Telangana

News July 15, 2024

తిరుమలాయపాలెం: నాలుగు డెంగ్యూ కేసులు

image

తిరుమలాయపాలెం మండలంలోని జల్లేపల్లిలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. గ్రామంలో 100 మందికి పైగా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తుండగా.. పారిశుద్ధ్య లోపమే కారణమని స్థానికులు అంటున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకున్న వారిలో ఇప్పటి వరకు 9 మందికి డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ కాగా, ఆదివారం తాజాగా మరో 4 కేసులు నమోదయ్యాయి. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

News July 15, 2024

భువనగిరి: నాడు తండ్రి.. నేడు కొడుకు సూసైడ్

image

ఓ యువకుడు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల, స్థానికుల వివరాలు.. వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామానికి శంకరయ్య- శ్యామల దంపతుల రెండో కుమారుడు శివ(20) ఇంటీ వద్దనే ఉంటూ వ్యవసాయ కూలీ పనులు చేస్తున్నాడు. రోజు పని దొరకకపోవడంతో ఆర్థిక సమస్యతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకున్నాడు. శివ తండ్రి గత ఏడాది భర్త, ఇప్పుడు కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లి శ్యామల కన్నీరుమున్నీరవుతోంది.

News July 15, 2024

KNR: వీడిన మృతదేహం మిస్టరీ

image

ముత్తారం-పారుపల్లికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన గుర్రాల వాగు వద్ద వ్యవసాయ బావిలో ఈనెల 8న లభ్యమైన మహిళ మృతదేహం మిస్టరీ వీడింది. మృతదేహం గుర్తించేందుకు మంథని సీఐ వెంకటేశ్వర్లు, ముత్తారం ఎస్సై మధుసూదన్ రావు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ముత్తారం మండల కేంద్రంలోని కాసర్ల గడ్డకు చెందిన రాజేశ్వరిగా గుర్తించినట్లు మంథని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

News July 15, 2024

ఆర్టీసీ బస్సు దగ్ధం.. క్షతగాత్రులు వెళ్లే!

image

RTC బస్సు ప్రమాదం బాధితులు మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో లక్ష్మీదేవి(అనంతపురం), సంజీవ(అనంతపురం), మోహన్‌(HYD), మైథిలి(HYD), కార్తిక్‌ (నంద్యాల), దస్తగిరి(నంద్యాల), హీరాలాల్‌ (HYD), అర్చన(HYD), సునిల్‌ (అనంతపురం), గాయత్రి(అనంతపురం)తో పాటు మరికొందరు ప్రయాణికులు చికిత్స పొందుతున్నారు. 15 మందికి పైగా క్షతగాత్రులు ఉండగా అందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

News July 15, 2024

పటాన్‌చెరు MLA పార్టీ మార్పుపై.. జోరుగా చర్చలు

image

పటాన్‌చెరు MLA మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం స్థానికంగా చర్చనీయాంశమైంది. మహిపాల్‌రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్‌లో చేరికపై చర్చ జరపగా ఇందుకు పలువురు ఆసక్తి చూపనట్లు తెలిసింది. మరోవైపు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నాయకులు ఆయన్ని చేర్చుకోవద్దని అంటున్నారు. స్థానిక కాంగ్రెస్ నేత శ్రీనివాస్‌గౌడ్‌ వర్గం రహస్య సమావేశంతో ఆయన చేరికతో పార్టీ చీలిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

News July 15, 2024

HYD: మహిళపై అత్యాచారయత్నం

image

మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘటన అల్వాల్ PSపరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాజీ‌నగర్‌కు చెందిన మహిళ శనివారం యాప్రాల్ నుంచి ఆటోలో అల్వాల్‌కు వచ్చింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఎక్కి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. లోతుకుంటలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించగా.. ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 15, 2024

HYD: మహిళపై అత్యాచారయత్నం

image

మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘటన అల్వాల్ PSపరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాజీ‌నగర్‌కు చెందిన మహిళ శనివారం యాప్రాల్ నుంచి ఆటోలో అల్వాల్‌కు వచ్చింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఎక్కి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. లోతుకుంటలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించగా.. ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 15, 2024

నిర్మల్: నాఖాబందిలో 664 కేసులు నమోదు

image

నిర్మల్ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఆదేశాల మేరకు శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన నాకాబంది(ప్రత్యేక తనిఖీ)లో మొత్తం 664 కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాటిలో హెల్మెట్ లేనివారు 565, డ్రైవింగ్ లైసెన్స్ 7, సీట్ బెల్ట్ 5, రాంగ్ డ్రైవింగ్ 9, ట్రిపుల్ డ్రైవింగ్ 7, నంబర్ ప్లేట్ 66, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ 2, మైనర్ డ్రైవింగ్ 2 కేసులను నమోదు చేసినట్లు వెల్లడించారు.

News July 15, 2024

WGL: అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి

image

ఏడో తరగతి చదివే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి దర్గా కాజీపేటలో చోటుచేసుకుంది. ఎస్సై వై.సుధాకర్ రెడ్డి వివరాల ప్రకారం.. బాలిక(13) ఓ ప్రైవేటు పాఠశాల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. రాత్రి 7:30 సమయంలో తల్లి బయటకు వెళ్లి వచ్చిన అరగంటలో ఇంట్లో ఉరేసుకుని మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.

News July 15, 2024

ఆత్మకూరు: చెరువుకట్టపై పడుకున్న మొసళ్లు

image

ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామ శివారులోని చెరువు కట్టపై ఆదివారం రాత్రి మొసళ్ల సంచారించాయి. జూరాల ఎడమ కాలువ నుంచి నేపథ్యంలో విడుదలవుతున్న నీరు గ్రామ చెరువుకు చేరుతుంది. ఈ క్రమంలో ఇవి చెరువు కట్టపైకి వచ్చాయి. రాత్రి ఆటుగా వెళ్లిన చిన్నారులు విషయాన్ని కుటంబీకులు చెప్పారు. ఆత్మకూరు నుంచి మూలమల్ల మీదుగా నందిమల్ల, జూరాల ప్రాజెక్టుకు వెళ్లేవారు దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.