కండువా కప్పుకున్న ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్ధన్ తోపాటు పలువురు నాయకులు తిరిగి మంగళవారం బీఆర్ఎస్‌లో చేరారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వారు సొంతగూటికి చేరుకున్నారు. బీజేపీలో సరైన ప్రాధాన్యత, గుర్తింపు లేకపోవడం వల్లనే మళ్లీ బీఆర్ఎస్‌లో చేరినట్లు తెలిపారు. కేటీఆర్ వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.